Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూరియా, ఎల్‌.పీ.జీ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు దేశీయ గ్యాస్ స‌ర‌ఫ‌రా కోసం స‌రికొత్త‌ మార్కెటింగ్ మార్జిన్


యూరియా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్ప‌త్తిదారు సంస్థ‌ల‌కు దేశీయంగా గ్యాస్ స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సంబంధించి మార్కెటింగ్ మార్జిన్ ను నిర్ణ‌యించే ప‌ద్ధ‌తికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఈరోజు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించింది. గ్యాస్ ను విక్ర‌యించ‌డానికి సంబంధించిన వ్య‌యం అద‌న‌పు రిస్క్ ను భ‌రించినందుకు త‌న వినియోగ‌దారుల వ‌ద్ద నుంచి గ్యాస్ మార్కెటింగ్ కంపెనీ వ‌సూలు చేసే చార్జీనే మార్కెటింగ్ మార్జిన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది గ్యాస్ వ్య‌యం లేదా మూల ధ‌ర (బేసిక్ ప్రైస్‌) క‌న్నా అధికంగా ఉంటుంది. ప్ర‌స్తుతం స‌హ‌జ‌వాయువులు స‌ర‌ఫ‌రా చేయ‌డం కోసం వేరువేరు ర‌వాణా సంస్థ‌లు భిన్న‌మైన మార్కెటింగ్ ఛార్జీల‌ను వ‌సూలు చేస్తున్నాయి. తాజా తీసుకున్న నిర్ణ‌యం వ్య‌వ‌స్థాగ‌తంగా చేప‌ట్టిన ఒక సంస్క‌ర‌ణ చ‌ర్య అని చెప్పాలి. ఈ నిర్ణ‌యంతో యూరియా, ఎల్పీజీ వంటి నియంత్రిత రంగాల‌కు డొమెస్టిక్‌ గ్యాస్ ను విక్ర‌యించే సంస్థ‌లు వ‌సూలు చేస్తున్న మార్కెటింగ్ మార్జిన్ లో ఏక‌రూప‌త సాధ్య‌ప‌డుతుంది. యూరియా, ఎల్పీజీ ఉత్ప‌త్తిదారు సంస్థ‌లు చెల్లించే మార్కెటింగ్ మార్జిన్ ఇదివ‌ర‌క‌టి క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌బోతున్న‌ది. అంతేకాకుండా ఈ రేటును వివ‌క్ష‌కు తావు ఉండ‌ని రీతిలో ఖ‌రారు చేస్తారు. మార్కెటింగ్ మార్జిన్‌ల‌లో ఉంటూ వ‌స్తున్న బోలెండంత‌ వ్య‌త్యాసం ఉండ‌టాన్ని పెట్రోలియం, స‌హ‌జ‌వాయువుల నియంత్ర‌ణ మండ‌లి (పి.ఎన్‌.జీ.ఆర్‌.బి) ప‌రిశీలించి చేసిన సిఫార్సుల ఆధారంగా ఈరోజు మార్కెటింగ్ మార్జిన్‌ను ఖ‌రారు చేశారు. ఇక మీద‌ట కూడా మార్కెటింగ్ మార్జిన్‌లో పెంపుద‌ల అంశాన్ని పెట్రోలియం, స‌హ‌జ‌వాయువుల మంత్రిత్వ‌శాఖ స్వ‌యంగా తానే నిర్ణ‌యించ‌నున్న‌ది. స‌రికొత్త నిర్ణ‌యం దేశ గ్యాస్ ప్రాథ‌మిక స‌దుపాయాల రంగంలోకి రాగ‌ల భావి పెట్టుబ‌డుల విష‌యంలో ఒక ఖ‌చ్చిత‌త్వాన్ని, పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంపొందించే ఆస్కారం ఉంది.