Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యోగదా సత్సంగ్ మఠం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యాసం

యోగదా సత్సంగ్ మఠం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన అనంతరం  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యాసం

యోగదా సత్సంగ్ మఠం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన అనంతరం  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యాసం


యోగి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈ రోజు మార్చి నెల 7వ తేదీ. సరిగ్గా 65 సంవత్సరాల క్రితం ఇదే రోజున, యోగానంద మనల్ని విడిచి దివ్య లోకాలకు వెళ్లిపోయారు. శరీరంలో బందీగా వున్న ఆయన ఆత్మకు స్వేచ్ఛ లభించి.. అది పరమాత్మలో విలీనమైంది.

ఈ సందర్భంగా నేను శ్రీ శ్రీ మాతా జీ కి నా ప్రణమిల్లుతున్నాను. లాస్ ఏంజెల్స్ లో ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నారని నాకు తెలిసింది.

ప్రపంచంలో 95 శాతం మంది ప్రజలు వారి వారి మాతృ భాషలో యోగీ జీ ఆత్మకథను చదువుకోగలుగుతున్నారని స్వామీ జీ చెప్పారు. ఇక్కడ నాకు ఒక విషయం స్ఫురణకు వస్తోంది..ఈ దేశం గురించి ఏమాత్రం తెలియని మనిషి, ఈ దేశంలోని భాషల గురించి, ఆచార వ్యవహారాల గురించి తెలియని వ్యక్తి యోగీ జీ గురించి చదవడానికి ఎందుకంత ఉత్సుకత చూపుతున్నాడు ? ఆయన ఆలోచనల్ని ఇతర భాషలలో తర్జుమా చేయడం వెనుక గల కారణం ఏమై ఉంటుంది ? ఇలా ఎందుకు జరుగుతున్నదంటే, వారికి వచ్చిన ఆధ్యాత్మిక చైతన్యమే దీనికి కారణం. యోగీ జీ ఆశీస్సులలో కొన్నింటిని ఇతరులకు పంచాలనే సత్సంకల్పమే దీనికి కారణం. మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో- అలా వారు చేస్తున్నారు. దేవాలయంలో మనకు లభించిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఆ తరువాత దానిని చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకొని ఎంత మందికి వీలయితే అంత మందికి పంచుతాం. ప్రసాదం మనది కాదు; దానిని మనం తయారు చేయలేదు. కానీ, దాని లోని పవిత్రత కారణంగా దానిని పంచడం ద్వారా మనకు అలౌకికానందం వస్తుంది.

యోగీ జీ చెప్పిన సత్యాలను ఇతరులకు తెలియజేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక‌ ఆనందాన్ని పొందుతున్నాం. ఇదీ ప్రసాదాన్ని పంచడం లాంటిదే. విముక్తిప థం గురించి ఇక్కడ చర్చలు జరుగుతున్నట్టే, భవిష్యత్ గురించి చెప్పగలిగే వారు ఉన్నారు. యోగీ జీ ప్రయాణం కేవలం విమక్త పథం గురించి చెప్పడం లేదు, అది అంతర్గత ప్రయాణం గురించి కూడా చెబుతోంది. నీలో నీవు ఎంత లోతు వరకు చూడగలుగుతావు.. అక్కడే ఇమిడిపోయి ఎంత‌ కాలం పాటు ఉండగలవు ? తప్పులు చేయడం మానవ సహజం. ఆధ్యాత్మికత అనేది అనంతమైన పవిత్ర యాత్ర. ఈ ప్రయాణంలో మనం సరైన సమయంలో, విజయవంతంగా ముందుకు సాగడానికిగాను మన సాధువులు, సన్యాసులు, పండితులు, అధ్యాపకులు, ప్రవక్తలు మనకు మార్గాన్ని చూపెట్టారు. మార్పులు చేర్పులతో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది.

యోగీ జీ చాలా తక్కువ సమయమే జీవించారు. దాని వెనుక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండి ఉండవచ్చు. హఠ యోగలోని అనే సకారాత్మక పార్శ్వాలను యోగీ జీ ఆవిష్కరించారు. ఒకే విషయానికి ప్రాధాన్యమిచ్చే వారు తరచుగా ఇతర విషయాల జోలికి పోతారని తెలిసి కూడా ఆయన అలా చేశారు. క్రియ యోగ వైపు ఆకర్షితులయ్యేలా ఆయన అనేక మందికి స్ఫూర్తి కలిగించారు. యోగాలోని అనేక రూపాల్లో క్రియయోగకు ప్రత్యేక స్థానం వుందని నేను ఇప్పుడు భావిస్తున్నాను. మన అంతర్గత ప్రయాణాన్ని ఇది బలోపేతం చేస్తుంది. యోగాలో కొన్నింటికి భౌతికపరమైన బలం కావాలి. కానీ క్రియా యోగకు మానసిక బలం అవసరం. అప్పుడే జీవితకాల లక్ష్యాలను అందుకోగలుగుతాం. చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి లక్ష్యాలు ఉంటాయి. అనారోగ్యం పాలై జీవితంలో చివరి రోజులను ఆసుపత్రి పడక మీద గడిపే దుస్థితి తనకు రాకూడదని యోగీ జీ అనే వారు.

మాతృభూమిని స్మరించుకుంటూ ఏ సమయంలోనైనా వీడ్కోలు పలుకుతానని ఆయనంటారు. దాని అర్థం- ఆయన భారతదేశానికి వీడ్కోలు పలికి, పాశ్చాత్య ప్రపంచంలో చైతన్యం రగిలించడానికి అలా చేస్తున్నారని- గ్రహించాలి. అయితే, ఆయన ఒక్క క్షణం కూడా మాతృభూమికి దూరంగా జరగలేదు.

నేను నిన్న కాశీలో ఉన్నాను. రాత్రి బెనారస్ నుండి వచ్చాను. యోగి ఆత్మకథను చదివాను. ఆయన గోరఖ్ పుర్ లో జన్మించారు. ఆయన బాల్యం బెనారస్ లో గడచింది. ఆయన పవిత్ర బెనారస్ సంప్రదాయాలను తెలుసుకున్నారు. గంగమ్మ మృదువైన స్పర్శతో పెరిగారు. ఈ చైతన్యమనేది ఆయన బాల్యదశను రూపొందించింది. ఆయన ఆధ్యాత్మిక బలమనేది గంగా ప్రవాహం లాగా ఆయన హృదయంలోకి చేరుకుంది. ఇదే ఆధ్యాత్మిక ప్రవాహం ఇప్పుడు మన హృదయాల్లోనూ ఉంది. ఆయన స్వర్తస్తులయ్యే సమయానికి ఆధ్యాత్మికంగా చాలా చురుకుగా ఉన్నారు. భారతీయ రాయబారి కోసం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ఉపన్యాసమిస్తూ ఉన్నారు. దేశభక్తి, మానవత ల మీద అందరినీ ఆకట్టుకునే అద్భుతమైన సత్యాలు చెబుతూ, ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఆధ్యాత్మిక ప్రయాణపు చివరి గమ్యం గురించి అద్భుతమైన వివరణే ఆయన చివరిసారిగా పలికిన పలుకులు. అది కూడా ఒక ఆధికారిక కార్యక్రమంలో ఆయన తన సందేశాన్నిచ్చారు. యోగీ జీ ఈ ప్రదేశం గురించి మాట్లాడుతూ గంగమ్మ, అడవులు, హిమాలయాలు, గుహలు, ప్రతి మనిషి కలగనే దైవం ఇక్కడే ఉన్నాయని అనే వారు. ఆయన మనోనేత్రంలో దాగిన విస్తారమైన భావాలు ఎలా ఉండేవో, ఒకసారి ఊహించండి..

‘ఈ నా శరీరం ఆ మాతృభూమిని స్పర్శించినందుకు నేనెంతో ధన్యుడిని అయ్యాను’. ఇవి ఆయన శరీరం నుండి వెలువడిన ఆఖరి పలుకులు. ఆ తరువాత ఆయన ఆత్మ అనంత లోకాల వైపునకు వెళ్లిపోయింది. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం గురించి చెప్పారు. పరమాత్మను వెతుక్కుంటూ వెళ్లి విలీనమయ్యే ఆత్మ సిద్ధాంతమే ఇది. ఆది శంకరాచార్యుల ప్రకారం మార్పు లేని ఒకే ఒకటి పరమాత్మ. అది మాత్రమే వాస్తవం. మార్పులు పొందే వాటికి సంపూర్ణమైన అస్తిత్వం ఉండదు. అద్వైతంలో నీవు, నేను అనేవి ఉండవు. దేవుడు, నేను వేరు వేరు అనే ఆలోచన అందులో లేదు. పరమాత్మ నాలో ఉంది.. నేను పరమాత్మలో ఉన్నాను..ఇదే అద్వైతం అని యోగీ జీ అనే వారు. ఈ విషయాన్ని చాలా సూక్ష్మంగా ఆయన తన కవితలో వెలువరించారు. అందులో ఉన్నట్టుగా కచ్చితంగా నేను ఇక్కడ వివరించలేను గాని ఈ కవిత పాదాలు చదివినప్పుడు, ఆ తరువాత వాటి వివరణలు తెలుసుకున్నప్పుడు ఇవి అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా వున్నాయని నేను తెలుసుకున్నాను.

పరమాత్మ నాలోకి చేరింది.. నేను పరమాత్మలో లీనమయ్యాను అని యోగీ జీ చెప్పారు. ఇది అద్వైత సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పడమే. జ్ఙానం, జ్ఞానులు, జ్ఞాన అన్వేషకులు అందరూ ఏకం అవుతారు. అదే విధంగా పని చేసే వారు, పని ఒకటి అయితే ఇక తప్పకుండా విజయం సాధించగలం. ఆ తరువాత పని చేసే వాళ్లకు కార్యాచరణ ఉండదు వారి కోసం కర్మ అనేది ఎదురుచూడదు. పని చేసే వారు, కర్మ అనేవి కలిసిపోతాయి. తద్వారా అంతిమంగా వారికే సొంతమైన ఆనందాన్ని పొందగలుగుతారు.

యోగీ జీ చేసిన మ‌రికొన్ని వ్యాఖ్యలు చూద్దాం.. నిశ్శబ్దంగా ఉండు. ముక్కలు కావద్దు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, చురుకుగా ఉంటూ ఎల్లప్పుడూ జీవించు, వసంతకాలం నాటి నిశ్శబ్దంతో ఉండు, వైవిధ్యమైన నిశ్శబ్దం పాటించు అని అంటారు. గతకాలం నిశ్శబ్దానికి ఇప్పుడు ప్రాధాన్యం లేదు. ఈ రోజున నేను అనంతమైన, సరికొత్తదైన, వినూత్నమైన నిశ్శబ్దాన్ని కోరుకుంటున్నాన‌ని యోగీ జీ చెప్పారు. అంతిమంగా స్వామీ జీ కూడా ‘‘ఓం శాంతి, శాంతి’’ అన్నారు. కఠోర తపస్సుతో లభించే ప్రశాంతతే తప్ప దీనిని ప్రోటోకాల్ లాగా భావించ‌కూడ‌దు. అప్పుడే ‘ఓం శాంతి శాంతి’ ప్రవచనాలు జనిస్తాయి. ఇది ఎవరి ఆకాంక్షలకు ఊహలకు అందని పరిపూర్ణమైన ఆనందాన్ని పొందడంగా గుర్తించాలి. ఈ సమన్వయాన్ని యోగీ జీ తన రచనలలో అద్భుతంగా వర్ణించారు. ఎలాంటి నిర్మాణంలోకయినా చొచ్చుకువెళ్లే గాలిలా జీవితాన్ని యోగీ జీ తీర్చిదిద్దారు. గాలి లేకపోతే మన మనుగడ లేదు. అన్ని కాలాల్లోను, అన్ని చోట్లా గాలి ఉంటుంది. మనం చేతులు ఊపినప్పుడు వాటికి గాలి అడ్డం కాదు. గాలిని ఆగమని ఎప్పుడూ చెప్పొద్దు. దాని ప్రయాణం కోసం పరిసరాల అనుమతి అవసరం లేదు. అదే విధంగా యోగీ జీ మన చుట్టూ ఆవరించి ఉన్నారు. మనకు ఎలాంటి అడ్డంకులను కలిగించని గాలి లాగా ఆయన వ్యాపించి ఉన్నారు. ఈ మనిషి ఈ రోజున తన లక్ష్యాలను అందుకోలేకపోయారు.. అయినా ఫర్వాలేదు.. రేపటి రోజున ఆయన తాను అనుకున్నది సాధిస్తారనేది యోగీ జీ ఆలోచన. ఇలాంటి స్థితప్రజ్ఞత, ఓపిక కొన్ని సంప్రదాయాల్లో, వ్యవస్థల్లో మాత్రమే కనిపిస్తుంది. యోగీ జీ తాను ప్రవేశపెట్టిన విధానాలకు అపరిమితమైన సరళత్వాన్ని అద్దారు. ఒక వ్యవస్థను స్థాపించారు. తరువాత మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఒక శతాబ్దం తరువాత కూడా ఆయన విధానాలు అనంతమైన ఆధ్యాత్మిక చైతన్య ఉద్యమంగా ఆవిష్కారమయ్యాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం నాలుగో తరం ఇక్కడ కృషి చేస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి మాయ లేదు.. లేదా లక్ష్యాన్నుండి పక్కకు వైదొలగడం లేదు. సంస్థాగతమైన స్పర్థలు, వ్యవస్థ కేంద్రంగా ఆదేశాలు ఉండి ఉంటే- వ్యక్తిగతమైన ప్రభావాలు, ఆలోచనలు, పనివేళలు పుట్టుకొస్తాయి. ఇలాంటి ఉద్యమాలు కాల పరిమితులను అధిగమించి విస్తరిస్తాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి.. ఇదంతా కూడా ఎలాంటి సంఘర్షణలు లేని, వర్గాలు లేని తరాల మధ్యన జరుగుతుంది.

యోగీ జీ ప్రపంచానికి అందించిన సేవలలో ముఖ్యమైంది ఎలాంటి పరిమితులు లేని వ్యవస్థను సృష్టించడం. నిత్య కార్యక్రమాల కోసం నియమ నిబంధనలంటూ ప్రత్యేకంగా ఇక్కడ కనిపించవు. యోగీ జీ మన మధ్యన లేకపోయినా ఆయన రూపొందించిన సంస్థ ఇంకా చైతన్యపూరితంగా ఉంటూ అందరినీ మించి పోయి వెలుగొందుతోంది. ఆయన అందించిన ముఖ్య సందేశంలోని గొప్పదనమే అది. ఆయన అందించిన ఆధ్యాత్మిక ఆనందం కారణంగా కూడా మనం ఈ సంస్థను నడుపుతున్నాం.

నా అభిప్రాయం ప్రకారం ఆయన చేసిన ప్రధానమైన సేవ ఇది. నేటి ప్ర‌పంచాన్ని ఆర్ధిక‌, సాంకేతిక రంగాలు ఉర్రూత‌లూగిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు ఈ ప్ర‌పంచాన్ని త‌మదైన దృక్ప‌థాల‌తో అర్థం చేసుకుంటున్నారు. మిమ్మ‌ల్ని నేను నా దృక్ప‌థం ప్ర‌కారం అర్థం చేసుకుంటున్నాను. ఈ అర్థం చేసుకోవ‌డ‌మ‌నేది వారి వారి అవ‌గాహ‌న‌, దృక్ప‌థం, స్వ‌భావం, కాలాన్ని బ‌ట్టి ఉంటుంది. భార‌త‌దేశాన్ని కూడా ఇవే అంశాల‌వారీగా ప్ర‌పంచం అర్థం చేసుకుంటోంది. భార‌త‌దేశ జ‌నాభా, జిడిపి, ఉద్యోగ క‌ల్ప‌న అనే ప్ర‌త్యేక ప్ర‌పంచ‌ శ్రేణి ప‌రామితుల‌ను దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకొంటోంది. అయితే ఈ ప్ర‌పంచం భార‌త‌దేశానికి సంబంధించిన ఓ ప్ర‌త్యేక ప‌రామితిని గురించి ఇంకా తెలుసుకోవలసి ఉంది. అది దేశంలోని ఆధ్యాత్మికత‌. నిజానికి ఇదే దేశానికి బ‌లం. మ‌న దేశం చేసుకున్న దుర‌దృష్ట‌మేమిటంటే- కొంత‌మంది ఆధ్యాత్మిక‌త‌, మ‌తం ఒక‌టే అనుకుంటున్నారు. కులం, వ‌ర్గం, మ‌తం అనే వాటికి, ఆధ్యాత్మిక‌త‌కు పూర్తిగా తేడా ఉంది. మ‌న పూర్వ రాష్ట్ర‌ప‌తి ఎ.పి.జె. అబ్దుల్ క‌లామ్ గారు ప‌దే ప‌దే చెప్పే వారు.. భార‌త‌దేశ బ‌లం ఆధ్యాత్మిక‌తేన‌ని, అది కొన‌సాగాల‌ని ఆయ‌న అనే వారు. మ‌న సాధువులు, స‌న్యాసులు నిరంత‌రం ఈ ఆధ్యాత్మిక‌త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డానికి కృషి చేసే వారు. నా దృష్టిలో యోగా అనేది ఒక సరళమైన
ప్రవేశ స్థానం లాంటిది. ఆత్మ‌వత్ స‌ర్వ‌భూతేషు అని ప్ర‌పంచానికి చెప్ప‌డం స‌బ‌బుగా ఉండదు. ఒకవైపు తిను, తాగు, ఎంచక్కా ఉండు అనే చర్చ జరిగేటప్పుడు అక్కడ తెన్ త్య‌క్తేన్ భుంజితా: అనే సందేశం ఇస్తే, అది మింగుడు పడుతుందంటారా.

కానీ, ఎవ‌రినైనా ఒక ప్ర‌త్యేక‌మైన స్థితిలో కూర్చోవాలని.. వారి నాసికా ద్వారాల‌ను ప‌ట్టుకొని ప్ర‌శాంతంగా కాసేపు ఉండ‌మ‌ని అడిగితే కచ్చితంగా వారు మిమ్మ‌ల్ని అనుస‌రిస్తారు. ఇదే యోగా, మ‌న ప్ర‌త్యేక ప్ర‌యాణానికి ఇది ప్రవేశ స్థానం లాంటిది. దీన్ని అంతిమ ల‌క్ష్యంగా భావించ‌కూడ‌దు. ఏది ఏమైన‌ప్ప‌టికీ- డ‌బ్బు అనేది దానికి ఉన్న బ‌లం వ‌ల్ల అది మ‌రింత‌గా బ‌లోపేత‌ం అవుతుంది. వాణిజ్య వ్యాపార అంశాలు ముందుకువస్తాయి. డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టి మానసిక చైత‌న్యం తెచ్చుకుంటున్నారు.. మ‌రికొంద‌రికి యోగా అనేది అంతిమ విజ‌యం.

యోగా అనేది అంతిమ విష‌యం కాదు. అది మ‌న అంతిమ ప్ర‌యాణంలో ప్రారంభ‌ద్వారం లాంటిది. ప‌ర్వ‌తారోహ‌ణ చేయాలంటే అప్పుడ‌ప్పుడు ఒడుదొడుకులు ఉంటాయి. అయితే వాహ‌నాన్ని నిరంత‌రం ముందుకు తీసుకువెళ్తేనే దానికి త‌గిన గ‌తి, వేగం వ‌స్తాయి.. అదే విధంగా యోగాలో కూడా మొద‌ట్లో స‌రైన రీతిలో ప్ర‌వేశించాలి. యోగాను పూర్తిగా అర్థం చేసుకున్న త‌రువాత ఎలాంటి అడ్డంకులు ఉండ‌వు. తదనంతర క్ర‌మంలో మీరు చేసే ప్ర‌యాణం క్రియా యోగ‌.
మ‌న దేశంలో కాశీ ని త‌లుచుకోవ‌డం చాలా స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌క్రియ‌. క‌బీర్ దాస్ జీ లాంటి సాధుపుంగ‌వుల‌ను తీసుకోండి, వారు చాలా సులువైన ప‌ద్ధ‌తిలో అనేక‌ అంశాల‌ను తెలియజెప్పారు. ఆయ‌న చెప్పిన ఒక సత్యం యోగీ జీ కి వ‌ర్తిస్తుంది. అవ‌ధూత యుగన్ యుగన్ హ‌మ్ యోగి.. ఆవే న జాయ్‌, మిటే న క‌బ‌హూ, స‌బ‌ద్ అనాహ‌త్ భోగీ అని ఆయ‌న చెప్పారు. క‌బీర్ దాస్ జీ ఏమ‌న్నారంటే యోగి యుగ యుగాల వరకు ఉంటాడు.. యోగి రావ‌డం పోవడం అనేది ఉండ‌దు.. యోగికి నాశ‌నం లేదు అని. నేను అనుకుంటున్నాను ఈ రోజు మ‌నమంద‌రం యోగి అందించిన‌ ఆధ్యాత్మిక‌త‌తో క‌లిసి ప్ర‌యాణం చేస్తున్న అనుభూతిని పొందుతున్నామని. అటువంటప్పుడు- సంత్ కబీర్ దాస్ జీ చెప్పిన ‘‘యోగులు పోవడం ఉండదు, రావ‌డం ఉండ‌దు. వారు మ‌న‌తోనే ఉంటారు’’ అనే మాటలు తాత్పర్యసహితాలు అని అనిపిస్తుంది.

యోగిని ద‌ర్శించుకోవ‌డం వల్ల నాకు ఆధ్యాత్మిక సువాస‌న‌లు క‌లిగిన వాతావ‌ర‌ణంలో విలువైన స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ల‌భించింది. మ‌రో సారి యోగి అందించిన అత్య‌ద్భుత‌మైన సంప్ర‌దాయానికి నా విన‌మ్ర‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ దేశ సాధువుల‌కు నా న‌మ‌స్కారాలు. ఈ ఆధ్యాత్మిక ప్ర‌యాణాన్ని నిరంత‌రం కొన‌సాగించ‌డానికి కృషి చేస్తున్న‌ వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇక్క‌డితో ముగిస్తున్నాను.

అంద‌రికీ ధన్యవాదాలు.

***