Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి తొలి పలుకులు

రష్యా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి తొలి పలుకులు


మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందిమిమ్మల్ని కలవడం ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భంగా నేను భావిస్తున్నానుఇది వివిధ అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశాన్ని మనకు కలిగిస్తుంది.

మన ఇరుదేశాలూ నిరంతరం సంప్రదింపులను నిర్వహిస్తూనే ఉన్నాయిఇరుపక్షాల మధ్య అనేక ఉన్నత స్థాయి సమావేశాలు కూడా తరచూ జరుగుతున్నాయిఈ సంవత్సరం డిసెంబరు నెలలో జరగనున్న 23వ భారత్రష్యా సదస్సుకు మిమ్మల్ని స్వాగతించడానికి 140 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గౌరవనీయులారా,

ఇది ప్రత్యేకమైనవ్యూహాత్మకమైన మన భాగస్వామ్య బలాన్నీపరిధినీ ప్రతిబింబిస్తుందిఎటువంటి కష్ట సమయం ఎదురైనా భారత్రష్యా ఒకరి కోసం ఒకరు దన్నుగా కలిసి ఉన్నాయిమన పరస్పర సహకారం ఇరుదేశాల ప్రజలకు మాత్రమే కాకుండా.. ప్రపంచ శాంతిస్థిరత్వంసుసంపన్నతకు చాలా అవసరం.

గౌరవనీయులారా,

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఘర్షణలపై తరచూ చర్చిస్తున్నాంశాంతిని నెలకొల్పడానికి ఇటీవల జరిగిన అన్ని ప్రయత్నాలనూ మేం స్వాగతిస్తున్నాంఅన్ని పక్షాలూ నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని మేం ఆశిస్తున్నాంఈ సంఘర్షణను ముగించి శాశ్వత శాంతిని నెలకొల్పే మార్గాన్ని కనుగొనాలిఇది మొత్తం మానవాళి ఆకాంక్ష.

గౌరవనీయులారా,

మరోసారి నేను మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.

***