Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్  తో  కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్  తో  కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్  తో  కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్  తో  కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్  తో  కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన


గౌరవ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మీడియా మిత్రులారా

రష్యాకు చెందిన పౌరవిమానంపై ఉగ్రవాద దాడులు, సిరియాలో మిలిటరీ విమానం కూల్చివేత వంటి దురదృష్ట సంఘటనల్లో మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియచేయడం ద్వారా నా ప్రసంగం ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ విషాదకర, ఆపత్సమయంలో సంఘీభావంగా రష్యా ప్రజల వెనుక నిలవాలనుకుంటున్నాను.

గౌరవ అధ్యక్షా, మీ వదాన్యతకు, హృదయపూర్వక ఆతిథ్యానికి కృతజ్ఞతలు. భారత-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం నిర్మాత మీరు. మారుతున్న ఈ ప్రపంచంలో కూడా మన ఉభయ దేశాల సంబంధాలు నిలకడగా పురోగతిని, వృద్ధిని సాధించడానికి మీ నాయకత్వం దోహదపడింది.

గౌరవ అధ్యక్షా, మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నేనెప్పుడూ గౌరవించి ప్రోత్సహిస్తాను. భారత రక్షణ, అభివృద్ధి, దౌత్య విజయాలకు ఆ భాగస్వామ్యమే ఒక బలం. మన రెండు దేశాల ప్రజల మధ్య కూడా నిజాయతీతో కూడిన సుహృద్భావం, పరస్పర నమ్మకం నెలకొని ఉన్నాయి.

భవిష్యత్తులో భారత ఆర్థిక పరివర్తనలోను, సమతూకమైన, సుస్థిరమైన, సమ్మిళిత, బహుముఖీన ప్రపంచాన్ని నిర్మించడంలోను రష్యా ప్రధాన భాగస్వామిగా ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను.

గత రెండు రోజులుగా మనం ఎంతో నిర్మాణాత్మకమైన చర్చలు నిర్వహించాం. వాటి ఫలితాలు కూడా ఉత్పాదకంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

ఉభయ దేశాల మధ్య కాలం విసురుతున్న సవాళ్ళను తట్టుకుంటూ ప్రత్యేక భాగస్వామ్యం నెలకొనాలన్న నా కట్టుబాటు మరింత పటిష్ఠం అయింది.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తుకు మనం మరింత పటిష్ఠమైన పునాది వేశాం.

కామోవ్ 226 హెలీకాప్టర్ల తయారీకి ఉభయ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కింద మనం చేపడుతున్నది మా మేక్ ఇన్ ఇండియా ఉద్యమంలో భాగంగా వచ్చిన తొలి భారీ రక్షణ ప్రాజెక్టు. అది కూడా మా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామితో కుదరడం ఈ దిశగా సానుకూల పరిణామం.

ఎన్నో ఇతర రక్షణ ప్రతిపాదనలపై కూడా మనం ఎంతో పురోగతి సాధించాం. ఈ ప్రాజెక్టులు భారత్లో రక్షణ ఉత్పత్తుల తయారీకి కొత్త ఊతం ఇస్తాయి. భారత రక్షణ సన్నద్ధతకు కొత్త తరం పరికరాలు అందిస్తాయి.

అణుఇంధన రంగంలో కూడా మన సహకారం మరింతగా పెరుగుతోంది. రెండు కేంద్రాల్లో 12 రష్యన్ అణు రియాక్టర్లు నెలకొల్పే ప్రతిపాదనల్లో మేం పురోగతి సాధిస్తున్నాం. ఈ రియాక్టర్లలో కూడా భారతదేశంలో తయారైన విడిభాగాల ఉపయోగం పెరిగేందుకు ఈ రోజు కుదిరిన ఒప్పందాలు దోహదపడతాయి. అవి నా మేక్ ఇన్ ఇండియా ఉద్యమానికి మరింత బలంగా నిలుస్తాయి. అధ్యక్షా, పుతిన్ మీరు అందిస్తున్న మద్దతుకు నా కృతజ్ఞతలు.

ప్రపంచంలో హైడ్రోకార్బన్ నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఒకటైన రష్యా భారత ఇంధన భద్రతకు విశ్వసనీయమైన వనరుగా నిలుస్తుంది. ప్రత్యేకించి మన వ్యూహాత్మక భాగస్వామ్యం ఇందుకు దోహదపడుతుంది. అధ్యక్షుడు పుతిన్ మద్దతుతో రష్యన్ హైడ్రోకార్బన్ రంగంలో మేం పెట్టుబడులు మరింతగా పెంచుతున్నాం.

భారత, రష్యా ఆర్థిక బంధాన్ని మరింతగా విస్తరించేందుకు నేను, పుతిన్ కలిసి అడుగేస్తున్నాం. మా ఇద్దరి గత వ్యూహాత్మక శిఖరాగ్రం తర్వాత ప్రపంచంలో ముడి వజ్రాల ఎగుమతిలో అతి పెద్ద దేశం అయిన రష్యా కోసం ఒక ప్రత్యేక నోటిఫైడ్ జోన్ను భారత్ ఏర్పాటు చేసింది. 90 శాతం వజ్రాల ప్రాసెసింగ్తో ప్రపంచంలో అతి పెద్ద వజ్రాల ప్రాసెసింగ్ దేశంగా భారత్ నిలుస్తోంది. ఉభయ దేశాల మధ్య ప్రత్యక్ష వ్యాపారానికి ఈ చొరవ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మేం లాజిస్టిక్స్ పై కూడా కృషి చేస్తున్నాం. మా గ్రీన్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభమయింది. ఇరాన్ మీదుగా నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ వల్ల రవాణా సమయం, వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి.

ఇండియా-యూరేసియన్ ఆర్థిక మండలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కూడా మేం అడుగేస్తున్నాం. సెంట్రల్ ఆసియాలో మాకు ఇది లాభదాయకంగా ఉంటుంది.

ఉభయ దేశాల ప్రైవేటు రంగాలను మరింతగా కలిసిమెలిసి పని చేసేందుకు మేం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడే మేం సిఇఒల వేదిక సమావేశం ఎంతో విజయవంతంగా ముగించుకున్నాం. ఈ రోజు కుదిరిన ఒప్పందాలు, ప్రకటనలతో పరస్పరం పెట్టుబడులు, వాణిజ్యం ఎంతగానో పెరుగుతాయని నాకు ఎంతో విశ్వాసం ఉంది.

అంతర్జాతీయ అంశాలపై కూడా ప్రెసిడెంట్ పుతిన్కు, నాకు మధ్య శక్తివంతమైన సమన్వయం ఉంది. అంతర్జాతీయ సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు మేం బలమైన కట్టుబాటు ప్రకటించాం.

ఐక్యరాజ్యసమితిలో కూడా మా మధ్య బలమైన సమన్వయం ఉంది. బ్రిక్స్, తూర్పు ఆసియా శిఖరాగ్రం, జి 20 వేదికలపైన తాజాగా షాంఘై సహకార సంఘంలోను మా సభ్యత్వం మా భాగస్వామ్యానికి కొత్త శక్తిని అందిస్తోంది. యూరేషియా నుంచి ఆసియా పసిఫిక్కు, సెంట్రల్ ఆసియా, అఫ్గానిస్థాన్లకు ఈ సహకారం విస్తరిస్తుంది.

ప్రపంచం యావత్తు ఐక్యంగా నిలిచి ఉగ్రవాద బృందాలు, దేశాల పట్ల ఎలాంటి వివక్ష, విచక్షణ లేకుండా ఉగ్రవాదంపై పోరాటం విషయంలో కట్టుబాటుతో కృషి చేయాలని మేం కోరుతున్నాం.

పశ్చిమాసియాలో సుస్థిరతను నెలకొల్పి ఉగ్రవాదాన్ని తుదముట్టించడం కోసం చర్చల ద్వారా సత్వర రాజకీయ పరిష్కారం అవసరమని మేం అంగీకరించాం.

నిజమే…మనం నివశిస్తున్న సమయంలో ఎదురవుతున్న సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ ఒక్కటిగా నిలవాలి.

ప్రెసిడెంట్ పుతిన్తో మా బంధం మరింత పటిష్ఠం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఉభయులు కలిసి మా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ, కొత్త ఉత్తేజం కలుగుతూ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ ఏడాది రెండు సార్లు రష్యా సందర్శించడం నాకు ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది బ్రిక్స్ శిఖరాగ్రానికి, భారత-రష్యా వార్షిక శిఖరాగ్రానికి ప్రెసిడెంట్ పుతిన్ను ఆహ్వానించేందుకు నేను ఎదురు చూస్తున్నాను.

ధన్యవాదాలు…