పిఎంఇండియా
రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు. సాహూ మహారాజ్ తన జీవితాన్ని అణగారిన, శ్రమ దోపిడీకి గురైన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు రాబోయే తరాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘రాజర్షి ఛత్రపతి సాహూ జీ మహారాజ్ జయంతి సందర్భంగా వారికి నా గౌరవపూర్వక నివాళులు. ఆయన సామాజిక న్యాయానికి, సమానత్వానికి బలమైన మద్దతుదారు. సమాజంలోని నిరుపేదలు, దోపిడీకి గురైనవారు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు చిరకాలం ఈ దేశానికి స్ఫూర్తినిస్తూ, మార్గదర్శకంగా నిలుస్తాయి’’.
राजर्षि छत्रपति शाहू जी महाराज की जयंती पर उन्हें आदरपूर्ण श्रद्धांजलि! वे सामाजिक न्याय और समानता के प्रबल समर्थक थे। उन्होंने वंचित, शोषित एवं पिछड़े वर्गों के उत्थान के लिए अपना जीवन समर्पित कर दिया। उनके महान कार्य और आदर्श युगों-युगों तक राष्ट्र का मार्गदर्शन करते रहेंगे।
— Narendra Modi (@narendramodi) June 26, 2026
राजर्षी छत्रपती शाहू महाराज यांच्या जयंतीनिमित्त त्यांना विनम्र अभिवादन! सामाजिक न्याय आणि समतेचे ते खंदे पुरस्कर्ते होते. वंचित, शोषित आणि मागासवर्गीयांच्या उन्नतीसाठी त्यांनी आपले संपूर्ण जीवन समर्पित केले. त्यांचे महान कार्य आणि आदर्श युगानुयुगे राष्ट्राला प्रेरणा देत आणि…
— Narendra Modi (@narendramodi) June 26, 2026