Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంత చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేస్తూ- ఈ గడ్డపై జన్మించిన అసంఖ్యాక సాహస వీరులకు ప్రధానమంత్రి నివాళి  అర్పించారు. నిజమైన జాతీయ ప్రతిష్ట అంతర్లీనంగా స్వావలంబనతో ముడిపడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత గౌరవానికీ, విదేశాలపై పరాధీన తగ్గించుకోవాలన్న వ్యూహాత్మక అవసరానికీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ప్రస్తావించారు. ఈ మేరకు “ఒక వ్యక్తి లేదా దేశం ఆత్మగౌరవం పూర్తిగా స్వావలంబనతో ముడిపడి ఉంటేనే అది సమున్నతంగా నిలవగలదు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భారీ రాజస్థాన్ చమురుశద్ధి కర్మాగారాన్ని దేశానికి అంకితం చేశారు. దేశ సర్వతోముఖాభివృద్ధి, ఆర్థిక స్వాతంత్ర్యం దిశగా భారత్‌ విస్తృత లక్ష్యాల సాధనకు సారథ్యం వహించడంలో దాని కీలక పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ భారీ రిఫైనరీ వేలాది ప్రజలకు శాశ్వత ఉపాధి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఈ ఘనతను సొంతం చేసుకున్న రాజస్థాన్ యువతను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాలన, పని సంస్కృతిలో వచ్చిన సమూల మార్పులను స్పష్టం చేస్తూ- అభివృద్ధి ప్రాజెక్టులను పునాది రాళ్లకు పరిమితం చేసిన గత ప్రభుత్వాలతో పోలిస్తే, తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ నిర్విరామంగా పూర్తి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఓ రెండు నెలల కిందట ఈ ప్రదేశంలో సంభవించిన దురదృష్టకర ప్రమాదాన్ని గుర్తుచేస్తూ- గడ్డు పరిస్థితుల నడుమ ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అసాధారణ వేగంతో పూర్తి చేయడంలో కార్మికుల అవిరళ కృషిని, పట్టుదలను ఆయన ప్రశంసించారు. “సవాలు ఎంతటి సంక్లిష్టం.. అనూహ్యమైనదైనా సంకల్ప సాధనలో ‘నవ భారత్’ ఎన్నడూ వెనక్కు తగ్గదు, వేగం తగ్గించదు” అని శ్రీ మోదీ ఆత్మవిశ్వాసం ప్రకటించారు.

రాష్ట్రంలో వేగంగా సాధించిన విజయాలను వివరిస్తూ- ముందుగా జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని ఆయన ప్రస్తావించారు. మారుమూల ప్రాంతాలకు విమాన సంధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే కొత్త ‘ఉడాన్’ పథకం తొలిదశ ప్రారంభాన్ని ప్రధానమంత్రి సగర్వంగా ప్రకటించారు. విమానయాన రంగంలో ఈ ప్రగతితోపాటు షెఖావతి ప్రాంతంలో జల సంక్షోభానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఆయన భరోసా ఇచ్చారు. జైపూర్ మెట్రో నెట్‌వర్కును భారీ స్థాయిలో విస్తరిస్తామని వాగ్దానం చేశారు. “ఈ కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో మార్వార్ ప్రాంతమంతటా పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు ప్రాథమికంగా నవ్యోత్తేజం లభిస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

యువతకు సాధికారత, పరిపాలన సామర్థ్యం దిశగా భారీ ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 54,000 మంది యువతకు ప్రభుత్వోద్యోగ నియామక పత్రాల పంపిణీని ప్రధానమంత్రి లాంఛనంగా ప్రకటించారు. నేటినుంచి వారు అధికారికంగా తమ కీలక ప్రజాసేవా కర్తవ్య నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారంటూ అభినందనలు తెలిపారు. “నేడు నియామక పత్రాలు స్వీకరిస్తున్న యువత భవిష్యత్తు అత్యంత ఉజ్వలం, సుసంపన్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భౌగోళిక రాజకీయ పరిస్థితుల వైపు దృష్టి సారిస్తూ- పశ్చిమాసియాలో వినాశకర సంఘర్షణ పరిణామాలను ఆయన ప్రస్తావించారు. దానివల్ల ఏర్పడిన అస్థిరత ప్రపంచాన్ని ఎంతటి దుస్థితిలోకి నెట్టిందో ప్రధానమంత్రి వివరించారు. ఈ పరిస్థితిని 21వ శతాబ్దపు అత్యంత తీవ్ర ఇంధన సంక్షోభంగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల అభివృద్ధి చెందిన ప్రధాన దేశాలు కూడా తీవ్ర ఇంధన కొరతతో సతమతం అయ్యాయని పేర్కొన్నారు. “పశ్చిమాసియాలో యుద్ధం ఫలితంగా ప్రపంచమంతటా ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పర్యవసానంగా ప్రధాన దేశాలు కూడా ఇంధన కొరతతో తల్లడిల్లుతున్నాయి” అని శ్రీ మోదీ వివరించారు.

అయితే, భారత్‌ ఈ అంతర్జాతీయ నిస్పృహకు భిన్నంగా పరిస్థితులను ఎదురొడ్డి నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన దృఢమైన పునరుత్థాన శక్తితో ఆర్థిక వ్యవస్థను విజయవంతంగా కాపాడుకున్నామని తెలిపారు. పరిస్థితులను సకాలంలో, కచ్చితంగా అంచనా వేస్తూ, ప్రతి స్థాయిలో సరైన నిర్ణయాలతో సమర్థ వ్యూహాలను రూపొందించుకున్నామని చెప్పారు. అలాగే, వనరుల సమతుల వినియోగం, సానుకూల దౌత్యశక్తితో సంక్షోభం నుంచి గట్టెక్కామని తెలిపారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్త ప్రకంపనలను నవ భారత్‌ తిరుగులేని సంకల్ప బలంతో అధిగమించిందని ఆయన స్పష్టం చేశారు. “భారత్‌ ప్రతి దశలోనూ సముచిత నిర్ణయాలు తీసుకుంటూ సంక్షోభ తీవ్రతను సకాలంలో నిర్దిష్టంగా అంచనా వేసింది. ఆ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడంలో దౌత్య శక్తిని సద్వినియోగం చేసుకుంది” అని శ్రీ మోదీ విశదీకరించారు.

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో వదంతులు, భయాందోళనలు వ్యాప్తి చేసిన వారి తీరును ప్రధానమంత్రి ఖండించారు. అయితే, సంక్షోభ పరిణామాలను ఎదుర్కోవడంలో రాత్రింబవళ్లు నిశ్శబ్దంగా సాగిన అసాధారణ పరిపాలనా కృషి, వ్యూహరచన, సునిశిత దౌత్య చర్యలను ఆయన ప్రశంసించారు. “కొన్ని శక్తులు వదంతుల వ్యాప్తిలో నిమగ్నమైనపుడు పరిస్థితిని చక్కదిద్దడంలో విధాన, దౌత్య స్థాయిలలో తీసుకున్న సునిశిత చర్యలు అద్భుతం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

దేశం సమష్టి కృషితో గట్టెక్కిన ఈ విపత్తు స్థాయిని వివరిస్తూ- పశ్చిమాసియాలో యుద్ధానికి ముందు భారత్‌ తన ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతం మేర దిగుమతులపై ఆధారపడి ఉందని గుర్తుచేశారు. అందులో 90 శాతం ప్రత్యేకించి అత్యంత అస్థిర గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తూండేదని ప్రధానమంత్రి వెల్లడించారు. అయితే, అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభమై ఆ కీలక సరఫరా మార్గం మూతపడటంతో దేశంలో ఎలాంటి తీవ్ర భయాందోళనలు రేగాయో కళ్లకు కట్టినట్లు వివరించారు. “యుద్ధ పరిస్థితితో ఆ కీలక సరఫరా స్తంభించినపుడు దేశీయంగా ఎంతటి భారీ నిరసనలు రేగి ఉండేవో మీరు సులభంగా ఊహించవచ్చు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

అంతటి సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రభుత్వం అమలు చేసిన అత్యవసర నివారణ చర్యలను ప్రధానమంత్రి వివరించారు. పారిశ్రామిక కార్యకలాపాలకు ఉద్దేశించిన గ్యాస్‌ను నేరుగా గృహ వినియోగం కోసం వంటగ్యాస్ (ఎల్‌పీజీ)గా మలచేందుకు దేశీయ చమురుశుద్ధి కర్మాగారాలను ఎంతో వేగంగా పునర్వ్యవస్థీకరించామని తెలిపారు. కేవలం వారంలోగా ఈ వ్యూహాత్మక మార్పులు చేపట్టడంతో జాతీయ ఎల్‌పీజీ ఉత్పాదన 35,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెరిగిందని ఆయన సగర్వంగా ఉటంకించారు. “మన రిఫైనరీలపై చురుగ్గా దృష్టి సారించడం ద్వారా మునుపెన్నడూ లేని స్థాయిలో ఎల్‌జీపీ ఉత్పత్తి చేయని ప్లాంట్లను కూడా ఈ సవాలును ఎదుర్కొనేలా వేగంగా సిద్ధం చేశాం” అని శ్రీ మోదీ వివరించారు.

వినియోగదారు పరిరక్షణ దిశగా సమగ్ర వ్యూహం అమలు చేశామని, సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌కుగల భారీ జాతీయ డిమాండ్‌ తగ్గింపు నిమిత్తం ‘పీఎన్‌జీ’’ (పైపుల ద్వారా సహజ వాయువు) కనెక్షన్లను వేగంగా పెంచామని ప్రధానమంత్రి వెల్లడించారు. అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వం 11 లక్షలకు పైగా గృహాలను పైపుల నెట్‌వర్కుతో విజయవంతంగా సంధానించిందని గుర్తుచేశారు. “వంటగ్యాస్ డిమాండ్ భారం మొత్తం ఒక్క ఎల్‌పీజీ పైనే పడకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దేశ పౌరులపై ఆర్థిక భారం పడకుండా చేపట్టిన ఆర్థికపరమైన చర్యలను ప్రధానమంత్రి వివరించారు. దేశీయంగా సిలిండర్‌ ధరలు రూ.2,000కు చేరవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం సిలిండర్‌ ధరను రూ.950 దాటకుండా కఠిన నియంత్రణ చర్యలు తీసుకున్నదని తెలిపారు. ముఖ్యంగా పేదలకు మంజూరు చేసే ఉజ్వల సిలిండర్ల ధరను రూ.650కన్నా తక్కువకే అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రెండు రోజుల కిందటే వాణిజ్య గ్యాస్ ధరను కూడా తగ్గించిందని తెలిపారు. “దేశీయ వినియోగదారులపై భారీ భారం పడకుండా చూడటంలో మా ప్రభుత్వం ఎంత సునిశితంగా వ్యవహరించిందో ధరల నియంత్రణ చర్యలు స్పష్టం చేస్తున్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో భారీ స్థాయిలో స్వదేశీ చమురు నిల్వలూ లేని పరిస్థితిని ప్రధానమంత్రి ప్రజలకు గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరగడంతో అనేక దేశాలు రేషన్ విధానంలో ఇంధనం పంపిణీ చేశాయని ఆయన ప్రస్తావించారు. “దిగుమతి మార్గాలు మూసుకుపోవడం వల్ల ప్రపంచంలోని అనేక దేశాల్లో డీజిల్, పెట్రోల్ పంపిణీని కోటా పద్ధతిలో కఠినంగా చేపట్టాల్సి వచ్చింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

పెరిగిన ధరల భారం నుంచి పౌరులను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం భరించిన ఆర్థిక భారాలను ప్రధానమంత్రి వివరించారు. కేవలం ఏప్రిల్-జూన్ కాలంలోనే ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలకు పైగా భారీ నష్టాన్ని భరించిందని ఆయన వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లోనూ ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా,  సరసమైన ధరలకే అందుబాటులో ఉండేలా చూసేందుకు లీటరుకు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని తీసుకున్న నిర్ణయం గురించి ఆయన వివరించారు. “దేశంలో ఏ ఒక్క రోజూ తీవ్రమైన కొరత పరిస్థితులు తలెత్తలేదు. ప్రజలపై అధిక భారం పడకుండా మేం చూసుకున్నాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

తీవ్రమైన సరఫరా కొరతను అధిగమించడంలో భారత్ అనుసరించిన పటిష్ఠమైనచురుకైన విదేశాంగ విధానమే కీలకమని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. కేవలం 25-26 దేశాల నుంచి 40కి పైగా దేశాలకు ఇంధన దిగుమతులను విస్తరించుకోవడం కోసం దేశం తన దౌత్య పలుకుబడిని వ్యూహాత్మకంగా ఎలా ఉపయోగించుకుందో ఆయన వివరించారు. ఈ నిర్ణయాత్మక ఎత్తుగడ అంతర్జాతీయ సమాజానికి ఒక శక్తిమంతమైనతిరుగులేని సందేశాన్ని అందించిందని ఆయన స్పష్టం చేశారు. “మాకు జాతీయ ప్రయోజనాలుపౌరుల సంక్షేమమే సర్వస్వం అనే స్పష్టమైన సందేశాన్ని యావత్ ప్రపంచానికీ భారత్ అందించింది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మన దేశం సమర్థంగా ముందుకు సాగడానికి గత దశాబ్ద కాలంగా అత్యంత దూరదృష్టితో సాగిన విధాన రూపకల్పనేనని మూల కారణమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ రిఫైనరీ పనులు వేగంగా పూర్తికావడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వ సహాయ నిరాకరణ కారణంగా 2018 నుంచి 2023 మధ్య ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా స్తంభించిపోయాయన్నారు. ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రిఫైనరీ పనులను వేగంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి తెలిపారు. దీనికి సంబంధించి 2017లోనే అవగాహన ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగంగా సాగాయిఈ రోజు మనం దీనిని దేశానికి అంకితం చేస్తున్నాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయిలో భారత పారిశ్రామిక వృద్ధిని విశ్లేషిస్తూగత 50 ఏళ్లుగా అమెరికాలో కొత్తగా ఎలాంటి రిఫైనరీ (చమురు శుద్ధి కర్మాగారం) నిర్మాణం జరగలేదన్నారు. ఈ రంగంలో ఐరోపా సామర్థ్యమూ తగ్గుతోందని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అదే సమయంలోప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే స్థాయికి భారత్ ఎదగడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. “ఈ అవిశ్రాంత కృషి కారణంగా శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొనిదాని నుంచి పూర్తిగా కోలుకోగలిగింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలోని ఇబ్బందులను గురించి ప్రస్తావిస్తూఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన తీవ్రమైన ఎరువుల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు బస్తాకు 3,000 రూపాయలకు పైగా పెరిగాయని ప్రధానమంత్రి వివరించారు. లక్షల కోట్ల రూపాయల రాయితీల ద్వారా కేవలం 300 రూపాయలకే మన రైతులకు యూరియాను అందించామన్నారు. ప్రపంచస్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాలను సురక్షితం చేసే బాధ్యతను రాయబార కార్యాలయాలకు అప్పగించామని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని దూకుడుగా ప్రోత్సహించడం వంటి భారీ బహుముఖ రక్షణ చర్యలను వివరిస్తూ… అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. “విస్తృతమైన రాయితీలు, ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల ద్వారా… మన రైతులకు అత్యంత కీలకమైన యూరియాను అతి తక్కువ ధరలకే అందేలా చూసుకున్నాం” అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) రక్షించడం అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న వ్యాపార నిర్వహణ ఖర్చుల నుంచి ఈ ఎంఎస్ఎంఈలను కాపాడేందుకు గానూ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) తదుపరి దశను వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 100 శాతం ప్రభుత్వ హామీతో బ్యాంకుల ద్వారా అదనంగా 20 శాతం రుణాన్ని సులభతరం చేయడం ద్వారా… చిన్న, కుటీర పరిశ్రమలను ఆర్థిక పతనం నుంచి సమర్థంగా రక్షించగలిగామని ఆయన పేర్కొన్నారు. “ఇలాంటి అనేక కీలక ఆర్థిక చర్యల ప్రత్యక్ష ఫలితం కారణంగానే దేశంలోని చిన్నభారీ పరిశ్రమలు ఈ రోజు పూర్తి సురక్షిత భావనతో ఉన్నాయి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు కృతజ్ఞతలు తెలుపుతూ… ప్రభుత్వం, ప్రజల మధ్య బలమైన పరస్పర విశ్వాసమే దేశ సమష్టి స్థిరత్వానికి కారణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కష్ట సమయాల్లోనూ అసాధారణ రీతిలో దృఢంగా నిలబడినందుకుభయాన్ని వ్యాప్తి చేసే దురుద్దేశపూర్వక కుట్రలను చురుగ్గా ఓడించినందుకుఅంతిమంగా భారత్ విఫలమవుతుందని ఆత్రుతగా ఆశించిన వర్గాలను నిరాశపరిచినందుకు ఆయన ప్రజలను ప్రశంసించారు. “మన అద్భుతమైనదృఢమైన పౌరుల అచంచల విశ్వాసం, అపారమైన సామర్థ్యాల బలంతోనే క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశం విజయవంతంగా ముందుకు సాగింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యావరణ బాధ్యతతో అనుసంధానిస్తూ… ఎడారి విస్తరణను నివారించడంలో కీలక పాత్ర పోషించే అద్భుతమైన, పవిత్రమైన ఖేజ్రీ మొక్కను నాటే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనాల దిశగా వస్తున్న వేగవంతమైన మార్పును వివరిస్తూ… ప్రపంచ స్థాయి సోలార్ పార్కుల ఏర్పాటుపీఎం సూర్య ఘర్ పథకం కింద 1.5 లక్షలకు పైగా గృహాల అనుసంధానంపీఎం కుసుమ్ యోజన ద్వారా స్థానిక రైతులకు 65,000కు పైగా సోలార్ పంపుల పంపిణీ వంటి అంశాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ మొక్కను నాటడం మన ప్రధాన కార్యాచరణ సంస్కృతికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. మన పర్యావరణాన్ని కచ్చితత్వంతో పరిరక్షిస్తూనేప్రగతిలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పానికి ఇది స్ఫూర్తినిస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ జల వివాదాలకు చరిత్రాత్మక పరిష్కారాన్ని ప్రస్తావిస్తూ… రాజస్థాన్‌లోని తీవ్ర నీటి కొరతను విస్మరించిన గత ప్రభుత్వాలను ప్రధానమంత్రి తీవ్రంగా విమర్శించారు. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న దేశమే ప్రథమం‘ అనే సహకార విధానాన్ని ఆయన ఉదహరించారు. రాజస్థాన్‌లోని గ్రామాల కోసం గుజరాత్ స్వచ్ఛందంగా నర్మదా మాత జలాలను పంచుకున్న చరిత్రాత్మక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. “ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడుదశాబ్దాలుగా ఉన్న వివాదాలనూ సులభంగా పరిష్కరించుకోవచ్చు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాల మధ్య రూ. 34,000 కోట్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందాన్ని సగర్వంగా ప్రకటిస్తూ… హత్నికుండ్ బ్యారేజీ నుంచి భూగర్భ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రధానమంత్రి వివరించారు. ఈ అపూర్వమైన పరస్పర అంగీకారం సికార్చురుఝున్‌ఝును సహా మొత్తం షెఖావతీ ప్రాంతంలోని లక్షలాది మంది నివాసితులకు ప్రాణాధారమైన నీటిని సమర్థంగా అందిస్తుందని ఆయన తెలిపారు. “ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతోతొలిసారిగా పరస్పర అంగీకారం ద్వారా పరిష్కారాలు కనుగొనడం సాధ్యపడింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

భవిష్యత్ జల మౌలిక సదుపాయాల కార్యక్రమాలను ప్రస్తావిస్తూ… ఎగువ యమునా బేసిన్‌లో రేణుకలఖ్వార్కిషౌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయడంగ్రామీణ కుళాయి నీటి కోసం రామ్‌జల్ సేతు ప్రాజెక్టు నిర్మాణం సహా భవిష్యత్ పరివర్తనాత్మక ప్రయోజనాలనూ ప్రధానమంత్రి వివరించారు. కీలకమైన భూగర్భ జలమట్టాలను గణనీయంగా మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగారాజస్థాన్‌లో 1.25 లక్షల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది ‘జల్ సంచయ్జన్ భాగీదారీ‘ ప్రచారం సాధించిన భారీ విజయమని ఆయన పేర్కొన్నారు. “ఈ భారీ సామూహిక ప్రయత్నాల ద్వారాఅమూల్యమైన నీటిని క్రమపద్ధతిలో సంరక్షిస్తున్నారు. ప్రాంతీయ భూగర్భ జలమట్టాలూ క్రమంగా మెరుగవుతున్నాయి” అని శ్రీ మోదీ వివరించారు.

దేశ ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధికి కొత్త జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్జైపూర్ మెట్రో రెండో దశ పనులు ప్రధాన చోదక శక్తులుగా నిలుస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మెట్రో రెండో దశతో జైపూర్ మొత్తం నెట్‌వర్క్‌ 50 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుందన్నారు. తూర్పు-పశ్చిమఉత్తర-దక్షిణ కారిడార్లను ఇది సజావుగా అనుసంధానిస్తూ స్థానికులుపర్యాటకుల సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఈ రోజు రాజస్థాన్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలు అత్యంత వేగంగా నిర్మితమవుతున్నాయిఇవి సరికొత్త రికార్డులనూ సృష్టిస్తున్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

విస్తృత అభివృద్ధిని సాధించిన రవాణా వ్యవస్థలు, ఇంధన ప్రాజెక్టులు రాష్ట్ర పరివర్తన ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమేనని ప్రధానమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్రం కోసం అత్యంత సంపన్నమైన నూతన భవిష్యత్తును సమష్టిగా నిర్మించడంలో ప్రజల నిరంతర మద్దతు లభిస్తుందన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. “మా ప్రభుత్వంపై మీ నిరంతర ఆశీస్సులతోమనమంతా కలిసి రాజస్థాన్ కోసం ఒక అద్భుతమైన నూతన భవిష్యత్తును నిర్మిస్తామనే పూర్తి నమ్మకం కలిగింది” అని ఉద్ఘాటిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

 

***