Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వివిధ రంగాలపై ఎల్‌నినో ప్రభావం, సన్నద్ధత చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ప్రధానమంత్రి కార్యాలయం


ఖరీఫ్ సీజన్ పురోగతిఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలపై ఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావం నేపథ్యంలో తీసుకున్న సన్నద్ధత చర్యలను అంచనా వేయడానికిసమీక్షించడానికి 2026 జూలై 7న సేవాతీర్థ్‌లో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీ.కేమిశ్రా అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సమావేశంలో వ్యవసాయంవిద్యుత్సహకారంతాగునీరు– పారిశుద్ధ్యంఆరోగ్య– కుటుంబ సంక్షేమంఆర్థిక వ్యవహారాలుపశుసంవర్ధక శాఖగ్రామీణాభివృద్ధిభూ విజ్ఞాన శాస్త్రంవ్యవసాయ పరిశోధనవిద్యభారత వాతావరణ శాఖ (ఐఎండీ), సమాచార– ప్రసార శాఖవినియోగదారుల వ్యవహారాలుఆర్థిక సేవలుఎరువులు – కేంద్ర జల సంఘంతో సహా పదిహేనుకు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులుసీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశం ప్రారంభంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీఅధికారులు జూన్ నెలతో పాటు జూలై 7వ తేదీ వరకు ఉన్న మొత్తం వర్షపాత పరిస్థితిని వివరించారుదేశంలో రుతుపవనాల విస్తరణఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావంపై వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ తాజా సమాచారాన్ని అందించారుగుజరాత్మధ్యప్రదేశ్ఛత్తీస్‌గఢ్మహారాష్ట్రలలో రుతుపవనాల రాక దాదాపు 10 రోజులు ఆలస్యమైందిఅయితే 07.07.2026 నాటికి కురిసిన వర్షపాతంతో దేశవ్యాప్త మొత్తం వర్షపాత లోటు -12 శాతానికి తగ్గిందిజూలై మొదటి వారంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందిజూలైఆగస్టు నెలల్లో బలహీనమైన లేదా సాధారణ ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందిజూన్సెప్టెంబర్ రుతుపవనాల సీజన్ మొత్తంలో లభించే వర్షపాతంలో 30 శాతానికి పైగా కేవలం జూలై నెలలోనే కురుస్తుందికాబట్టి  ప్రస్తుత పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నారుఎల్‌నినో సంవత్సరం అయినంత మాత్రాన ఆ ఏడాది వర్షపాతం తప్పనిసరిగా సాధారణం కంటే తక్కువగా ఉంటుందని భావించలేమని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఖరీఫ్ సీజన్ సమయంలో ఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న సన్నద్ధత చర్యలపై వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారువర్షపాతంజలాశయాలలో నీటి నిల్వలుపంటల సాగుఉత్పాదకాల అందుబాటుమార్కెట్ పోకడలుకొత్తగా తలెత్తే తెగుళ్లువ్యాధుల పరిస్థితులను పర్యవేక్షించడానికి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంఅత్యవసర స్పందనను సులభతరం చేయడం కోసం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్‘ రాష్ట్రాలతో కలిసి వారపు సమావేశాలను నిర్వహిస్తోందిముప్పు పొంచి ఉన్న 262 జిల్లాల కోసం జిల్లా వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను‘ అప్‌డేట్ చేశారుజిల్లాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకేకోసం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి‘ (ఐకార్) ‘భారతీయ వ్యవసాయంలో ఎల్‌నినో నష్టాల నిర్వహణ’పై ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్ఓపీజారీ చేసిందివాతావరణ మార్పులను తట్టుకునే రకాలుసాంకేతిక పరిజ్ఞానాల కారణంగా వర్షపాత లోటు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతోందని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీపరిధిని విస్తరించడం కోసం అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారునిర్ణీత కాలపరిమితిలోగా గరిష్ఠంగా అర్హులకు ఈ సౌకర్యాలు అందేలా చూడాలని వ్యవసాయఆర్థిక సేవలుసహకార శాఖలకు సూచించారుపశుసంవర్ధకమిల్క్ డెయిరింగ్ శాఖను జాతీయస్థానిక స్థాయిలలో ఎండుగడ్డిపచ్చిగడ్డిపశుగ్రాసం లభ్యతను అంచనా వేయాల్సిందిగా ఆదేశించారు

జిల్లాల వారీగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామనిప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగా ఉందని తాగునీరు– పారిశుద్ధ్య శాఖ తెలిపిందిముప్పు పొంచి ఉన్న జిల్లాల్లో సూక్ష్మ స్థాయి ప్రణాళికలుపర్యవేక్షణను ఈ శాఖ నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేశారుజలవనరుల శాఖ దేశంలోని భూగర్భ జలాలుజలాశయాల తాజా స్థితిని వివరించిందిప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్ అంతటా నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.

వడగాల్పులపై అవసరమైన సూచనలను ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సిద్ధం చేసిందివడగాల్పులుఅధిక తేమడెంగ్యూ వ్యాప్తి వంటి పరిస్థితులను ఈ శాఖ పర్యవేక్షిస్తోందిహెచ్చరికలుమార్గదర్శకాలను క్షేత్ర స్థాయి వరకు సమర్థవంతంగా చేరవేసేలా చూడాలని ఆదేశించారు.

బియ్యంగోధుమలుపప్పుధాన్యాల రిటైల్ ధరల స్థితితగినంత బఫర్ నిల్వల లభ్యతను వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరించిందిరబీ సీజన్‌కు సరిపడా ఎరువుల లభ్యతప్రారంభ నిల్వలు ఉండే అవకాశం ఉందని ఎరువుల శాఖ నివేదించిందినిత్యావసర వస్తువులుఎరువుల విషయంలో జాతీయస్థానిక స్థాయి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఇరు శాఖలకు అధికారులు సూచించారు

వికసిత్ భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ఆజీవిక మిషన్‘ కింద జూలై నుంచి ప్రారంభమైన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ వివరించిందిదీని ద్వారా ఇప్పటివరకు కోటి పనిదినాలు కల్పించారువాతావరణ మార్పులను తట్టుకునే విత్తన రకాల ఉపయోగాన్ని పెంచటానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ పరిశోధనవిద్యా శాఖ పంచుకుందివిద్యుత్ ఉత్పత్తిలభ్యత విషయంలో తాజా పరిస్థితిని విద్యుత్ శాఖ వివరించింది.

మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలనిఅవసరమైనప్పుడు నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా రుతుపవనాల ప్రభావం లేదా ఆలస్యమైన రుతుపవనాల వల్ల ముప్పు పొంచి ఉన్న జిల్లాలపై పడే ప్రభావాన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

పశుగ్రాస అభివృద్ధి ప్రణాళికలతో పాటు తగినంత మేత లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలనిరాష్ట్రాలతో కలిసి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారుముప్పు పొంచి ఉన్న జిల్లాల్లో తాగునీరు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారుముప్పు పొంచి ఉన్న జిల్లాల్లోని జలాశయాల నీటి మట్టాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారుఅందుబాటులో ఉన్న నీటిని అత్యంత మెరుగ్గాఆలోచనతో వినియోగించడాన్ని ప్రోత్సహించేలా తగిన ఆదేశాలు జారీ చేశారు

సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేలా చూసేందుకు మంత్రిత్వ శాఖలన్నీ పరస్పరం సన్నిహిత సమన్వయంతోరాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు

 

***