Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్రామీణ ప్రాంత మహిళల సాధికారతకు లఖ్‌పతి దీదీ ఎలా తోడ్పడుతోందో తెలుపుతూ


గ్రామీణాభివృద్ధి శాఖ పూర్వ కార్యదర్శి శ్రీ శైలేశ్ కుమార్ సింగ్ రాసిన వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ప్రజలతో పంచుకున్నారు.

స్వయంసహాయ బృందాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల మహిళలు విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో లఖ్‌పతి దీదీ కార్యక్రమం ఎలా తోడ్పడుతోందో ఈ వ్యాసం వివరించింది. వారు నిలకడగా ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందుతున్నారు. మహిళలు వాణిజ్య సంస్థలను నిర్మించి, ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటూ, భవితను తీర్చిదిద్దుకోవడంలో నైపుణ్యాలు, ఆర్థిక సాయం లభ్యత, మార్కెట్లు, సామాజిక సంస్థలు ఎలా దోహదం చేస్తున్నదీ ఈ వ్యాసంలో రాశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘స్వయంసహాయ బృందాల మొదలు విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వరకూ.. ఒక కొత్త సాధికారత గాథను  గ్రామీణ ప్రాంతాల మహిళలు లిఖిస్తున్నారు.

స్థిర ప్రాతిపదికన ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ ఆర్థిక స్వాతంత్య్రాన్ని మహిళలు పొందేలా ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమం వారికి ఎలా సాయపడుతోందో గ్రామీణాభివృద్ధి శాఖ పూర్వ కార్యదర్శి శ్రీ శైలేశ్ కుమార్ సింగ్ వివరించారు.

మహిళలు వాణిజ్య సంస్థలను స్థాపించి, ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటూ, తమ భవితను తీర్చిదిద్దుకునేటట్లు నైపుణ్యాలు, ఆర్థిక సహాయం, మార్కెట్లు, సామాజిక సంస్థలు ఏయే విధాలుగా వారికి తోడ్పడుతున్నాయో ఆయన తెలియజేశారు.

hindustantimes.com/opinion/rural-…” అని పేర్కొంది.

***