అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు 2026 నవంబర్ 17న జరిగే 23వ ఆసియాన్-ఇండియా సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు నేను ఈ రోజు మనీలా పర్యటనకు బయలుదేరుతున్నాను.
ఆసియాన్ దేశాలతో మన సంబంధం భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీకి హృదయం లాంటిది. అలాగే మన మహాసాగర్ దార్శనికతలో ప్రధాన కేంద్రంగా ఉంది. శతాబ్దాల నాగరికతా ఆదానప్రదానాలతో మన సంబంధాలు బలోపేతమయ్యాయి. ఇవి వాణిజ్యం, అనుసంధానం, నౌకావాణిజ్య భద్రత, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సంబంధాలు విస్తరించి క్రియాశీలక భాగస్వామ్యంగా వృద్ధి చెందాయి.
ఆసియాన్-భారత శిఖరాగ్ర సమావేశంలో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, వృద్ధి, అనుసంధానం, శ్రేయస్సు కోసం మన ఉమ్మడి ఆకాంక్షలకు మరింత వేగాన్ని అందించడానికి తోటి నాయకులతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.
ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లపై చర్చించేందుకు ఒక ముఖ్యమైన వేదికను తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే నాయకులతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సహకారాన్ని బలోపేతం చేయడంపై అభిప్రాయాలను పంచుకొనేందుకు ఎదురుచూస్తున్నాను.
ఫిలిప్పీన్స్‌లో ఉన్న భారతీయ సమాజంతో ముచ్చటించేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నాను. వారి సహకారం మన రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
ఈ పర్యటన ఆసియాన్‌తో భారతదేశ భాగస్వామ్యానికి కొత్త శక్తిని ఇస్తుందనీ, శాంతియుతమైన, సుసంపన్నమైన, పటిష్టమైన ఇండో-పసిఫిక్ పట్ల మన ఉమ్మడి నిబద్ధతను బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను.
****
Will be in Manila, Philippines later today and tomorrow to attend the following programmes: 23rd ASEAN-India Summit. 21st East Asia Summit India attaches immense importance to close friendship with ASEAN nations. I’m also looking forward to interacting with the Indian community based in the Philippines. https://t.co/xmAZDNtrFw
— Narendra Modi (@narendramodi) November 16, 2026