Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మంచి పనులు, సకారాత్మక పనులు చేయడం ముఖ్యమని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


ఏ మనిషీ ఒక్క క్షణమైనా ఏ పనీ చేయకుండా ఉండజాలరని, ఈ కారణంగా అందరూ తమ జీవితంలో మంచి పనులను, సకారాత్మక పనులను చేయాలని చెబుతున్న ఓ సంస్కృ‌త సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః’’ అని పేర్కొన్నారు.

పైన చెప్పిన సూక్తికి భావం ఇదీ..

ఏ మనిషీ ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం సేపయినా ఉండలేరు. ప్రకృతిలోని మౌలిక గుణాలు, మన స్వీయ స్వభావానికి అనుగుణంగా ప్రతి వ్యక్తీ నిరంతరం కర్మ చేయక తప్పదు. ఇందువల్ల, మనం మన జీవితంలో సదా మంచి పనులను, సకారాత్మక పనులనే చేయాలి.

***