సూర్యోదయ వేళలో భగవాన్ సూర్యునికి అర్ఘ్యాన్ని ఇచ్చే ఘట్టంతో ఛఠ్ మహాపర్వానికి సంబంధించిన నాలుగు రోజుల ఉత్సవం ముగింపునకు చేరుకొందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. ప్రకృతికి అంకితం చేసిన ఈ పవిత్ర పండుగలో దృఢ సంకల్పం, ఆధ్యాత్మిక సాధనల అద్భుత మేళనాన్ని గమనించవచ్చని ఆయన అన్నారు. ప్రతాన్ని అనుష్ఠించిన భక్తులందరితో పాటు వారి కుటుంబాలకు కరుణాకటాక్షాలను అనుగ్రహించాల్సిందిగా ఛఠీ మాతను ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఉదయిస్తున్న సూర్యదేవునికి అర్ఘ్యాన్ని సమర్పించడంతో, ఈ రోజు ఛఠ్ మహాపర్వానికి సంబంధించిన నాలుగు రోజుల వ్రతం సుసంపన్నమైంది. ప్రకృతికి అంకితం చేసిన ఈ దివ్యమైన ఉత్సవంలో దృఢ సంకల్పం, ఆధ్యాత్మిక సాధనల అద్భుత మేళనాన్ని గమనించవచ్చు. వ్రతాన్ని ఆచరించిన వారందరితో పాటు, దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ శుభాశీస్సులను అందించాల్సిందిగా ఛఠీ మాతకు నేను విన్నవించాను’’ అని పేర్కొన్నారు.
***
उदीयमान सूर्यदेव को अर्घ्य अर्पित करने के साथ आज महापर्व छठ का चार दिवसीय अनुष्ठान संपन्न हुआ। प्रकृति को समर्पित इस दिव्य उत्सव में दृढ़ संकल्प और आध्यात्मिक साधना का अद्भुत संगम देखने को मिला। छठी मइया से विनती है कि वे सभी व्रतियों के साथ-साथ देशभर के मेरे परिवारजनों को अपना शुभाशीष प्रदान करें।
— Narendra Modi (@narendramodi) November 16, 2026