Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ దినాన్ని స్మరించుకోవడం కోసం ఏర్పాటైన గ్రంథావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

రాజ్యాంగ దినాన్ని స్మరించుకోవడం కోసం ఏర్పాటైన గ్రంథావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

రాజ్యాంగ దినాన్ని స్మరించుకోవడం కోసం ఏర్పాటైన గ్రంథావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రాజ్యాంగ దినాన్ని స్మరించుకోవడం కోసం ఈ రోజు పార్లమెంట్ హౌస్ ఉప భవనంలో ఏర్పాటైన గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రెండు గ్రంథాలు.. భారతదేశ రాజ్యాంగం ఆధునిక కథనం మరియు “మేకింగ్ ఆఫ్ ది కాన్ స్టిట్యూషన్”.. విడుదల అయ్యాయి.

ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నవంబర్ 26 వ తేదీని 2015 నుండి రాజ్యాంగ దినంగా జరుపుకొంటున్నామన్నారు. వరసగా వచ్చే తరాలు రాజ్యాంగాన్ని గురించి చక్కని పరిచయాన్ని కలిగి ఉండాలని, సమకాలీన సందర్భంలో రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.

భారతదేశంలో రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకొనేటపుడు మనం శ్రీ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను కూడా స్మరించుకొంటామని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో మనం అనుసంధానమై తీరాలని, హక్కులకు విధులకు మధ్య సమతూకం కోసం చూడాలని కూడా ఆయన చెప్పారు.

రాజ్యాంగ దినానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, నవంబర్ 26 లేకుండా జనవరి 26వ తేదీని (మన గణతంత్ర దినాన్ని) మనం జరుపుకొనలేకపోయేవాళ్లం అన్నారు.

ఇవాళ అవినీతి మరియు నల్లధనంపై పోరులో సామాన్యుడు సైతం ఒక సైనికుడిగా మారినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. వీలయినంత వరకు డబ్బు మార్పిడికి డిజిటల్ పద్ధతులను వినియోగించుకోవాలని, ఇది పారదర్శకత్వాన్ని పెంచుతుందంటూ ప్రధాన మంత్రి ప్రజలను ప్రోత్సహించారు. ప్రతి వ్యక్తికీ అతడి లేదా ఆమె డబ్బును ఖర్చు పెట్టుకొనేందుకు హక్కు ఉందని, అలాగే ఎవరి డబ్బునూ మరెవరో లాక్కోలేరని ఆయన స్పష్టంచేశారు.