Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ నూట ఇర‌వై నాలుగో స‌వ‌ర‌ణ బిల్లు, 2019 కి రాజ్య స‌భ ఆమోదం తెలపడం ప‌ట్ల హ‌ర్షాన్ని వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


రాజ్యాంగ నూట ఇర‌వై నాలుగో స‌వ‌ర‌ణ బిల్లు, 2019 రాజ్య స‌భ లో ఆమోదాన్ని పొంద‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘రాజ్యాంగ నూట ఇర‌వై నాలుగో స‌వ‌ర‌ణ బిల్లు, 2019ని రాజ్య స‌భ ఆమోదించినందుకు సంతోషిస్తున్నాను. ఈ బిల్లు కు ఇంత‌టి విస్తృతమైన మ‌ద్ద‌తు వ్య‌క్తం కావ‌డం చూస్తే ఆనందంగా ఉంది. స‌భ లో కూడా హుషారైన చ‌ర్చ జ‌రిగింది; తద్వారా ప‌లువురు స‌భ్యులు వారి వారి సునిశిత‌మైనటువంటి అభిప్రాయాల‌ ను వెల్ల‌డించారు.

రాజ్యాంగ నూట ఇర‌వై నాలుగో స‌వ‌ర‌ణ బిల్లు, 2019కి పార్ల‌మెంట్ ఉభ‌య స‌భల‌ లో ఆమోదం ల‌భించ‌డం సామాజిక న్యాయాని కి సిద్ధించిన విజ‌యం. ఇది మ‌న యువ శ‌క్తి త‌న సామ‌ర్ధ్యాన్ని నిరూపించుకోవ‌డానికి మరియు భార‌త‌దేశపు ప‌రివ‌ర్త‌న కు తోడ్పాటు ను అందించ‌డాని కి ఒక విశాల‌మైన అవ‌కాశాన్ని క‌ల్పించ‌గ‌లుగుతుంది.

రాజ్యాంగ నూట ఇర‌వై నాలుగో స‌వ‌ర‌ణ బిల్లు, 2019కి ఆమోదముద్ర వేయ‌టం ద్వారా మ‌నం మ‌న భార‌త‌దేశం బ‌ల‌మైన దేశం గాను, స‌మ్మిళిత‌మైన దేశం గాను రూపొందాల‌ని త‌ల‌పోసిన‌టువంటి మన గొప్ప స్వాతంత్య్ర యోధులకు మరియు మ‌న రాజ్యాంగ రూప‌క‌ర్త‌ల‌ కు మ‌నం నివాళుల‌ను అర్పించాం’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***