Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాణి గైదిన్ల్యూ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా విరాజిల్లిన రాణి గైదిన్ల్యూ శతజయంతి ఉత్సవాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాణి గైదిన్ల్యూ స్మారక నాణాన్ని విడుదల చేశారు. ప్రధాని మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాలు, వారు సాధించిన విజయాల గురించి, ముందు తరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని, రాణి గైదిన్ల్యూ లాంటి సమర యోధుల గురించి తెలియాల్సినంతగా ప్రజలకు తెలియకపోవడం బాధాకరమన్నారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో రాణి గైదిన్ల్యూ సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. రాణి మా నాగా ప్రజల కోసం చేసిన పోరాటం, భారత దేశాన్ని ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించిందని, మహాత్ముని సందేశాన్ని ఈశాన్య భారత దేశం అంతా వ్యాప్తి చేయడంలో ఆమె ఎనలేని కృషి చేశారని ప్రధాని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ కూడా ఆమె తన స్వగ్రామానికి వెళ్లలేక పోవడం విచారకరమని, భారత దేశం రాజులతోను, పరిపాలకులతోనూ ఏర్పడినది కాదని, ప్రజలచేత ఏర్పడిన దేశమని ప్రధాని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులపై ఎదుర్కొంటున్న సమస్యలకు రాణి మాత ఆలోచనలు దృక్పథాలు పరిష్కార మార్గాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని ప్రధాని అన్నారు.

ఈశాన్య భారత దేశంలో జరుగుతున్న అభివృద్ధి దేశ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్న ప్రధాని, బంగ్లాదేశ్ తో కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందం ఈశాన్య భారతావనిని అభివృద్ధి ప‌థంలోలోకి తీసుకువెళ్లడమే గాక, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన నిర్విరామ ప్రయత్నాల ఫలితంగా నాగా శాంతి ఒప్పందం కుదిరిందని ప్రధాని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు నాగాలాండ్ గవర్నర్ పి.బి. ఆచార్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్, మణిపూర్ ముఖ్యమంత్రి ఓ.ఇబోబి సింగ్, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, డా. మహేష్ శర్మ, డా. జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.