పిఎంఇండియా

రాబోయే పార్లమెంటు బడ్జెటు సమావేశాల లో అన్ని అంశాల పైన చర్చించడం కోసం ప్రభుత్వం సిద్ధం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు స్పష్టం చేశారు. 2020వ సంవత్సరం జనవరి 31వ తేదీ న బడ్జెటు సమావేశాలు ఆరంభం కానుండగా, అంతకు ఒక రోజు ముందు జరిగిన అఖిల పక్ష సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ప్రస్తుతం దేశం లో ని ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాలు ఆ అంశం పై శ్రద్ధ వహించాలని సభ్యుల లో ఎక్కువ మంది చేసిన సూచన ను ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో స్వాగతించారు.
‘‘దేశాని కి సంబంధించిన ఆర్థిక స్థితి పై చర్చ జరగాలని సభ్యుల లో పలువురు కోరారు. దీని ని నేను స్వాగతిస్తున్నాను. మరి మనం మీరంతా అన్నట్టు ఆర్థిక అంశాల పైన చర్చించవలసిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతుల లో దేశం ఏ విధం గా లాభపడగలదు అనేది గమనించవలసింది గా సభ్యుల కు ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘ప్రపంచం లోని వాతావరణాన్ని భారతదేశాని కి అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనే అంశం పై మనం దృష్టి సారించాలి’’ అని ఆయన అన్నారు.
‘‘మరి ఈ బడ్జెట్ సమావేశాల లో, క్రొత్త సంవత్సరం ఆరంభం లో మనం గనుక దేశ ఆర్థిక వ్యవస్థ కు ఒక సరైన దిశ ను ఇచ్చామంటే, అది దేశాని కి గొప్ప మేలు ను చేయగలుగుతుంది’’ అని ఆయన అన్నారు.
సభ్యులు ప్రస్తావించిన ఇతర అంశాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘మీరు లేవనెత్తిన ఇతర ముఖ్య అంశాలు అన్నిటితో నేను మీతో ఏకీభవిస్తున్నాను. అటువంటి అన్ని అంశాల మీద అరమరిక లు లేనటువంటి చర్చ జరగాలి అని నేను చెప్పదలచుకున్నాను’’ అని ఆయన అన్నారు.
పార్లమెంట్ సమావేశాల లో ఫలితాల ను పెంచడం కోసం సభ్యులు వారి వంతు తోడ్పాటు ను అందించాలని కూడా ప్రధాన మంత్రి కోరారు.
గడచిన రెండు సమావేశాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ఇది పార్లమెంటు మరియు సమావేశాల పనితీరు కు సంబంధించింది. గత రెండు సమావేశాలు ఇతోధికమైన ఫలితాల ను ఇవ్వడాన్ని, అదే విధం గా దానికి అనుకూలం గా ప్రజల లో గొప్ప స్సందన రావడాన్ని మనము గమనించాము. ప్రజల యొక్క ప్రతినిధులు గా అన్ని అంశాల ను అరమరికల కు తావు ఇవ్వకుండా మనం చర్చిస్తూ సభ యొక్క ఫలితాల ను ఇనుమడింప చేయడం మన అందరి బాధ్యత’’ అని ఆయన తెలిపారు.
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింహ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్ మరియు శ్రీ వి. మురళీధరన్ లతో పాటు అన్ని పక్షాల కు చెందిన ఎంపీ లు ఈ సమావేశాని కి హాజరు అయ్యారు.
Attended an all party meeting before the start of the budget session in parliament. pic.twitter.com/vwpEzk7L4L
— Narendra Modi (@narendramodi) January 30, 2020