Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రసంగాని కి 26 జూన్, 2019న రాజ్య సభ లో ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చ కు ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం


 
“ ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అనే మంత్రం తో మేము (పాలన ను) ఆరంభించాము.  అయితే అయిదు సంవత్సరాల నిరంతర సమర్పణ భావం తో, ప్రజలు దాని కి మరొక అద్భుత పదాన్ని జోడించారు – అదే ‘సబ్ కా విశ్వాస్’.”  – శ్రీ నరేంద్ర మోదీ 

గౌరవనీయులైన చైర్ పర్సన్,  

దేశప్రజల నుండి తాజా గా తీర్పు పొందిన తరువాత మాన్య రాజ్య సభ సభ్యుల సమక్షంలో నా అభిప్రాయాల ను వెల్లడించే అవకాశం నాకు ఈ రోజు న లభించింది.  దేశ ప్రజలు మా పట్ల మరింత ఎక్కువ విశ్వాసాన్ని ఉంచి రెండో సారి జాతి కి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అందుకు దేశ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.  అయితే రెండో పదవీకాలం ఆరంభం లోనే ఈ సభ గౌరవ సభ్యుడు శ్రీ మదన్ లాల్ మరణించారు.  ఆయన కు నేను నా యొక్క నివాళుల ను అర్పిస్తున్నాను. 

ఎందరో గౌరవనీయ సభ్యులు వారి యొక్క ఆలోచనల ను, అభిప్రాయాల ను తమదైన శైలి లో  సభ ముందుంచారు.  అన్నిరకాల భావోద్వేగాలు ఇక్కడ వెల్లడి అయ్యాయి.  ప్రజల నుండి చిరాకు, వైరుధ్యం, వ్యంగ్యం, ఆగ్రహం, నిర్మాణాత్మక సలహా, ప్రశంస లు వచ్చాయి.  రాజ్య సభ ప్రతి సమావేశాలు అరుణ్ (జైట్లీ) గారి వాగ్ధాటి తో మారుమోగేవి.  ప్రతి ఒక్కరు ఆయన మాటల ను వినాలని ఆసక్తి చూపే వారు.  ప్రస్తుతం అస్వస్థత తో ఉన్న ఆయన  త్వరలోనే పూర్తి గా కోలుకొని మళ్ళీ సభ కు వస్తారని, మనకు ఆయన దర్శన భాగ్యం కలుగుతుందనే నమ్మకం నాకుంది.  

ఘనమైన ఈ సభ లో శ్రీ థావర్ చంద్ గారు సభానాయకుడు గా మనందరికీ మార్గదర్శకత్వం వహిస్తారు.  నేను ఆయన కు కూడా స్వాగతం పలుకుతున్నాను.  గత రెండు రోజులు గా సభ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ లో శ్రీ గులాం నబీ ఆజాద్ గారు, శ్రీ దిగ్విజయ్ సింహ్ గారు, నా మిత్రుడు శ్రీ డి. రాజా, శ్రీ డెరెక్ ఓ బ్రయాన్ గారు, శ్రీ రాంగోపాల్ యాదవ్, శ్రీ మాజిద్ మెమన్ గారు, శ్రీ రాందాస్ అఠావలె, శ్రీ టి.కె. రంగరాజన్, శ్రీ జె.పి. నడ్డా గారు,  స్వపన్ దాస్ గుప్తా గారు మరియు దాదాపు మరో 50 మంది గౌరవనీయ సభ్యులు చర్చ లో పాల్గొని ఫలప్రదం చేశారు. 

ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాల ను వారిదైన శైలి లో వ్యక్తం చేశారు – కొంత చిరాకు, ఇంకా కొంత తీక్షణత, ఇంకా కొంత వ్యంగ్యం, కొంత నిరసన, కొన్ని సృజనాత్మక సలహాలు, ప్రజల కు శుభాభినందనలు కూడా ఉన్నాయి.  అన్ని రకాల స్ఫూర్తి ఇక్కడ వ్యక్తమైంది.  ఎన్నికల క్షేత్రం లోకి వెళ్లి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చలేకపోయిన వారు వారి కోపాన్ని ఇక్కడ ప్రదర్శించడం కనిపించింది. 

ఈ ఎన్నికలు వాస్తవం గా ప్రత్యేకమైనవి.  ఎన్నో దశాబ్దాల తరువాత వరుసగా రెండో సారి ఒక ప్రభుత్వం సంపూర్ణ సంఖ్యాధిక్యం తో ఏర్పడింది.   అది రాజకీయ సుస్థిరత కు ఉన్న ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది.  ఇది ఈ ఎన్నికల్లో మాత్రమే జరుగలేదు.  గత కొన్ని నెలలు గా జరిగిన అన్ని ఎన్నికలలోనూ ఇదే ధోరణి కనిపించింది.  ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా వోటర్లు రాజకీయ సుస్థిరత ను నొక్కిచెప్పారు.  అది బలమైన ప్రజాస్వామ్యాని కి సంకేతం.

సంస్థ లో పని చేసే సమయం లో నేను ఎన్నో ఎన్నికల ప్రచారాల ను చూశాను.  మరెన్నో నిర్వహించాను.  రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎన్నో ఎన్నికల ను ఎదుర్కొనే, ఇతరులు ఎన్నికల లో పోరాడేందుకు సహాయం చేసే అవకాశం నాకు లభించింది.  అయితే ప్రజలు సొంతం గా ఎన్నికల ను ఎదుర్కొనే సందర్బాలు చాలా తక్కువ.  ఒక విధం గా చెప్పాలంటే  2019 ఎన్నికల లో కూడా పార్టీల కు బదులు ప్రజలే పోరాడారు.  ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల ను గురించిన  సమాచారాన్ని  ప్రజలే తమ పొరుగువారి కి చేరవేశారు.  ప్రభుత్వ పనుల వల్ల లబ్ధి పొందని వారు కూడా ఇతరుల కు వాటి ఫలితం దక్కినట్లయితే తమ కు కూడా ప్రయోజనం కలుగుతుందని నమ్మారు.   ఆ నమ్మకమే ఈ ఎన్నికలలో ప్రముఖ పాత్ర ను పోషించింది.  దేశం లో అన్ని ప్రాంతాల కు వెళ్లి ప్రజల ను కలుసుకొని వారి ఆశీస్సుల ను పొందడం నా అదృష్టం.

గౌరవనీయులైన చైర్ పర్సన్,
  
ప్రజాస్వామ్య ప్రపంచం లో ఎన్నికలు అత్యంత కీలకం.  దానికి విశ్వవ్యాప్తం గా విలువ ఉంటుంది.  ఈ ఎన్నికల లో వెలువడిన  బ్రహ్మాండమైన ప్రజాతీర్పు ను గురించిన వ్యాఖ్య – మీరు ఎన్నికలలో గెలిచారు కానీ దేశం ఓడిపోయింది అనేది.  పరిమితమైన ఆలోచన మరియు వక్రబుద్హి తో అలా వ్యాఖ్యానించడం భారతదేశ ప్రజల ను తీవ్రం గా అవమానించడమే.   

ఇది మామూలు ప్రకటన కాదు.  ఈ విషయాలు ప్రజల ను తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. ‘ప్రజాస్వామ్యం ఓడిపోయింది మరియు జాతి ఓటమిపాలైంది’ వంటి ప్రకటన లు చేసినప్పుడు నాకు అడగాలని అపిస్తుంది – వయనాడు లో భారతదేశం ఓడిపోయిందా ?  రాయబరేలి లో ఓటమి చెందిందా ?  బరంపురం లో, తిరువనంతపురం మరియు అమేథీ లలో కూడా ఓటమేనా ?  కాంగ్రెస్ ఓడితే భారతదేశం ఓడిందని అనడం, అదేమి వాదన ? జాతి యావత్తు కాంగ్రెసు కు సమానమా ?  అహంకారాని కి కూడా పరిమితి ఉంటుంది.  అసలు అహంకారమే ఉండకూడదు.  ఇక పరిమితుల ప్రశ్నే లేదు.  ఈ దేశాన్ని 55- 60 సంవత్సరాలు పాలించిన పార్టీ 17 రాష్ట్రాల లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఎందుకో ?  అంతమాత్రాన జాతి ఓటమి పాలైందని అనగలమా ? 
  
అటువంటి భాష ను ప్రయోగించడం ద్వారా మనం వోటర్ల మనస్సాక్షి ని ప్రశ్నిస్తున్నామని నా అభిప్రాయం.  విమర్శ ను అర్ధం చేసుకోగలను. ప్రజాస్వామ్యం లో దానిని ఆమోదించవచ్చు.  అయితే ఈ విధం గా వోటర్ల ను అవమానించడం అత్యంత బాధాకరం. 

తమ వోటు హక్కు ను వినియోగించుకోవడానికి ప్రజలు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత లో  పెద్ద పెద్ద బారుల లో నిలబడి వోటు వేయడం మనము చూశాము.  అనేక మంది  80- 90 ఏళ్ళ మధ్య  వయస్సు ఉన్న వృద్ధులు ఊతకర్రల తో వచ్చి వోటు వేశారు.  ఈ మధ్యనే వారి తల్లి ని పోగొట్టుకున్న ఎంతో మంది ఎన్నికల అధికారులు విధి నిర్వహణ కు హాజరు అయ్యారు.  అసంఖ్యాకులైన ప్రజల శ్రమ ఫలితం గా ఎన్నికలు ముగిశాయి.  ఇప్పుడు మనం దేశ ప్రజల ను ఈ విధం గా అవమానిస్తున్నాము. 

అవమానించే, కించపరచే రాజకీయాల తో మనము చాలా దిగాజారాము. మనము స్వదేశం లోని రైతుల ను కూడా పరాభవించాము.  రైతుల కు లంచం ఇచ్చారని వారు అన్నారు.  2,000 రూపాయల పథకం తో రైతు ల వోటుల ను  కొన్నారని అన్నారు.  దేశం లోని రైతుల ను ఈ విధం గా కించపరచ రాదనేది నా అభిప్రాయము.  రైతుల కు లంచం ఇవ్వలేము.  మన రైతు లు ఎంతో శ్రమించి, ఆహార ధాన్యాల ను పండిస్తారు.  తాను పండించే ఆహారం తినేది పేదలా?, లేక  ధనికులా?  అని ఏ రైతు కూడా ఎప్పటికీ ఆలోచించడు.  రైతుల ను గురించి అటువంటి భాష ను ఉపయోగించడం అంటే 15 కోట్ల మంది రైతుల ను అవమానించడమే. 

ప్రసార మాధ్యమాల ను కూడా నిందించడాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది.  మనము ఎక్కడ ఉన్నాము?  ప్రసార మాధ్యమాల వల్ల ఎన్నిక లు గెలుస్తామా?  ప్రసార మాధ్యమాలను లంచం ఇచ్చి కొనగలుగుతామా?  అప్పుడు తమిళ నాడు కు, కేరళ కు కూడా అదే వర్తించాలి.  సభ లో చెప్పే విషయాల కు ప్రాముఖ్యం ఉంటుంది.  మనము ఏమి చెప్పినప్పటికీ అది వార్తాపత్రికల లో పతాక శీర్షికల కు ఎక్కుతుంది.  అయితే భారతదేశం యొక్క ప్రజాస్వామ్య గౌరవాన్ని మనము దృష్టి లో పెట్టుకోవాలి.  ఎన్నికల ప్రక్రియ (విశ్వవ్యాప్తం గా) భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల ను పెంపొందింపచేసుకొనేటటువంటి ఒక అవకాశము.  దాని ని మనము వదులుకోకూడదు.
 
ఇవి ఎంతటి భారీ ఎన్నికలో మీరు ఊహించవచ్చు.  పది లక్షల పోలింగ్ కేంద్రాలు, 40 లక్షల కు పైగా ఇలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇవిఎం లు),  650 రాజకీయ పక్షాలు మరియు 8000 మంది కి పైగా అభ్యర్ధులు!  ఈ గణాంకాలు ప్రపంచం ముందు పెడితే ప్రజలు ఆశ్చర్యపోతారు.  ఈ ఎన్నికల లో ఓ కీలక అంశం తెర మీద కు వచ్చింది.  ఈ ఎన్నికల లో మన సోదరీమణులు, ఆడపడుచులు నిర్వహించినటువంటి పాత్ర అభినందనీయము.  సాధారణం గా స్త్రీల కన్నా పురుషుల వోటింగ్ శాతం ఎక్కువ గా ఉంటుంది.  మొట్టమొదటి సారి గా ఆ తేడా దాదాపు సున్నా అయ్యింది.  అదే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం లోని ముఖ్యాంశము అయ్యింది.  ఈ సారి 78 మంది మహిళా పార్లమెంటేరియన్ లు ఎన్నిక కావడమనేది సంతోషదాయకమైన విషయము.  అంతేకాదు, ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మరియు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) విజయం సాధించాయి.  ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర.. ఈ నాలుగు దిక్కుల లోనూ బిజెపి, ఎన్ డిఎల కు సంఖ్యాబలం లభించింది.  మేము ఏదో ఒక దిక్కు కు మాత్రమే పరిమితం కాలేదు.  మాకు  అన్ని దిక్కుల లో ఆమోదం లభించింది. 
ఎవరి కల లు కల్లలు అయ్యాయో, ఎవరి కలలు చిన్నభిన్నం అయ్యాయో, ఎవరి అహం దెబ్బ తిందో వారో దేశ వోటర్ లకు అభివాదం చేయలేరు.  అయితే , నేను తల ను వంచి వోటర్ లకు నమస్కరిస్తున్నాను.  వారి ని అభినందిస్తూ కృతజ్ఞత లు తెలియజేస్తున్నాను.  ఎన్నికల సంఘాన్ని మరియు ఎన్నికల ప్రక్రియ తో సంబంధం ఉన్న అధికారులు, భద్రత సిబ్బంది అందరి ని కూడా అభినందిస్తున్నాను.

గౌరవనీయులైన చైర్ పర్సన్,
 
వోటింగ్ యంత్రాల ను గురించి చాలా చర్చ జరుగుతోంది.  ఇప్పుడు ఒక కొత్త ఒరవడి మొదలైంది.  వోటింగ్ యంత్రాల ను ప్రశ్నిస్తున్నారు.  ఒకప్పుడు సభ లో మాకు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండే వారు.  మమ్మల్ని వెక్కిరించే వారు.  ఎన్నో కష్టాల ను ఎదుర్కొన్నాము. మా పార్టీ కార్యకర్తల పై మేము విశ్వాసాన్ని ఉంచాము.  మా సంకల్పం పైన మాకు నమ్మకం ఉండేది.  దేశ ప్రజల పై మాకు విశ్వాసం ఉండేది.   మేము ఎన్నో త్యాగాలు చేసి ఎంతో శ్రమించి సిద్ధం అవుతూ వచ్చాము.  నిరాశాజనకమైన స్థితి నుండి నూతన విశ్వాసం తో పార్టీ ని మేము మా పార్టీ ని నిర్మించాము.  మాకు ముందు ఉన్న తరం పని చేసి చూపింది.  అదే నాయకత్వ పరీక్ష.
  
పోలింగ్ కేంద్రం శిబిరాల లో శ్రమించే వాళ్ళము.  ఫలితం అంతంత మాత్రమే.  పరాజయం ఎదురైంది. పెద్ద గా చింతించలేదు. ఓడిపోయాము, మళ్ళీ పనిచేద్దాము.  అంతే.  కార్య రంగం లో దూకడమే.  ఎట్టకేలకు ఇప్పుడు ఫలితాలు చూస్తున్నాము.  ఓడిపోయామని పోలింగ్ కేంద్రాల పై పడి ఏడవలేదు.  ఆత్మవిశ్వాసం లేని వారే సాకుల ను గురించి వెతుకుతారు.  వోటింగ్ యంత్రాల ను నిందించి వారికి వారు ఊరట చెందుతారు.  వోటింగ్ యంత్రాల వల్ల ఓడిపోయామని చెప్పి, తమ సహచరుల కు ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తారు. 
ఈ విధం గా పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచలేము.  అందుకు బదులు గా వారి ని కలవర పరుస్తాము.  దాని వల్ల ఉపయోగం ఉండదు.  ధైర్యం ఉంటే ముందు నడచి కార్యకర్తల ను సిద్ధం చేయండి.  వచ్చే ఎన్నికల లో పోరాడండి.
 
గౌరవనీయులైన చైర్ పర్సన్,
 
ఎన్నికల ప్రక్రియ లో ఎన్నో మార్పుచేర్పు లు, సవరణ లు జరిగాయి.  1952వ సంవత్సరం తరువాత ఎన్నికలు అనేక నెల లు జరిగేవి.   ఎన్నికల సిబ్బంది బ్యాలట్ పెట్టెల ను తీసుకొని ప్రతి గ్రామాని కి వెళ్ళే వారు.  ఆ పద్ధతి ని సవరిస్తూ వచ్చి ఇప్పుడు ఇక్కడ కు చేరాము.  అది నిరంతర ప్రక్రియ.  మొదట్లో ఎన్నికలు అయ్యాక ఎంత మంది మరణించారు; ఎంత హింస జరిగింది; ఎన్ని పోలింగ్ కేంద్రాలు లూటీ అయ్యాయి వంటివి వార్తాపత్రికల లో శీర్షికలు గా వచ్చేవి.  ఇప్పుడు వోటింగ్ యంత్రాల కారణంగా కేవలం పెరిగిన ఓట్ల శాతాన్ని గురించిన వార్తలు వస్తున్నాయి.  ఇది ముఖ్యమైన అంశం.  ఇంతకు ముందు పోలింగ్ కేంద్రాల ను స్వాధీనం చేసుకోవడం, లూటీ చేయడం సర్వసాధారణం.  దుర్మార్గుల చేతుల్లోనే అధికారం ఉండేది.  ఎన్నికల ప్రక్రియ ఎక్కువ ప్రజాస్వామికం గా మారిన తరువాత ప్రజలు ఓడిపోవడం మొదలైంది.  అందుకే వారు మళ్ళీ బ్యాలట్ పెట్టెల శకాని కి వెళ్ళాలని అనుకొంటున్నారు.  ఆ విధం గా ప్రజాస్వామ్యం బందీ అయితే  దేశాని కి మేలు జరగదు. 

గౌరవనీయులైన చైర్ పర్సన్,
  
నేను ఈ రోజు సభ ద్వారా జాతి జనుల కు చెప్పదలచింది ఏమిటంటే వోటింగ్ యంత్రాల ను గురించిన చర్చ 1977వ సంవత్సరం లో మొదట ప్రారంభం అయింది.  అప్పుడు మేము రాజకీయాల లో లేము. 1988వ సంవత్సరం లో కూడా మేము లేము.  అప్పుడు సభ లో ఉన్న గౌరవ సభ్యులు వాటి ని చట్టబద్దం గా ఆమోదించారు.  వారు శాసనం రూపొందించారు.  అంతే కాదు 1992వ సంవత్సరం లో కాంగ్రెస్ నేతృత్వం లో వోటింగ్ యంత్రాల కు సంబంధించిన అన్ని నియమాల ను రూపొందించారు.  వారు ఎప్పుడూ చెప్తుంటారు. మేము అది చేశాము.. ఇది చేశాము అని.  అదే విధం గా ఇది కూడా మీరే 

దేశం లో ఇప్పటివరకు 113 అసెంబ్లీల కు ఎన్నికలు జరిగాయి.   ఇప్పుడు సభ లో ఉన్న అన్ని పక్షాల కు  అవే వోటింగ్ యంత్రాల తో అధికారం లోకి వచ్చే/ లేక పంచుకొనే అవకాశం లభించింది. లోక్ సభ కు నాలుగు సాధారణ ఎన్నికలు జరిగాయి.  ఆ ఎన్నికల లో కూడా పార్టీ లు మారాయి.  వేరువేరు వ్యక్తులు గెలిచారు.  కానీ ఇప్పుడు ఓటమి తరువాత వారే వోటింగ్ యంత్రాల ను నిందిస్తున్నారు.  ఆ క్రమం లో 2001వ సంవత్సరం తరువాత వివిధ ఉన్నత న్యాయస్థానాల లో, సర్వోన్నత న్యాయస్థానం లో వోటింగ్ యంత్రాల కు సంబంధించిన అనేక కేసు లు దాఖలు అయ్యాయి.  అన్ని అంశాల ను పరిశీలించిన అన్ని దేశాల న్యాయ వ్యవస్థ లు వోటింగ్ యంత్రాల కు అనుకూలం గా తీర్పు చెప్పాయి. 

2017లో వోటింగ్ యంత్రాల పై పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది.   ఎన్నికల సంఘం ముందుకు వచ్చి వోటింగ్ యంత్రాల లో తప్పులు ఉంటే రుజువు చేయాలని ఇవిఎమ్ ల వ్యతిరేకుల ను సవాలు చేసింది.  ఇవిఎమ్ లను గురించి గోల పెడుతున్న ఏ ఒక్క పార్టీ కూడా ఎన్నికల సంఘాని కి వెళ్ళలేదు.  ఎన్ సిపి మరియు సిపిఐ లు ఎన్నికల సంఘం వద్ద కు వెళ్ళాయి కానీ వారు ఇవిఎమ్ లను ప్రశ్నించ లేదు. వోటింగ్ యంత్రాలు ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకొన్నారు.  కనీసం ఎన్ సిపి, సిపిఐ లు ఎన్నికల సంఘం వద్ద కు వెళ్ళాయి.  వోటింగ్ యంత్రాల ను గురించి అనుమానం వ్యక్తం చేసిన వారు ఎవ్వరు కూడా ఎన్నికల సంఘం ఆహ్వానించినా అక్కడకు వెళ్ళలేదు. 
ఇవిఎమ్ ల గురించి స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని బృందాలు గగ్గోలు పెట్టడం తో మన ప్రజలు కొందరు వోటింగ్ యంత్రాల తో సమస్యలు ఉన్నాయని అనుమానించడం మొదలుపెట్టారు.  మా పార్టీ కి చెందిన కొందరు కూడా వాటి ని గురించి ప్రశ్నించడం మొదలైంది. నిజానిజాలు తెలుసుకోవడానికి మేము నిజాయితీ గా ప్రయత్నించాము.  వోటింగ్ యంత్రాల కు సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని కూడా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసి, సరి అయిన మార్గం లో వెళ్తున్నాము.   

గౌరవనీయులైన చైర్ మన్, 

అప్పుడు వివిపిఎటి విధానం ప్రారంభం అయింది.  కొందరు దీనిపై పలు మార్లు సర్వోన్నత న్యాయస్థానాని కి వెళ్లి ఎన్నికల ప్రక్రియ కు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు.  వారు ప్రతి సాయంత్రం పూట ఎన్నికల సంఘం కార్యాలయాని కి వెళ్లి గందరగోళం సృష్టించినప్పుడల్లా దానికి ప్రసార మాధ్యమాల లో ప్రధాన శీర్షికల లో స్థానం లభించింది.  వోటర్ లలో అపనమ్మకాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నం అది.  కాని వివిపిఎటి లకు ఏమయింది.  ఎవరు ఎన్ని రకాల వదంతులు ప్రచారం లోకి తెచ్చినప్పటికీ వివిపిఎటి లు ఇవిఎమ్ ల యొక్క శక్తి ని పెంచాయి.  దాని ఫలితాలు ఇక్కడే ఉన్నాయి.
  
కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా నాకు విస్మయం కలిగిస్తోంది.  మీరు ఎంతో కాలం పాటు దేశాన్ని పాలించారన్న విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.  సుదీర్ఘ కాలం పాటు మీరు రాజకీయ ప్రధాన స్రవంతి లో ఉన్నారు.  అయితే అనుభవం తో చెబుతున్నాను.. విజయాన్ని ఆమోదించ లేని సమస్య మీలో ఉంది. స్వాతంత్ర్యం అనంతరం మీరు చాలా సంవత్సరాల పాటు ఎన్నికల లో విజయం సాధించారు.  2014వ సంవత్సరం నుండి మీ వైఖరి ని నేను నిశితం గా గమనిస్తూనే ఉన్నాను.  ఓటమి ని మీరు అంగీకరించ లేరన్న విషయం నాకు అవగతం అయింది.  ఇది ఆరోగ్యకరమైన ఎదుగుదల కానే కాదు.  ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీ కి దాని ప్రాధాన్యం, దాని స్థానం, దాని గౌరవం దానికి ఉన్నాయి.  కానీ మనం ఓటమి ని లేదా విజయాన్ని సమానం గా ఆమోదించగల పరిణతి ని మాత్రం సాధించ లేదు. 1952వ సంవత్సరం నుండి ఎన్నికల ప్రక్రియ లో నిరంతరం సంస్కరణ లు జరుగుతూనే ఉన్నాయి.  ఈ ప్రక్రియ భవిష్యత్తు లో కూడా కొనసాగుతుంది.

దీని పై నిరంతరం చర్చ జరగాలని నేను నమ్ముతున్నాను.  కానీ చర్చ ఏదైనా విశాల దృక్పథం తో జరగాలి.  కొన్ని అభిప్రాయాలు మనసు లో పెట్టుకుని వాటి కి పరిమితమై మాట్లాడ కూడదు.  నిష్పక్షపాతం గా చెప్పాలంటే మనం ఏ ఒక్క దేశాని కో, ఏ ఒక్క ఎన్నికల కో అనుకూలంగా మాట్లాడ కూడదు.  మొదట అందరమూ విశాల దృక్పథం తో చర్చిద్దాము.  నేను చాలా మంది పార్లమెంట్ సభ్యుల తో చర్చించాను.  ఈ రుగ్మత నుండి మనము బయటపడాలి అని చాలా మంది నాకు చెప్పారు.  దేశం లో ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక సారి మాత్రమే ఎన్నికలు జరగాలి.  ఎన్నికల పండుగ రెండు నెలల పాటు సాగిన అనంతరం ఎవరి పనుల లోకి వారు తిరిగి వెళ్లాలి.  ఇదే అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేశారు.  దీని పై ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమే కావచ్చు.  కానీ ప్రస్తుతానికి అయితే దేశం లో ఒకే ఒక్క వోటర్ ల జాబితా ఉండవలసిన అవసరం లేదా?  దురదృష్ట వశాత్తు ప్రస్తుతం లెక్క కు మించి వోటర్ల జాబితా లు ఉన్నాయి.  వాటి రూపకల్పన లో ఎంతో ధనం, ఎందరిదో శ్రమ ఖర్చవుతున్నాయి.

దీని పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడి గా చట్టం చేయాలి. ప్రతి ఒక్క ఎన్నికలకు ఒకే వోటర్ ల జాబితా ఉండాలి.  పంచాయతీ ఎన్నికల స్థాయి లోనే ఆ సవరణ జరగాలి.  ప్రతి ఒక్కరి వోటు కు విలువ ఉంటుంది కనుక ఏ ఒక్క వోటర్ పేరు ఈ జాబితా లో లేకుండా ఉండ కూడదు.  కొన్ని సందర్భాల లో కొందరు కేవలం 30- 40 వోటు ల తేడా తో ఓటమి పాలవడమో, లేదా విజయం సాధించడమో చూస్తూనే ఉన్నాము.  అలాగే పోలింగ్ రోజు న ప్రతి ఒక్కరు గుర్తు పట్టగల ప్రదేశాలలోనే పోలింగ్ స్టేశన్ లు ఏర్పాటు కావాలి.  ఇటువంటి మార్పు లు అన్నింటి కోసం ఎన్నికల సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగాలి.   

గతం లో మన దేశం లో ఒక దేశం, ఒకే ఎన్నిక ప్రక్రియ అమలు లో ఉండేది.  మీరందరూ దాని ప్రయోజనాల ను పొందారు.  కాని కొంతమంది దానికి ఎలాంటి తర్కాని కి నిలవని భిన్నమైన వాదన ను వినిపిస్తూ ఉంటారు.  వోటర్ లు అందరు కలసి నిర్ణయం ఎలా ప్రకటించగలరన్నది వారి ప్రశ్న.  అందుకు ఒడిశా చక్కని ఉదాహరణ.  ఒడిశా లో అధిక సంఖ్య లో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.  ఒడిశా అంతగా అభివృద్ధి చెందని ప్రాంతం.  కానీ అభివృద్ధి పథం లో తాము నిలవాలన్న ఆకాంక్ష తో ప్రజలు ఎంతో కష్టపడి పని చేస్తారు.  అక్కడి ప్రజలు రెండు వోట్లు- లోక్ సభ కు ఒకటి, అసెంబ్లీ కి ఒకటి- ఒకే సారి వేశారు.  మన వోటర్ లు ఒకే సారి రెండు వోట్ల ను వేయగల సామర్థ్యం కలిగి ఉన్నారనే కదా దాని అర్ధం.  వారి లో ఆ చైతన్యం ఉంది.  ఈ ఎన్నికల లో కొన్ని ప్రాంతాల లో అసెంబ్లీ సీట్ల కోసం బిజెడి ని, లోక్ సభ సీట్ల కోసం బిజెపి ని ఎన్నుకొన్నారు.  మన  వోటర్ ల పరిణతి అది.  ఇందుకు భిన్నమైన వాదాన్ని వినిపించడం వారి ని అవమానించడమే అవుతుంది.

అలాగే లోక్ సభ కు, అసెంబ్లీల కు ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోతాయనే వదంతులు కూడా ప్రచారం లో ఉన్నాయి.  కానీ సమాంతరం గా ఎన్నికలు జరిగిన అన్ని సందర్భాల లోనూ ప్రాంతీయ పార్టీ లే అధికారం లోకి వచ్చాయి.  మీరు చరిత్ర ను పరిశీలించండి.  ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా.. రెండు రాష్ట్రనాల లో ప్రాంతీయ పక్షాలే అధికారం లోకి వచ్చాయి.  వోటర్ల మేధస్సు ను ఎప్పుడూ అనుమానించ వద్దు.  ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మనం ఆహ్వానించాలి.  మన పాత్ర ను చక్కగా పోషించాలి.  మొదట్లోనే తలుపులు మూసేస్తే మనము మార్పు ను ఎలా తీసుకురాగలుగుతాము?  వోటర్ల చైతన్యం విషయం లో ఎటువంటి అనుమానాలు ఉండకూడదనేదే నా అభిప్రాయం.

వారు ఇవిఎమ్ లను మాత్రమే వ్యతిరేకిస్తున్నారా అనే ఆశ్చర్యం కొన్ని సార్లు నాకు కలుగుతుంది. “ప్రతిపక్షం” అనే భావాన్ని మాత్రమే వారు పరిగణన లోకి తీసుకొన్నారు.  ప్రతి ఒక్క చర్య ను వ్యతిరేకించేదే ప్రతిపక్షం అనేది వారి అభిప్రాయం.  నేను ఈ సభ లోనే కూర్చున్నా దేశవ్యాప్తంగా మేధావులు పెద్ద మనసు తో మాట్లాడుతూ ఉంటారు.  భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటే వారు తొలి వరుస లోనే నిలబడతారు.  అలాంటి వారందరూ ఈ సభ లో ఆసీనులు అయ్యారు. అటువంటి పండిత సభ్యులే దేశం లో డిజిటల్ లావాదేవీ లు సాధ్యం కాదని వాదించారు. పేదలు డిజిటల్ లావాదేవీల ను ఎలాగ నిర్వహించగలరు?, అసలు మొబైల్ ఫోన్ ను వారు ఎలా పట్టుకోగలరు? ..ఈ తరహా ఉపన్యాసాలే ఎన్నో వినిపించాయి. వారు అందరి మాటల ను వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  దాని ని మేము వ్యతిరేకించాము.

కొందరు సభ్యులు ఆధార్ ను వ్యతిరేకించారు.  మీరు అధికారం లో ఉన్నప్పుడు ఆధార్ ఎంతో ఉన్నతమైంది.  కానీ ఆధార్ ను ఉపయోగించుకొని అవినీతి ని అరికట్టేందుకు మేము ప్రయత్నిస్తాము అంటే మాత్రము అది సంక్షోభాని కి దారి తీస్తుంది.  వారు సర్వోన్నత న్యాయస్థానాని కి వెళ్లి ఆధార్ ను నిలిపి వేసే ప్రయత్నం చేశారు. మనం ఆధునిక భారతం గా మారాలంటే సాంకేతిక విజ్ఞానాని కి దూరం గా ఉండిపోగలమా?  సాంకేతిక విజ్ఞానాని కి రక్షణ లు అవసరం అనే అంశం లో ఎటువంటి సందేహం లేకపోయినా దాని నుండి పారిపోవడం సాధ్యమా?

జిఎస్ టి, ఇవిఎమ్, డిజిటల్ వి-మ్యాప్.. ఇలాగ అన్నీ అనుమానించినవే.  ప్రతి ఒక్క దాని పట్లా వ్యతిరేకతే. గత ఐదు సంవత్సరాల కాలంలో రాజ్యసభలో అన్ని పక్షాలు ప్రభుత్వాని కి అవరోధాల ను సృష్టించాయి.  అందుకు వోటర్లు వాటిని శిక్షించారు. కానీ ఈ రోజు న వోటర్లు రాజ్య సభ లో జరుగుతున్న అన్ని కార్యక్రమాలను ఓటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.  వోట్లు వేసే సమయం లో లోక్ సభ, రాజ్య సభ లలో పార్టీ ల ప్రవర్తన ను వారు దృష్టి లో పెట్టుకొంటున్నారు.  ఈ ఎన్నికల లో ఆ విషయం ఎంతో స్పష్టం గా బయటపడింది.  వచ్చే అయిదు సంవత్సరాల కు ఇది గుణపాఠం గా భావించాలి.  ఎన్నికైన ప్రభుత్వం చేపట్టే పని ని ఏ రకం గా రాజ్య సభ లో నిలిపివేయగలమా అనేదే ప్రతీ ఒక్కరి దృష్టి.

న్యూ ఇండియా ను ఏ విధం గా వ్యతిరేకిస్తున్నారు అన్నదే నాకు ఆశ్చర్యం కలిగించే అంశం.  కారణం ఏమిటి?   మీరు చెప్పే దాని లో అయిదు అంశాలు మాత్రమే సరైనవి, మిగతావి అన్నీ తప్పు అన్నదే మీ వాదం.  భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే న్యూ ఇండియా భావన అని చెబితే అమెరికా ఇలా చేస్తుంది, అమెరికా ఇలా చేయదు, అందుకే మనం కూడా చేయకూడదు అనే సమాధానం మీ వద్ద నుండి వస్తుంది.  ఇతరులు ఏం చేస్తున్నారో వదలివేయండి.  మన దేశాని కి 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది.  సమున్నతమైన సంప్రదాయాలు, విలువలు గల దేశం మనది.  ఇతరులు ఏం చేస్తున్నారనేది విడచిపెట్టి మనం ప్రపంచాని కి ఒక ఉదాహరణ గా నిలవాలనే అభిప్రాయాన్ని మనసు లో పెట్టుకోవాలి.

మొత్తం 125 కోట్ల మంది అతి పెద్ద కల ఎందుకు కనకూడదు?  10 పాయింట్లు తప్పు, 5 పాయింట్లే మంచివి అనేదే మీ అభిప్రాయం అయితే మంచివి అనుకున్న అయిదు పాయింట్ల పైనే దృష్టి ని కేంద్రీకరించి మన ప్రయత్నాన్ని ఎందుకు ప్రారంభించకూడదు?. దేశ ప్రజల ను మనం నిస్సహాయ స్థితి లోకి నెట్టివేయ కూడదు.  ఆ మార్పు కోసమే మనం ప్రయత్నం చేయాలి.  ప్రాచీన భారతమే కావాలి అని మనం నేరు గా చెప్పగలమా ?  మంత్రిమండలి నిర్ణయాల పత్రాన్ని పత్రికా ప్రతినిధుల సమావేశం లో ముక్కలు గా చింపేసిన పాత భారతదేశమే మన కు కావాలా?  భారత నౌకాదళాన్ని కుటుంబ విహార యాత్ర ల కోసం ఉపయోగించుకొన్న పాత భారతమే మన కు కావాలా?  నౌకాదళం, సైనిక దళం, వైమానిక దళం అన్నింటిలో కుంభకోణాల తో విసిగిపోయిన పాత భారతమే మన కు కావాలా?  అదేనా మనకు కావలసింది?

రైల్వే రిజర్వేశన్ కోసం గంటల తరబడి పెద్ద పెద్ద వరుసల లో నిలబడిన,  దళారీ ల ప్రమేయం లేకుండా రిజర్వేశన్ లభించని పాత భారతదేశమే మన కు కావాలా?  గ్యాస్ కనెక్షన్ కోసం ఎంపీ ల ఇళ్ల ముందు పెద్ద పెద్ద బారుల లో నిలబడిన, లేదా పాస్ పోర్టుల కోసం నెలల తరబడి వేచి ఉన్న, లేదా ఇన్ స్పెక్టర్ గిరీ రాజ్యమేలిన, లేదా ప్యూన్ లు, వాచ్ మన్ లు, డ్రైవర్ ల వంటి చిన్నఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు, వాటి ముసుగు లో అవినీతి సాగిన పాత కాలం నాటి భారతదేశం కావాలా ?

నేను ఆశ్చర్యపోతున్నాను, దేశ ప్రజలు పాత కాలం నాటి వ్యవస్థ లోకి వెళ్లడానికి ససేమిరా ఇష్టపడరు.  వారు వారి కలల ను నిజం చేసుకోవడం కోసం న్యూ ఇండియా కై ఎదురు చూస్తున్నారు.  ప్రతి ఒక్క పౌరుని ఇటువంటి కలల ను సాకారం చేయడం కోసం మనము నిరంతరం శ్రమించాలి.  ఆ పని చేయడానికి నేను విశ్వాసం తో ఉన్నాను.  మేము మా యొక్క ప్రయత్నాలను చేశాము.

జ్యోతి ప్రజ్వలనాలు, రిబ్బన్ లు కత్తిరించడం, పథకాల ను ప్రకటించడమే ప్రభుత్వం పని అనుకొనే రోజులు అప్పట్లో సాగాయి. వరుస లో చివరన నిలబడిన వ్యక్తి కి కూడా సేవ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాని కి లేకపోయినందువల్ల, మేము ఆ సంస్కృతి నే మార్చాము.  మేము విధానం, వ్యూహం, వైఖరి, ధోరణి అన్నింటినీ మార్చాము.  మేము చేశామని అందరూ చెప్పడమే దీని కి తార్కాణం.  గతం లో కూడా పేదల కు ఇళ్ల నిర్మాణం జరిగింది.  యుపిఎ ప్రభుత్వం లో ఇళ్ల నిర్మాణం జరగలేదా ?  జరిగింది. కానీ ఇప్పుడు అందులో కొత్త ఏమిటి అని మీరు అడగవచ్చు.  5 సంవత్సరాల కాలం లో మీరు నిర్మించింది 25 లక్షల ఇళ్లు.  అంతే కాలం లో మేము నిర్మించింది 25 లక్షల ఇళ్లు.  ఇదీ మార్పు.

కొత్త వాతావరణాన్ని కల్పించడానికే మేము ప్రయత్నించాము. అన్నింటికీ ప్రభుత్వ అవరోధాల ను తొలగించి కార్యకలాపాలను సరళతరం చేశాము.  స్వాతంత్ర్యం సాధించిన కొన్ని దశాబ్దాల తరువాత కూడా ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం పై చిత్తశుద్ధి లేకపోవడం, పలుకుబడి ఉపయోగించడం, ఒత్తిడుల ను సృష్టించడం వంటివి మనము చూశాము.  కొందరు లేమి తో నివసించవలసిన వాతావరణాన్ని మనము చూశాము.  పలుకుబడి తో ప్రజలు విసిగిపోయారు.  కొంత మంది మాత్రమే ఆ ఒత్తిడుల కు తట్టుకొని ముందుకు సాగడం సాధ్యం అయింది.

ఆరోగ్యవంతమైన అభివృద్ధి కొరవడడం పై ప్రభుత్వం తప్పనిసరి గా ఆలోచించాలి.  పలుకుబడి, ఒత్తిడుల ప్రభావాని కి సగటు జీవి నలిగిపో కూడదు.  ఆ వ్యూహాన్నే మేము ఎంచుకొని ప్రతి ఒక్క పౌరుడి ని సాధికారం చేసేందుకు కృషి చేశాము.  అయిదు సంవత్సరాల క్రితం కోట్లాది ఇళ్లకు విద్యుత్తు  లేదు. గ్యాస్ కనెక్షన్ లు, చివర కు కనీసం మరుగుదొడ్లు అయినా లేవు.  భారీ సంస్కరణ లను గురించి వారు మాట్లాడారు.  కానీ చిన్న సంస్కరణల తోనే దేశం లో మార్పు సాధ్యం.  చిన్న పనులు చేయడానికి మనం సిగ్గు పడకూడదు.  మేము సగటు జీవులు నివసించే ఒక చిన్న ప్రాంతం నుండి వచ్చాము.  సగటు జీవుల సమస్యల ను పరిష్కరించడం ద్వారానే పెద్ద ఫలితాల ను సాధించగలుగుతాము.  అందుకే మేము అటువంటి కృషి చేస్తున్నాము.

వచ్చే అయిదు సంవత్సరాల లో ప్రజల ఆకాంక్షల ను తీర్చడం:

గత అయిదు సంవత్సరాల కాలం లో ప్రజల ఆశలు నెరవేర్చేందుకు మేం ప్రయత్నం చేశామన్నది ఖాయం.  వాటి ఫలితాలు చాలా వరకు కనుపిస్తున్నాయి.  ఇంకా మిగిలిన ఆశయాలు కూడా నెరవేరాలని జాతి ఆశిస్తోంది.  మనం అదృష్టవంతులం అని నేను నమ్ముతున్నాను.  రాజకీయాలు, సమాజం, వ్యాపారం, విద్య.. ఏదైనా కావచ్చు.. ప్రతి ఒక్క పౌరుడు తన ఆశల కు దీటు గా జీవించాలనే కోరుకొంటాడు. మానవాళి కి ఆశ లు ఉన్నప్పుడు పనుల లో వేగం వస్తుంది, అభివృద్ధి ప్రక్రియ కూడా జోరు అందుకొంటుంది.  అవి అన్నీ అదృష్టవంతమైన క్షణాలు.  సగటు మనిషి ఆశయాల కు అనుగుణం గా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత.
 
మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్యం, జన్ ధన్ ఖాతా లు వంటి అన్నిటి కి ప్రతికూలత, వ్యతిరేకత, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి ని దెబ్బ తీసే ప్రయత్నాలు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  మనము ఒకరిని మరొకరు గౌరవించుకోవలసిన అవసరం లేదా?
రాజ్య సభ లో మాకు సంఖ్యాబలం లేదన్న విషయం మేమెరిగినదే.  దేశ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని తక్కువ చేసే ప్రయత్నం మనం చేయకూడదు.  గౌరవనీయులైన చైర్ మన్, ఈ పరిస్థితి ని మేము అయిదు సంవత్సరాల పాటు ఎంతో ఓర్పు తో సహించాము.  అందుకే చైర్ మన్ సర్, లోక్ సభలో భారీ సంఖ్యాబలాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలు మాకు పెద్ద బాధ్యత ను అప్పగించినందుకు మేము రక్షణ ను కోరుతున్నాము.  రాజ్య సభ యొక్క సమాఖ్య స్వభావం కూడాను మేము సహాయాన్ని పొందాలని సూచిస్తున్నది.  మరి మీరు ఈ విషయం లో న్యాయం చేస్తారని నేను మిమ్ములను అభ్యర్థిస్తున్నాను. 

దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మార్చడం కోసం న్యూ ఇండియా ను ఆవిష్కరించే దిశ గా మేము కదులుతున్నాము.  మనము 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయి కి చేరుతామని 2014వ సంవత్సరం లో ఊహించామా ?  కానీ ఇప్పుడది 2.8 లక్షల కోట్ల డాలర్ల కు చేరింది.  దేశాని కి స్వాతంత్ర్యం సిద్ధించిన ఎన్నో సంవత్సరాల కు ఆర్థిక వ్యవస్థ 2 లక్షల కోట్ల డాలర్ విలువ కలిగిందిగా మారితే దాని ని అయిదు సంవత్సరాల లోనే రెట్టింపు చేయగలిగాము.  వచ్చే అయిదు సంవత్సరాల కాలం లో దాని కి మరో సగం జోడించినా అది మరింత గా పెరుగుతుంది.  5 లక్షల కోట్ల డాలర్ల కు ఎందుకు చేర్చాలని ప్రశ్నించడం కాదు, ఆ స్థాయి కి చేర్చేందుకు మనం కలిసికట్టు గా కృషి చేయాలి.  అన్ని రాష్ట్రప్రభుత్వాల పరిస్థితి మెరుగుపరచడం కూడా ఇందులో ప్రధానం.  మీ రాష్ట్రప్రభుత్వం ఉన్న ప్రదేశం లోనే మీరు అది చేయాలి.  గట్టి ప్రయత్నాలతోనే భారతదేశం త్వరలో 5 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థ ల క్లబ్ లోకి చేరుతుంది.  అప్పుడే అందరికీ ఆనందం కలుగుతుంది. మనం ఎప్పుడూ సకారాత్మకమైన ఆలోచన లనే కలిగివుండాలి.  మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధం గా ఉన్నాము.  మీరు కూడా మా ఆలోచనల ను ఆమోదించండి.  మేము జాతి ని నడపాలని, దాని సంక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నాము.  అందుకు మీ నుండి నేర్చుకోవడానికి మేము సిద్ధం గా ఉన్నాము.  అందుకే మనం అందరమూ కొత్త ఆలోచనల తో ముందుకు సాగాలని మేము కోరుతున్నాము.

మరికొన్ని సమస్యల ను కూడా ఇక్కడ ప్రస్తావించాలి.  ఝార్ ఖండ్ ఊచకోత లు, మూక దౌర్జన్యకాండల కు ఆలవాలం అయిందని సభ లో ప్రస్తావన వచ్చింది.  గౌరవనీయనులైన చైర్ మన్ సర్, ఒక యువకుని హత్య పట్ల అందరమూ ఎంతో విచారిస్తున్నాము.  అందుకు కారణమైన వారిని కఠినం గా శిక్షించవలసిందే.  కానీ ఝార్ ఖండ్ లో మాత్రమే ఇటువంటి సంఘటన లు జరుగుతున్నాయని నిందించడం సబబేనా?  అలా చేసినట్టయితే అక్కడ జరిగిన ఎన్నో మంచి పనుల ను మనము గుర్తించలేని స్థితి లోకి పోతాము. దుండగుల ను ఏరివేసి వారి ని చట్టబద్ధం గా శిక్షించాలి అనడం లో ఎటువంటి సందేహం లేదు.  పరిస్థితులు ఏ మాత్రం మార్చడానికి వీలు లేకుండా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొంటూ మనము రాజకీయాలు చేస్తున్నాము.  అటువంటి అప్పుడు ఝార్ ఖండ్ ను ఖండించే హక్కు మన ఎవ్వరి కి లేదు.  వారు కూడా దేశీయ పౌరులే. వారి లో కూడా ఎందరో సజ్జనులు ఉన్నారు.  ఏదైనా నేరం జరిగితే దానిపై చట్టాని కి, న్యాయాని కి అనుగుణం గా చర్య ను తీసుకోగల సమర్థత రాజ్యాంగాని కి, శాంతి భద్రతల యంత్రాంగాని కి ఉంది. పరిష్కారం సైతం న్యాయ ప్రక్రియ కు లోబడి ఉంటుంది.  అటువంటి పరిస్థితి ని కల్పించేందుకు మనం చేయదగినంత చేయాలి, తప్ప వెనుదీయ కూడదు.

ప్రపంచాని కి ఎనలేని హాని చేస్తున్న ఉగ్రవాదాని కి మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం లేదా నా ఉగ్రవాదం, మీ ఉగ్రవాదం అంటూ తేడా ఏమైనా ఉంటుందా.  అలాగే ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు ఝార్ ఖండ్ లో కావచ్చు, పశ్చిమ బెంగాల్, కేరళ .. ఎక్కడైనా కావచ్చు; ఎక్కడ జరిగినా దాన్ని చూసే కోణం ఒక్కటే కావాలి.  అప్పుడే దౌర్జన్యకాండ ను మనము నిలువరించగలుగుతాము.  అది సాధించగలిగినప్పుడే ఏదైనా సమస్య వస్తే ఈ దేశం యావత్తు ఒక్కటవుతుంది అనే గుణపాఠం దౌర్జన్యాల కు పాల్పడే వారి కి వస్తుంది.  ఆ బాధ్యత ను నెరవేర్చే బాధ్యత ను మనము అందరమూ తీసుకోవాలనే నేను విశ్వసిస్తాను.

రాజకీయ కోణాలు ఆవిష్కరిస్తున్న ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతీ ఒక్క పౌరుని రక్షణ కు హామీ ని ఇవ్వవలసిన రాజ్యాంగ పరమైన బాధ్యత మన అందరిదీ అని నేను నమ్ముతున్నాను.  అదే సమయం లో మానవత్వాన్ని పరిరక్షించవలసిన బాధ్యత కూడా ఉంది.  అదే స్ఫూర్తి తో మనము ముందుకు సాగాలి.  సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం తో మేం ముందుకు సాగుతున్నాం.  అయిదు సంవత్సరాలు  ఇదే సిద్ధాంతాని కి కట్టుబడిన తనేవాత ప్రజలు ఇప్పుడు దాని కి మరొకటి చేర్చారు.. అదే “సబ్ కా విశ్వాస్”.

మన ఆజాద్ సాహబ్ దాని ని స్పష్టం గా చూడలేకపోతున్నారు. రాజకీయ కోణం నుండి సమస్యల ను చూసినట్టయితే, అవి ఎప్పటికీ  సంక్లిష్టంగానే ఉన్నాయి.  ఆ రాజకీయ కళ్లద్దాలు తప్పించి చూస్తే మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఆవిష్కారం అవుతుంది. 

ఇక్కడ ఎంతో విస్తృతం గా ఉపన్యాసాలు జరిగాయి.  కొన్ని సార్లు వార్తాపత్రికలు కూడా వాటి ని ప్రచురిస్తాయి.  మంగళవారం నాడు నేను అందరిని కలసినప్పుడల్లా ఇటువంటి అంశాల పై నా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాను.  ఒక స్వతంత్ర అభ్యర్థి మా వైపు వచ్చి గెలవడానికి సహాయపడినట్టు ఎన్నో ఫిర్యాదు లు, ఆరోపణ లు వచ్చాయి.  అది కొన్ని పార్టీ ల గత చరిత్ర.  కొందరు రాష్ట్రపతి అభ్యర్థులు కూడా ఓటమి పాలు కావలసి వచ్చింది.  అవన్నీ వ్యక్తిగత రాజకీయాలు.  వారు చివరకు బాబా సాహబ్ ఆంబేడ్కర్ ను కూడా ఓడించడాని కి ప్రయత్నించారు.  అందుకే అటువంటి ఉపన్యాసాలు ఇచ్చే ముందు తమ ను అంతర్ముఖం చేసుకు పరిశీలించుకోవాలని వారి ని నేను కోరుతున్నాను.

ఢిల్లీ వీధుల లో తీగలను వేలాడదీసి సిక్కుల ను ఊచకోత కోసి సజీవ దహనం చేసిన సంఘటనల పై ఎందరివో పేర్లు ప్రముఖం గా ప్రస్తావన కు వచ్చాయి.  కానీ వారందరూ ఇప్పటి కీ అదే పార్టీ లో ఉన్నారు; గౌరవనీయమైన, రాజ్యాంగ పదవులలో ఉన్నారు.  మీ ఆలోచనలు, విధానాలు అవే అయినట్టయితే ప్రబోధాలు చేసే ముందు మీ సముదాయాన్ని గురించి మీరే పరిశీలించుకోండి.  మీరు ఆ విషయాలన్నీ మరచిపోయి ఉండవచ్చు.  అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏదైనా రాజకీయ ఇరకాట పరిస్థితి ఎదురైతే ఏదో పది రోజులు మొక్కుబడి గా ఆ వ్యక్తి ని బహిష్కరించి, ఆ తరువాత సాదరమైన పరిష్వంగం తో ఆహ్వానించారనేందుకు కూడా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.  అటువంటి ఆరోపణలు వచ్చిన వారిలో ఎందరో పెద్దలు కూడా ఉన్నారు.

ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే లైసెన్సు ఉంది అనుకున్నట్టయితే ప్రజాజీవనం లో మనం ఉన్నతం గా కనిపించే ఆస్కారం ఉండదు.  నా పార్టీ సభ్యుల కు కూడా నేను అదే చెబుతూ ఉంటాను.  ఏది పడితే అది ప్రతి ఒక్కరి విషయం లో మాట్లాడే హక్కు మన కు లేదు అంటాను.  మనం పరిమితుల లో ఉండి ప్రజాజీవనం లోని నియమాలను పాటించాలి.  అటువంటి వారు ఏ పార్టీ వారైనా కావచ్చు.  అందుకే ఈ తరహా వైఖరి సరి అయింది కాదు అని నా పార్టీ సభ్యుల కు నేను చెబుతున్నాను.  ఇదే విషయాన్ని నేను బహిరంగం గా కూడా చెబుతాను.  మనం ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నట్టయితే ఏదో ఒక సమయానికయినా మార్పు వచ్చి తీరుతుంది.

ఏ పని అయినా ఎవరు చేశారు అన్నదే ప్రాధాన్యం సంతరించుకుంటుంది.  ఆ పని చేసిన ఘనత వారి కే చెందుతుంది. మీ సాహసమే కొన్ని అంశాల ను మన ముందు ప్రముఖం గా ఆవిష్కరించింది.  ఎన్ఆర్ సి ని గురించి ఇక్కడ చర్చించడమైంది.  దాని ఘనత ను మీరు తీసుకోలేరా?  సోదరుడా, ఎందుకు పారిపోతున్నావు? దాని ఘనత ను కూడా నీవే తీసుకో.

అసమ్ ఒప్పందం లో ఎన్ఆర్ సి ని కూడా ఒక భాగం గా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తరువాత సర్వోన్నత న్యాయస్థానం  ప్రవేశించవలసి వచ్చింది.  మేము ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం తీర్పునే అమలుపరుస్తున్నాము.  ఆ ఒప్పందం ఘనత కూడా మీదే. వోట్లు రాబట్టుకోవడం ఎన్నో అర్ధ సత్యాలు ప్రచారం చేస్తారు.  కానీ కొన్ని అంశాలలో అయినా స్పష్టత ను ఇవ్వండి.  అప్పట్లో ఎన్ఆర్ సి కి సంబంధించి తీసుకొన్న నిర్ణయాలనే మేము అమలు చేస్తున్నాము. మా వరకు అది వోటు బ్యాంకు రాజకీయం కాదు.  అది దేశ ఐక్యత, సమగ్రత, ఉజ్వల భవిష్యత్తు లకు సంబంధించిన అంశం.  అదే మేము చేస్తున్నాము.

ఇక్కడ సర్ దార్ సాహబ్ ప్రస్తావన ను కూడా తీసుకుందాము.  అది నాకు ఆనందాన్నే కలిగిస్తుంది.  కాని సర్ దార్ సాహబ్ దేశ ప్రథమ ప్రధాన మంత్రి అయినట్టయితే కాశ్మీర్ సమస్యే తలెత్తేది కాదంటే కాంగ్రెస్ వారు ఏకీభవించరు.  సర్ దార్ సాహబ్ తొలి ప్రధాన మంత్రి అయి ఉంటే, ఈ రోజు న గ్రామాలు సమస్యల లో కొట్టుమిట్టాడుతూ ఉండేవి కావు అని మేము ఇప్పటికీ నమ్ముతున్నాము.  అసలు జాతి కే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించి ఉండేది.  అదే మా ఆలోచన.  అది తప్పు అయినా అయి ఉండవచ్చు.  కానీ తొలి కాంగ్రెస్ ప్రభుత్వం లో తొలి హోం మంత్రి అయిన సర్ దార్ సాహబ్ వల్లనే 500 రాజరిక సంస్థానాలు దేశం లో విలీనం అయ్యాయనే అంశం లో మరో వాదానికి తావే లేదు కదా.  ఆయన జీవించినంత కాలం కాంగ్రెస్ కోసమే పోరాడారు, జీవించారు.  కాంగ్రెస్ కోసమే ప్రాణత్యాగం చేశారు.

గుజరాత్ లో ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం సర్ దార్ సాహబ్ పోస్టర్ లలో ప్రముఖం గా కనిపించే వారు. కానీ జాతీయ ఎన్నికల సమయం లో ఆయన ఎక్కడా కనిపించలేదు.  ఆయన మీ పార్టీ వ్యక్తే.  ఆయన తో మీకు ఉన్న సమస్య ఏమిటి? ఈ రోజు న కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ సూచిస్తున్నాను, ఐక్యతా విగ్రహం గా నిలచిన ప్రపంచం లోనే అతి పెద్ద విగ్రహం వద్ద కు ఒక్క సారైనా వెళ్లి సర్ దార్ సాహబ్ కు నివాళి ని అర్పించండి.  గులాం నబీ జీ కొన్ని రోజులైనా గుజరాత్ లో గడపాలని నేను భావిస్తున్నాను.

పాత కాలం నాటి నిబంధనలపై ఒక ఆసక్తికరమైన కథ మీకు చెబుతాను. ఎక్కడైనా ఒక భారీ ఆనకట్ట లేదా విమానాశ్రయం ఉన్నట్టయితే అక్కడ “ఫొటోగ్రఫీ ని అనుమతించేది లేదు” అనే బోర్డు కనిపిస్తుంది. ఈ రోజు న ఒక ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం ఫొటో ను అంతరిక్షం నుండి తీయగలిగే సాంకేతిక విజ్ఞానం మన కు అందుబాటు లో ఉంది.  కానీ ఇప్పటికీ ఆ పాత నిబంధనే కొనసాగుతోంది.  సర్ దార్ సరోవర్ ఆనకట్ట పొంగి పొరలుతున్న సమయం లో దిగ్విజయ్ సింహ్ గారి ప్రభుత్వం అధికారం లో ఉంది. ప్రజలు అక్కడ కు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించ లేదు.  కానీ నేను ముఖ్యమంత్రి ని అయిన తరువాత ప్రజలు అక్కడ కు వచ్చి ఫొటోల ను తీసుకొనే విధం గా ఆ నిబంధన ను మార్చాను.  అయితే ప్రవేశ రుసుము ను వసూలు చేయాలని నిర్ణయించాను.  ఆ సొమ్ము తో ప్రజల కు మంచి వాహనాల నిలుపుదల వసతి ని ఏర్పాటు చేయవచ్చు అని భావించాను.  ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారి లో అయిదు లక్షలవ సందర్శకులు బారాముల్లా కు చెందిన కొత్త గా వివాహమైన జంట.  వారి ని మేము సత్కరించాము.  పరిస్థితి ఎంత గా మార్చవచ్చో చూడండి.  అందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఐక్యతా విగ్రహం వద్ద ఏర్పాటు చేసుకోవలసిందిగా కాంగ్రెస్ కు సూచిస్తున్నాను.  అప్పుడు మీకు బాగుగా అనిపిస్తుంది.  మనం అందరమూ జాతి నాయకుల కు నివాళి ని అర్పించాలి, మరి మనం ఆ పని ని చేస్తూనే ఉందాము.

గతం లో దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక అనే విధాం అమలులో వుండేది. దానినుంచి మీరందరూ లబ్ది పొందారు. కొంతమంది వాదనలు చేస్తున్నారు. కానీ వాటిలో సహేతుకత లేదు.  ఓటర్లందరూ ఒకేసారి ఎలా నిర్ణయం తీసుకుంటారని వాళ్లు అంటున్నారు. దీనికి ఒడిషాయే ఒక పెద్ద ఉదాహరణ.  ఆ రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందలేదు. అక్కడి ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఒకటి లోక్ సభ కోసం, మరొకటి విధాన సభకోసం. అంటే మన ఓటర్లు ఒకే సమయంలో రెండు ఓట్లు వేయవచ్చు. వారికి ఆ ఇంగితజ్ఞానం వుంది. దాని వలన కొన్ని సీట్లు బిజెడికి వెళ్లాయి. కొన్ని సీట్లు బిజెపికి వచ్చాయి. మన ఓటర్లకు ఆ పరిపక్వత వుంది. మనం వారిని అగౌరవపరుస్తూ తక్కువగా చూస్తున్నాం.
దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయని పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే వాస్తవం చూడండి. ఎక్కడైతే జమిలి ఎన్నికలు జరిగాయో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఒకసారి చరిత్రను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఒడిషాలో కూడా. కాబట్టి ఓటర్ల తెలివిని సందేహించకండి. ప్రతి ప్రయత్నాన్ని ఆహ్వానించాలి. ప్రతి ప్రయత్నంలో మన వంతు పాత్రను పోషించాలి. అయితే ప్రారంభంలోనే మనం తలుపులు మూసేస్తే మార్పును ఎలా తేగలం? నా అభిప్రాయం ప్రకారం ఓటర్ల మనస్సాక్షిని అనుమానించవద్దు. 
 ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వారు కేవలం ఇవిఎంలను మాత్రమే వ్యతిరేకిస్తున్నారా? అని అనిపిస్తుంది. కాదు. అపోషిజిషన్ పార్టీ అంటే తప్పకుండా ప్రతిదాన్ని వ్యతిరేకించాలని అర్థం చేసుకున్నట్టున్నారు. నాకు ఇంకా గుర్తు వుంది. గతంలో కొంతమంది బాగా చదువుకున్న సభ్యులు ఈ సభలో మాట్లాడుతూ ఈ దేశంలో డిజిటల్ లావాదేవీలు సాధ్యం కావని అన్నారు. పేదవాళ్లకు డిజిటల్ ఎలా అందుబాటులోకి వస్తుంది?  వాళ్లు మొబైల్ ఫోన్ ను ఎలా వాడుతారు?  ఇలా ప్రశ్నలు వేస్తూ ఈ సభలో అనేక ఉపన్యాసాలు చేశారు. ఆ విధంగా డిజిటల్ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. 

 కొంత మంది సభ్యులు ఆధార్ కార్డులను వ్యతిరేకించారు. మీరు అధికారంలో వున్నప్పుడు ఆధార్ అనేది చాలా గొప్ప విషయంగా కనిపించింది. కానీ మేం అధికారంలోకి వచ్చి ఆధార్ వ్యవస్థను పని చేయించాలని చూస్తే అది మీకు ప్రమాదంగా కనిపించింది. కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ ప్రక్రియను ఆపాలని చూశారు. ఆధునిక భారతదేశాన్ని, నూతన భారతదేశాన్ని నిర్మించాలనుకున్నప్పుడు మనం సాంకేతికతనుంచి దూరమై ఆ పని చేయగలమా? సాంకేతికతను కాపాడుకోవడం ముఖ్యం ..అంతే తప్ప ఇలాంటి వాటినుంచి పారిపోతూ వుంటామా?

జిఎస్టీ, ఇవిఎం, డిజిటల్‌వి- మ్యాప్‌ఇలా ప్రతిదాన్నీ వ్యతిరేకించారు. ప్రతి చోటా వ్యతిరేకతే. గత ఐదేళ్లలో రాజ్యసభలో ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించినవారందరినీ ప్రజలు శిక్షించారు. ఈ రోజున రాజ్యసభలో జరిగే ప్రతిదాన్నీ ఓటర్లు గమనిస్తూనే వున్నారు. ఓటు వేసే సమయం వచ్చినప్పుడు ఆయా పార్టీలు లోక్‌సభలో, రాజ్యసభలో ఎలా ప్రవర్తించాయో  గుర్తుకు తెచ్చుకొని మరీ ఓటు వేస్తారు. ఈ విషయం మొన్నటి ఎన్నికల్లో రుజువైంది. ఈ గుణపాఠాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఐదు సంవత్సరాల కోసం పని చేయాలి. 
 నూతన భారతదేశాన్ని వ్యతిరేకించడాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. కారణం ఏంటి? మీరే చెప్పండి. మీరు అంటున్నారు. ఐదు అంశాలు బాగున్నాయి. మిగతావి బాగాలేవని చెబుతున్నారు. 

కొంతమంది అనొచ్చు..నూతన భారతదేశం భారతదేశాన్ని నిర్మించడానికైతే ఆ విధంగా అమెరికా చేయలేదు లేదా ఆ విధంగా మరొక దేశంచేయలేదని. కాబట్టి మనం కూడా చేయవద్దని చెబుతున్నారు. ఇతరులు ఏం చేశారో పక్కన పెట్టండి. మన దేశ చరిత్ర ఈ నాటిది కాదు. ఐదువేల సంవత్సరాల చరిత్రను కలిగి వున్నాం. ఎన్నెన్నో ఉత్తమ సంప్రదాయాలు, విలువలను కలిగి వున్నాం. ఇతరులు ఏం చేశారో పక్కన పెట్టండి. ఇతర దేశాలకు మనం ఆదర్శప్రాయంగా నిలవాలి. 

 దేశంలోని 125 కోట్ల మంది పెద్ద పెద్ద కలలు కనకూడదా?  పది అంశాలు బాగా లేవని మనం అనొచ్చు. ఐదు అంశాలు బాగున్నాయని అంటున్నాం. అయితే ఆ బాగున్న ఐదు అంశాలపైన అయినా కనీసం దృష్టి పెడదాం. దేశ ప్రజలను నిరాశమయ ప్రపంచంలోకి తోసి వేసే పాపం మనం చేయకూడదు. అందరమూ కలిసి అందులో మార్పులు తెద్దాం.  అయితే మనకు ఆ పాత భారతదేశమే కావాలి అని బాహటంగా కోరగలమా?  క్యాబినెట్ నిర్ణయాలను పత్రికా సమావేశంలో ఖండించే నాటి భారతదేశమే మనకు కావాలా?  యాత్రలు చేయడానికి భారతదేశ నావికాదళాన్ని ఉపయోగించుకునే ఆ పాత ఇండియానే కావాలా?   నావికాదళం, సైన్యం, వైమానికదళాల్లో కుంభకోణాలు జరిగిన నాటి భారతదేశం కావాలా?  ముక్కల ముక్కల గ్యాంగుకు మద్దతునిచ్చే భారతదేశం కావాలా?
 రైలు రిజర్వేషన్‌కావాలంటే గంటలు గంటలు క్యూలో నిలబడుకునే భారతదేశం మనకు కావాలా? మధ్యవర్తులు లేకపోతే రిజర్వేషన్‌సాధ్యం కాని పరిస్థితులున్న భారతదేశం కావాలా?  గ్యాస్‌సౌకర్యం కావాలంటే ఎంపీల ఇంటి ముందు క్యూలలో నిలబడుకునే భారతదేశం మనకు కావాలా?  పాస్‌పోర్టుల కోసం నెలల తరబడి ఎదురు చూసే భారతదేశం కావాలా?  ఇన్‌స్పెక్టర్‌రాజ్‌కలిగిన భారతదేశం మనకు కావాలా?  ప్యూన్లు, డ్రైవర్లు, వాచ్‌మ్యాన్ల పోస్టులకోసం ఇంటర్వ్యూలు నిర్వహించి వాటి పేరు మీద అవినీతి చేసే భారతదేశం కావాలా?  అలాంటి పాత రోజుల్లోకి వెళ్లడానికి భారతదేశ ప్రజలు సిద్ధంగా లేరు. వారు వారి కలలకు అనుగుణంగా నిర్మితమవుతున్న నూతన భారతదేశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిపౌరుని ఆకాంక్షలను నెరవేర్చడానికి మనం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. 

 గతంలో ఎలా వుండేదంటే దీపాలు వెలిగించడం, రిబ్బన్లు కత్తిరించడం, పథకాలనుప్రకటించడం..ఇవి మాత్రమే ప్రభుత్వం చేసే పనిగా వుండేది. గతంలో కూడా పేదలకోసం ఇళ్లను నిర్మించారు. యూపిఏ హయాంలో ఇళ్లను నిర్మించలేదా ? అని ప్రశ్నించుకుంటే నిర్మించారనే సమాధనం వస్తుంది. మేం కూడా గృహనిర్మాణం చేశాం. మేం చేసిన కొత్త పని ఏంటి? అని మీరు అడగవచ్చు.  మా హయంలో జరిగింది ఏమంటే మీరు ఐదు సంవత్సరాల్లో పాతిక వేల ఇళ్లు నిర్మిస్తే మేం అదే ఐదేళ్లలో ఒకటిన్నర కోట్ల గృహాలను నిర్మించి పేదలకు అందిజేశాం.  కాబట్టి మేం పాలన వ్యవస్థలోని సంక్లిష్టతను సరళీకరించామని నేను నమ్ముతున్నాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా స్వతంత్ర భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో అనేక ఇబ్బందులను సృష్టించడం మనం చూశాం. గతంలో ప్రభుత్వాలు చేసిన పనుల కారణంగా ప్రజలు అవస్థలు పడ్డారు. కొంత మంది తప్పుదోవలో నడిచారు. వత్తిళ్ల మధ్యన జీవించారు. 

 దేశంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి లేకపోతే దాని గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి. అయితే ప్రభుత్వ కార్యక్రమాలవల్ల, వత్తిళ్ల కారణంగా సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలం కాకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేం ఈ దేశంలోని ప్రతి పౌరుని బలోపేతం చేయడానికి పని చేస్తున్నాం. ఐదు సంవత్సరాల క్రితం కోట్లాది గృహాలకు విద్యుత్‌సౌకర్యం వుండేది కాదు. గ్యాస్‌కనెక్షన్లు, మరుగుదొడ్లు వుండేవి కావు. గతంలో పెద్ద సంన్కరణల గురించి మాట్లాడారు. కానీ చిన్న చిన్న మార్పులతోనే దేశంలో మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. చిన్న చిన్న మార్పులను చూసి సిగ్గుపడకూడదు. డాంబికాలను వదులుకోవాలి. మనందరమూ సామాన్య ప్రజలమే. సాధారణ ప్రాంతాలనుంచి ఎదిగినవారమే. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినప్పుడు పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి. ఆ విధంగా మేం మా పనిని ప్రారంభించాం. 

శ్రీ ఆజాద్‌గారూ మీరు ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేవారు. ప్రచార కార్యక్రమం ఏదో, ప్రజల్లో చైతన్యం నింపే కార్యక్రమమేదో మనం తేడా తెలుసుకోవాలి. ప్రజల్లో ప్రవర్తనాపరమైన మార్పులు రావాలని ఇచ్చే ప్రకటనను ప్రభుత్వ ప్రకటనగా భావించకూడదు. భోజనం చేయడానికి ముందు చేతులు కడుక్కోవాలని పిల్లలకు చెప్పాలనుకుంటే దానికోసం ప్రచార ఉద్యమం నడపాలి. అందుకోసం ప్రభుత్వమే నిధులను ఖర్చు పెడుతున్నప్పటికీ అది ప్రభుత్వ ప్రచార కార్యక్రమం కాదు. మీరు ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేస్తున్న సమయంలో అంటువ్యాధులు ప్రబలాయి. ఆ సమయంలో నీటిని వేడి చేసుకొని తాగాలని కోరుతూ మీరు కూడా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి భేటీ బచావో, భేటీ పడావో ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రచారంగా భావించడం మంచిది కాదు. 

ఎంజిఎన్‌ఆర్‌ఇ జిఏ పథకం కింద పనులు ఎలా నడిచాయి. అందులో పని చేసినవారు ఒక చోట మట్టిని తీసుకెళ్లి మరోచోట పోయడం చూస్తుంటే ఎంతో బాధగా అనిపించేది. ఎంజిఎన్ ఆర్‌ఇజి ఏ అనేది ప్రజల్లో ప్రవ్తనాపరమైన మార్పులు కోరుకునే కార్యక్రమం కాదు. అయినప్పటికీ మూడు సంవత్సరాలపాటు దాని గురించి ప్రకనలు ఇచ్చారు. ఒక నేత ను ప్రజల్లోకి తీసుకుపోవడానికిగాను ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు గుప్పించారు. ఈ విషయాన్ని ఈ దేశం ఏనాటికీ మరిచిపోదు. తినడానికి ముందు చేతులు కడుక్కోవాలని ప్రజలను కోరడమనేది ప్రవర్తనాపరమైన మార్పు. కాబట్టి ప్రచారానికి, ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమానికి మధ్యన తేడాను మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?

ఆయుష్మాన్‌భారత్‌కార్యక్రమంపైన కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈ అంశంపై అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీలు నాకు అభినందనలు తెలిపాయి. తమ నియోజకవర్గాల్లో అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకోసం ప్రధానమంత్రి సహాయ నిధినుంచి డబ్బులు విడుదల చేయాలని సభ్యులు నాకు ఉత్తరాలు రాశారు. పేదవారికి సాయం చేయాల్సి వస్తే నియమాలను కూడా పట్టించుకోవద్దని నేను వారికి చెప్పాను. ఆ పేదవారికి నూటికి నూరుశాతం సాయం లభిస్తుంది. ఈ విషయం లో సాయం కోసం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలవారు నన్ను సంప్రదించారు. సాయం పొందారు. 

వారి నియోజకవర్గాల్లోని పేదవారి కోసం ప్రధానమంత్రి సహాయ నిధి సాయం కోరిన ఎంపీల కు ఆయుష్మాన్‌ భారత్‌ యోజన గొప్పదనమేంటో తెలుసు. ఇప్పుడు ఎంపీలు ఆ ఉత్తరాలు నాకు రాయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్లు ఆయుష్మాన్‌భారత్‌యోజననుంచి ప్రయోజనం పొందుతున్నారనే విషయం ఆ ఎంపీలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వారికి ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద మార్పు.ఆయుష్మాన్‌భారత్‌యోజననుంచి ఇప్పటివరకూ ౩౦ లక్షల మంది పేదవాళ్లు లబ్ధి పొందారు. 

మనం ప్రజా ప్రతినిధులం. మనం నిత్యం ప్రజలను కలుస్తుంటాం. ఏదైనా లోపంగానీ, అపసవ్యతగానీ నా దృష్టికి వస్తే ఆ సమస్యను నాకు వదిలేయమని ప్రజలకు చెబుతుంటాను. మనందరమూ కలిసి సమస్యను పరిష్కరించాలి. మనందరమూ కలిసి ఆయుష్మాన్‌భారత్‌కార్యక్రమాన్ని బలోపేతం చేస్తే అప్పుడది పేదవారికి సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. పేదవాడు పేదరికాన్నించి బైటపడి నయా మధ్యతరగతి మనిషిగా ఎదుగుతున్న క్రమంలో వారికి ఏదైనా రోగం వస్తే వారు ఆదా చేసిన 20 సంవత్సరాల పొదుపు సొమ్ము ఆవిరయిపోతుంది. అందుకే మానవతా దృష్టితో ఈ పథకాన్ని ప్రారంభించాం. కాబట్టి ఆయుష్మాన్‌భారత్‌యోజన పథకాన్ని విమర్శించడం మానేయండి. 

ఈ సభలో బిహార్‌ లో ప్రబలిన మెదడువాపు వ్యాధి గురించి చర్చించడం జరిగింది. మనందరికీ ఇది ఎంతో సిగ్గుపడాల్సిన, ఆవేదనచెందాల్సిన విషయం. గత ఏడు దశాబ్దాలుగా సమాజపరంగాగానీ, ప్రభుత్వపరంగాగానీ మనం గమనించిన వైఫల్యాల్లో ఇది అతి పెద్ద వైఫల్యం. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి కాస్త మెరుగైనట్టు నాకు తెలిసింది. అయినప్పటికీ దాన్ని విజయంగా నేను పరిగణించను. 
దేశవ్యాప్తంగా టీకాలు వేయించే కార్యక్రమం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య భద్రత కల్పించే కార్యక్రమం గురించి గత ఐదు సంవత్సరాలుగా మేం గట్టిగా పని చేస్తున్నాం. ఈ అంశాల గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా నేను మాట్లాడుతూనే వున్నాను. ఈ విషయంలో ప్రగతి సాధించడానికిగాను ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్యటించాలని చెప్పాను. తద్వారా కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ఎంత వీలైతే అంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరించుకుంటాయి. ప్రజలకు పౌష్టికాహారం అందించడం, మాతృమూర్తులకు ఆరోగ్య భద్రత, ఆయుష్మాన్‌భారత్‌యోజన..వీటి గురించి తగినంతగా ప్రచారం చేస్తే ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవచ్చు. ఈ రోజున ఒక రాష్ట్రం పెద్ద ఎత్తున తీవ్రమైన రోగంతో తల్లడిల్లుతోంది..అది రేపు మరో రాష్ట్రానికి విస్తరించవచ్చు. మనందరం ముందు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా వుంటే అలాంటి సమస్యలనుంచి ప్రజలను కాపాడగలుగుతాం. 
అందరితో కలిసి అందరి వికాసం అనేది రాజకీయ నినాదం కాదు. అభివృద్ధి విషయంలో కొన్ని విషయాల్లో మనం వెనకబడి వున్నాం. మనం దేశవ్యాప్తంగా 112 ప్రగతిని కాంక్షిస్తున్న జిల్లాను గుర్తించడం జరిగింది. రాజకీయపరమైన పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం గురించి కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాకు ఆశ్చర్యంగా వుంది. దీనికి రాజకీయాలకు సంబంధమేంటి? నేను గుజరాత్‌లో వున్నప్పుడు ఎవరైనా కుఛ్‌కు బదిలీ అయితే దాన్ని శిక్షగా భావించి వారు నసిగేవారు. అక్కడకు వెళ్లడానికి ఏ అధికారీ ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు చూడండి కుఛ్‌జిల్లా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా గుర్తింపు పొందింది. ప్రతి రాష్ట్రంలోను అలాంటి జిల్లాలు ఒకటో రెండో వున్నాయి. యువ అధికారులఆలోచనా ధోరణిలో మార్పు తేవాలి. నేను ఆయా రాష్ట్రాలతో మాట్లాడాను. ప్రగతిని కాంక్షిస్తున్న జిల్లాల్లో పని చేయడానికిగాను యువ అధికారులను నియమించాం. ప్రతి రోజూ వాటి ప్రగతిని పర్యవేక్షణ చేయడం జరుగుతోంది. కొన్ని అంశాల్లో ఆ జిల్లాలు ప్రగతి సాధించాయి. అందరితోకలిసి అందరి వికాసం అని మనం అంటున్నామంటే దాని అర్థం ఏ జిల్లా అయినా వెనకబడి వుంటే దాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చి ఆ జిల్లాకు కావలసిన దీమాను బలోపేతం చేసి పరగతి పథంలో తీసుకుపోవడం జరుగుతుంది. 

గత ఐదు సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశంపైన దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఇందుకోసం అవసరమయ్యే వాతావరణాన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని మరింతగా బలోపేతం చేయాలి. ఈ దేశానికిగానీ, నాకుగానీ ఈశాన్యభారతం చాలా ముఖ్యమైనది. అందుకే గత ఐదు సంవత్సరాలుగా ఈశాన్య భారతాన్ని సందర్శించడమనేది మా మంత్రులకు తప్పనిసరిగా కార్యక్రమంగా నిర్దేశించడం జరిగింది. ఈశాన్య భారత రాష్ట్రాల్లోని రాజధానుల్లో మాత్రమే పర్యటన చేయకుండా ఇతర జిల్లాలకు కూడా పోవాలని ఆదేశించడం జరిగింది. అందరితోపాటు అందరి వికాసం అనే నా ఆలోచన వెనక వున్నదేమంటే దేశంలోని అన్ని ప్రాంతాలు భౌగోళికంగా అభివృద్ధి చెందాలి. 

నీటి సంరక్షణ ద్వారా జల విద్యుత్తు

ఈ మధ్యనే నేను నీటి సర్వే చేశాను. దేశంలో దాదాపు 226 జిల్లాలు నీటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంలో నేను అందరినీ జాగృతం చేస్తున్నాను. నీటి సంరక్షణలో ప్రగతి సాధించడంలో సాయం చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎంపీల్యాడ్‌నిధులను ఉపయోగించుకొని నీటి సంరక్షణ చేపట్టడానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి?  ఆ పనులకోసం నిధులను ఎలా అందజేయాలి? అందరమూ కలిసి ఈ నీటి సమస్యనుంచి దేశాన్ని రక్షిద్దాం.   నీటి సంబంధిత సమస్యలపైన, నీటి సంరక్షణపై సమాజంలో అవగాహన కలిగేలా మనందరమూ కలిసి పని చేద్దాం. తద్వారా రాబోయే తరాలకు ఈ నీటి కొరత సమస్యలు రావు. అందుకోసమే కొత్త జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నీటి సంరక్షణ కోసం కృషి చేస్తుంది. 
గతంలో నేను చెపినట్టు దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చాలి. దివాలా చట్టం గురించి ఇక్కడ అనేక చర్చలు జరిగాయి. ఆర్ధిక నేరాలకు పాల్పడేవారిని శిక్షించడానికి సంబంధించిన ఈ చట్టం, ఇన్‌ సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌ రప్టసీ కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత దీని ప్రభావం ఏ స్థాయిలో వుందంటే దీని కారణంగా మూడులక్షల కోట్ల రూపాయలు తిరిగి బ్యాంకులకు చేరాయి. ఇలాంటి వాతావరణంలో మనం మంచిని చూడాలి. అంతే కాదు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలి. మనందరమూ కలిసికట్టుగా పని చేయాలి. మనం చేసే కృషి కారణంగా త్వరలోనే ఫలితాలు వస్తాయి. ఇక్కడ సహకార సమాఖ్య గురించి చర్చించడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో రాజ్యాంగాన్ని తయారు చేశారు. తద్వారా మనం ఐకమత్యంతో ముందడుగు వేయగలం. 

సహకార పోటీ సమాఖ్య అనేది రాష్ట్రాల మధ్యన పోటీతత్వాన్ని తయారు చేయడానికి చాలా ముఖ్యం. ప్రాంతీయ ఆకాంక్షల సాయంతో జాతీయ ఆకాంక్షలను సాధించే దిశగా మనం ముందడుగు వేయాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఏకాభిప్రాయం సాధించగలిగే అంశాలు లేవా? అది సాధ్యం కాదా? అందరమూ ఏకగ్రీవంగా అలాంటి అంశాలపైన పని చేసే వాతావరణం తయారు చేసుకోలేమా? 

గాంధీ @ 150, స్వాతంత్ర్య దినోత్సవం @ 75  ఈ రెండూ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమాలకోసం మనం కలిసికట్టుగా నడవలేమా?  సమాఖ్య నిర్మాణంలో రాజ్యసభ భాగం కాదా?  రాజ్యసభ ప్రత్యేకమైన విభాగమా?  కాదు!  మనం కూడా అదే వ్యవస్థలో భాగం. ప్రజలతో ఎన్నుకోబడినది లోక్‌ సభ. 

ఇక్కడ మాకు తగిన సంఖ్యాబలం లేదని మీరు సమస్యలను సృష్టిస్తూనే వుంటారా?  మమ్మల్ని అవమానించడంద్వారా మీరు సంతోషం చెందుతున్నారనే విషయం నాకు అవగతమవుతోంది. కానీ దేశం భవిష్యత్తేంటి? నేను ఎవరినీ విమర్శించడం లేదు. నేను కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తున్నాను. 

గత ఐదేళ్లలో పూర్తయ్యే దశలో వున్న చాలా పనులు ఆగిపోయాయి. మీరే చెప్పండి. రాజ్యసభలో ఆమోదం పొందకుండా ఆగిపోయిన బిల్లులను తిరిగి లోక్‌ సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరోసారి ఈ కార్యక్రమం చేపట్టడంవల్ల దీనికి చాలా వ్యయం అవుతుంది.  పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న డబ్బును వ్యయం చేయడమే కాకుండా దీనికోసం ఎంతో విలువైన పార్లమెంటు సమయం వృధా అవుతుంది.  ఆరోగ్యదాయకమైన సమాఖ్య నిర్మాణంలో మన రాజ్యసభ భాగం కాబట్టి ఇది మాతో మీరు అంగీకరించడం, అంగీకరించకపోవడం అనేది మీ ఇష్టం. కానీ మనందరం మన మాజీ రాష్ట్రపతి చెప్పినదానితో తప్పకుండా ఏకీభవించాలి. నాకు అంగీకారమే. మీరు కూడా తప్పకుండా అంగీకరించాలి. శ్రీ ప్రణబ్‌ ముఖర్జీ చాలా స్పష్టంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు.  ప్రజల మద్దతుతో మెజారిటీ పక్షం పాలనలోకి వస్తుంది. కానీ అభ్యంతరం తెలపాలనే మైనారిటీ పక్షానికి ప్రజల మద్దతు వుంటుంది. ఆ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. కానీ మన మాజీ రాష్ట్రపతి మరో మాట కూడా చెప్పారు. పాలనను అడ్డుకోవడానికి ప్రతిపక్షానికి ప్రజలు మద్దతు తెలపలేదు అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ఈ సందేశాన్ని అందిపుచ్చుకొని మనం ముందకు సాగాల్సి వుంది. అప్పుడే సమాఖ్య నిర్మాణమనేది వాస్తవంగా పని చేయగలుగుతుంది.  రాజ్యసభ అనేది రాష్ట్రాల ప్రతినిధి. రాష్ట్రాల ఆకాంక్షలు అనేవి రాజ్యసభ ద్వారా ప్రతిఫలిస్తాయి.  రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా పని చేస్తూ ఆయా రాష్ట్రాల సంక్షేమంకోసం తమ గొంతును వినిపించాలి. 

భారతదేశంలాంటి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ప్రతిదీ ఇవ్వడం కష్టమనే విషయం వాస్తవం. కొన్ని రాష్ట్రాలకు సాయం ముందుగా లభిస్తుంది. మరికొన్నిటికి తర్వాత లభిస్తుంది. కొన్ని రాష్ట్రాలకు అసలు సాయం లభించకపోవచ్చు. అలా జరుగుతుంది. గతంలోకూడా అలా జరిగింది.  కానీ రాజ్యసభలో మెజారిటీ వుంది కదా అని సభా కార్యక్రమాలను ఆపడం సరైన పనేనా?  గతంలో సభ సంపూర్ణంగా వున్నప్పుడు ఆనంద్‌ జీ, గులాంనబీ జీ నాతో మాట్లాడుతూ ఏదో ఒకటి చేయాలని అన్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య వుంది. కానీ కొంత మంది ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఇది మంచిది కాదు. 

మనందరం కలిసి కట్టుగా ఈ సభను నిర్వహించాలి. తద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను నమ్ముతున్నాను.  గాంధీ @ 150, స్వాతంత్ర్యదినోత్సవం @ 75 ఈ రెండు కార్యక్రమాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా వుంటాయని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మనందరమూ నాయకత్వ లక్షణాలతో పని చేసి ఈ దేశంకోసం ఏదో ఒక పని చేయడానికి ముందుకు రావాలని ప్రజలను కోరాలి. ప్రజల్లో తగిన బాధ్యతాయుత స్ఫూర్తిని రగుల్పాలి. తద్వారా వారు దేశంకోసం త్యాగం చేసేలా చూడాలి. భోజనం చేయడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని మనం స్కూళ్లలో బోధించడం సాధ్యమయ్యే పని. 

ఈ సందర్భంగా మనం కొన్ని నియమాలను తయారు చేయవచ్చు. గాంధీ @ 150 కార్యక్రమంకోసం వీటిని చేయవచ్చు. నా జీవితంలో కొత్త పని చేయాలని నేనునిర్ణయం తీసుకున్నాను. నేను చిన్నవాడినే కానీ..నేను ఆహారాన్ని వృధా చేయనులాంటి నిర్ణయాలను ఎవరైనా తీసుకోవచ్చు. 

నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం ఈ సారి నేను పది శాతం తక్కువ యూరియా వాడతానని మన రైతులు నిర్ణయం తీసుకోవచ్చు. 1942 నుంచి 1947 వరకు గల సమయాన్ని తీసుకోండి. చిన్న చిన్న పనులను పురమాయించడంద్వారా దేశంలోని పౌరులందరినీ ఎంతో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దారు గాంధీజీ. మనం కొత్తగా చేయాల్సిన పని లేదు. గాంధీజీ చూపిన మార్గంలో మనం ముందుకు సాగితే చాలు. అప్పుడు దేశంకోసం ఎంతో కొంత పని చేయగలుగుతాం. విధినిర్వహణ స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చాలి. నూతన భారతదేశ నిర్మాణం కోసం మనలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక నమూనాను కలిగి వుండవచ్చు. అంతే తప్ప దేశాన్ని పాత వ్యవస్థలోనే వుంచకూడదు. ఈ దేశంలోని యువత వారి ఆకాంక్షల ప్రకారం నూతన భారతదేశాన్ని నిర్మించాలి. 

సభలో జరిగిన చర్చ నుంచి మంచి అంశాలను ఉపయోగించుకోగలమని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా దేశ సంక్షేమం కోసం మనం మరికొన్ని అడుగులు వేయగలం. 

ఈ చర్చలో పాల్గొన్నందుకు మరోసారి అందరికీ అభినందనలు. గౌరవనీయులైన రాష్ట్రపతికి నా అభినందనలు. మీ అందరికీ నా అభినందనలు తెలుపుతూ నా ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను.

అనేక ధన్యవాదాలు.

*****