పిఎంఇండియా
నమూనా కౌలుదారీ చట్టాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కోసం జారీ చేయడం జరుగుతోంది. దీని తో ఇప్పటికే అమలు లో ఉన్నటువంటి అద్దె చట్టాల లో రాష్ట్రాల కు/కేంద్ర పాలిత ప్రాంతాల కు వాటికి సరిపడే విధం గా సరికొత్త శాసనాన్ని చేయటానికి గాని, లేదా ప్రస్తుత చట్టాల లో సవరించడానికి గాను వీలు ఏర్పడుతుంది.
దీని ద్వారా దేశ వ్యాప్తం గా ఇళ్ల ను అద్దె కు ఇచ్చేందుకు సంబంధించి చట్ట రూపాన్ని పక్కా గా పునర్ నిర్మించడం లో తోడ్పాటు లభిస్తుంది; దీనితో సమగ్ర వృద్ధి కి మార్గం సుగమం అవుతుంది.
దేశం లో ఇల్లు- కిరాయిదారు ల పరంగా ఓ హుషారైనటువంటి, నిలకడతనం కలిగివుండేటటువంటి, అన్ని వర్గాల ను కలుపుకు పోయేటటువంటి కిరాయి ఇళ్ల నిర్మాణ విపణి ని సృజించడం అనేది నమూనా కౌలుదారీ చట్టం ఉద్దేశ్యం గా ఉంది. దీని తో అన్ని ఆదాయ సమూహాల వారి కోసం అద్దె ఇళ్లు అందుబాటు లోకి రాగలవు; నిరాశ్రయులయ్యే సమస్య కు సమాధానం దొరుకుతుంది. మోడల్ టెనెన్సీ యాక్టు ద్వారా ఇంటి ని బాడుగ కు ఇచ్చే ప్రక్రియ మెల్ల మెల్లగా లాంఛన ప్రాయమైన విపణి లా మారి దానికి సంస్థాగత రూపాన్ని ఇచ్చేందుకు తోడ్పాటు లభించగలదు.
ఖాళీ గా మిగిలివున్నటువంటి ఇళ్ల ను అద్దె కు ఇచ్చేందుకు నమూనా కౌలుదారీ చట్టం వీలు కల్పిస్తుంది. దీని ద్వారా అద్దె ఇళ్ల బజారు ను వ్యాపారం రూపం లో అభివృద్ధి పర్చడం లో ప్రయివేటు భాగస్వామ్యం పెరుగుతుందని, ఫలితం గా భారీగా ఉన్నటువంటి ఇళ్ల కొరత సమస్య ను పరిష్కరించవచ్చన్న ఆశ లు ఉన్నాయి.
***