పిఎంఇండియా
రియో డి జనీరోలో జరగబోవు ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహి౦చే క్రీడాకారుల బృ౦దాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలవనున్నారు.
న్యూఢిల్లీలోని మానెక్ షా సెంటర్ వద్ద సోమవారం ఒలింపిక్ బృ౦దాన్ని శ్రీ నరేంద్ర మోదీ కలవనున్నారు. ఇప్పటివరకు 13 క్రీడా విభాగాల్లో సుమారు 100 అథ్లెట్లు రియో ఒలింపిక్స్ కోసం అర్హత సాధి౦చారు.
ప్రధాని క్రీడాకారుల తో అనధికారిక సమావేశ౦లో పాల్గొని, ప్రపంచంలో జరిగే అతి పెద్ద క్రీడా వేదికపై క్రీడాకారులు గొప్ప ప్రదర్శన చేయాలని శుభాకాంక్షలు తెలియ జేయనున్నారు.