Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రెండు దేశాల పర్యటనకు ప్రధాని- ఉదయం ఐర్లాండ్ సందర్శన , రేపు సాయంత్రం న్యూ యార్క్ నగరానికి చేరుకోనున్న ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటన రేపు ఉదయం (సెప్టెంబరు 23, 2015) ప్రారంభం కానుంది. పర్యటనలో భాగంగా ఉదయం డబ్లిన్, ఐర్లాండ్ చేరుకొని ఐర్లాండ్ టీషాక్ (Taoiseach) మిస్టర్ ఎండా కెన్నీతో ప్రధాని చర్చలు జరపనున్నారు . న్యూ యార్క్ నగరానికి బయలు దేరే ముందు ఐర్లాండ్ లోని భారత సంతతి ప్రజలతో కొద్ది సేపు సమావేశమవ్వనున్నారు.

ప్రధాన మంత్రి రేపు సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) న్యూ యార్క్ నగరానికి చేరుకోనున్నారు .