పిఎంఇండియా
నవీకరణయోగ్య శక్తి రంగంలో పెద్ద ఎత్తున గ్రిడ్ అనుసంధానానికి ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ (ఎఫ్ఒఆర్), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రెగ్యులేటరి యుటిలిటి కమిషనర్స్ (ఎన్ఎఆర్ యుసి) కి మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు నవీకరణయోగ్య శక్తి రంగంలో పెద్ద ఎత్తున అనుసంధానం కల్పించే విషయంలో సహకారానికి కింది అంశాలలో వీలు కల్పిస్తుంది:
i) నవీకరణయోగ్య శక్తి సమీకరణకు ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన, అంతర్జాతీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం;
ii) రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను నవీకరణయోగ్య శక్తి వనరుల కొనుగోలు సంకల్పానికి (ఆర్‌పిఒ) సంబంధించి నవీకరణయోగ్య శక్తి అభివృద్ధికి రెగ్యులేటరీ జోక్యం, నవీకరణ యోగ్య శక్తి సర్టిఫికెట్ (ఆర్ ఇసి) ఫ్రేమ్‌వర్క్;
iii) లోడ్ గురించి ముందస్తుగా తెలిపే పద్ధతులు, ప్రక్రియలు;
iv) కాంట్రాక్టింగ్/ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు;
v) పునరుత్పాదనకు వీలు కల్పించే శక్తి వనరులకు సంబంధించి ముందస్తు అంచనా పద్ధతులు, వీటిని ఆపరేటర్లు ఎలా వినియోగించుకుంటున్నారనే అంశంలోనూ;
vi) నవీకరణయోగ్య శక్తి వనరుల అనుసంధానం- నిబంధనలు, గ్యాస్ వాడకంలో సమతూకం, నిల్వ, డిమాండ్ ఆధారిత విధానాలు, ఇంధన మార్కెట్‌లో అసమతుల్యత;
vii) ఉత్పత్తిదారులు గ్రిడ్ క్రమశిక్షణను కాపాడేందుకు వీలుగా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, క్రమశిక్షణ ఉల్లంఘన సందర్భంలో పెనాల్టీల విధింపు అంశాలు;
viii) భౌతిక వ్యవస్థలు, నియంత్రణలు, మార్కెట్‌ల వంటి అనుబంధ సేవలు;
ix) సమాచారం విశ్లేషణ, రెగ్యులేటరీ నిర్ణయాల విషయానికి సంబంధించి ఖర్చు- లబ్ధి విషయంలో విశ్లేషణ.
ప్రస్తుత అవగాహనపూర్వక ఒప్పందం నవీకరణయోగ్య శక్తి వనరుల అనుసంధాన నియంత్రణలు, గ్యాస్ సమతుల్య వినియోగం, నిల్వ, డిమాండ్ , ఇందన అసమతుల్య మార్కెట్ దిశగా ఆలోచనల విషయంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుకల్పిస్తుంది. ఇది పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధనాన్ని పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయడంలో మరింత మెరుగైన నిర్వహణకు భారత విద్యుత్ వ్యవస్థ చేస్తున్న కృషిని మరింత పెంపొందిస్తుంది.
పూర్వ రంగం
ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ (ఎఫ్ఒఆర్) ను విద్యుత్తు మంత్రిత్వ శాఖ 2005 ఫిబ్రవరి 16న ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసింది. 2003 నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో సెక్షన్ 166 (2) లో ఉల్లేఖించిన నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఒఆర్ ను ఏర్పాటు చేశారు. విద్యుత్తు రంగానికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సిఇఆర్‌సి), స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్ఇఆర్‌సి)లు, జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (జెఇఆర్‌సి) లు తీసుకువచ్చే నిబంధనల మధ్య సారూప్యతను సాధించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.
గతంలో డిమాండ్ విషయంలో నిర్వహణ, ఇంధన సామర్ధ్యం వంటి విషయాలలో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్ తో ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే విద్యుత్తు డిమాండు, సరఫరా ల సామర్ధ్యాన్ని మెరుగుపరచడం, ఇంధన రంగంలో భవిష్యత్ సమన్వయాలకు గల అవకాశాల ప్రణాళికకు సంబంధించి కాలిఫోర్నియా పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ( లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబరెటరీకి మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ కాంట్రాక్టర్)లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఎన్ఎఆర్ యుసి అనేది అమెరికాలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్లకు ప్రాతినిధ్యం వహించే సంస్థ. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు నిత్యావసర సేవలను నియంత్రిస్తుంటారు. ప్రతిపాదిత అవగాహనపూర్వక ఒప్పందం, వాణిజ్యపరంగా ఇంధన సమర్థత, ఇనవేశన్ లకు సంబంధించి అమెరికా, ఇండియాల మధ్య కుదిరిన విశాల ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా చెప్పుకోవచ్చు. క్లీన్ ఎనర్జీ డిప్లాయిమెంట్ (పేస్ -డి)ని ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా- ఇండియా ప్రారంభించిన ‘గ్రీనింగ్ ద గ్రిడ్’ ప్రాజెక్టులో భాగంగా దీనిని పరిగణిస్తారు.