పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు అస్సామ్ లో పర్యటించనున్నారు.
తిన్ సుకియా జిల్లా లో బ్రహ్మపుత్ర నదిపై ఢోలా- సాదియా నదీ వంతెన ప్రాజెక్టును ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి రెండు కీలక అభివృద్ధి పథకాలు.. గువాహాటీ లో ఎఐఐఎమ్ఎస్ కు, గోగాముఖ్ లో ఐఎఆర్ఐ కి పునాదిరాళ్లు వేయనున్నారు కూడా. సాయంత్రం పూట, ఖానాపారా లో ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
అస్సామ్ లో తన కార్యక్రమాలను గురించి ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ప్రకటించారు. అస్సామ్ ప్రజలతో మమేకం అయ్యేందుకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనేందుకు తాను చాలా ఆసక్తితో వేచివున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
‘‘రేపు నేను వేరు వేరు కార్యక్రమాలలో పాల్గొనడం కోసం అస్సామ్ లో ఉంటాను. అస్సామ్ ప్రజలతో మమేకం కావడం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనేందుకు నేను చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.
రెండు కీలకమైన పథకాలకు.. ఎఐఐఎమ్ఎస్ మరియు ఐఎఆర్ఐ.. నేను శంకుస్థాపన చేయబోతున్నాను. ఈ రెండు పథకాలు అస్సామ్ మరియు ఈశాన్య ప్రాంత ప్రగతిని వేగిరపరచగలవు.
ఢోలా- సాదియా నదీవంతెన ను రేపు ప్రారంభించడం జరుగుతుంది. ఇది మన దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి అవస్థాపన పథకాలలో ఒకటి.
సాయంత్రం పూట, ఖానాపారా లో ఒక బహిరంగ సభలో నేను ప్రసంగించనున్నాను. దీనిని మీరు మీ మొబైల్ ఫోన్ లలో http://nm4.in/dnldapp ద్వారా వీక్షించవచ్చు’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో తెలిపారు.
***
I will be in Assam tomorrow to take part in various programmes. I am eagerly awaiting this opportunity to interact with people of Assam.
— Narendra Modi (@narendramodi) May 25, 2017
I shall lay the foundation stone for two key projects- AIIMS & IARI. Both projects will quicken the development of Assam & the Northeast.
— Narendra Modi (@narendramodi) May 25, 2017