Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు కట్ రా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కాశ్మీర్ లోని కట్ రా ను రేపు సందర్శించనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని, స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. అలాగే కట్ రా లో ఒక క్రీడా భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించనున్నారు; కట్ రా లో ఒక బహిరంగ సభలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడా.

***