Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు ఝార్ఖండ్లో ప్రధానమంత్రి పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 17న) ఝార్ఖండ్లోని హజారీబాగ్, రాంచీలలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఆరోగ్యం, విద్య, నీటి సరఫరా, పారిశుధ్యం తదితర రంగాలకు సంబంధించిన పలు

ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరిస్తారు. వీటిలో అధిశాతం ఝార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజన ప్రజానీకానికి లబ్ధి చేకూర్చనున్నాయి.

ప్రధానమంత్రి హజారీబాగ్లో ఆవిష్కరించబోయే ప్రాజెక్టులు ఇవే:-

హజారీబాగ్, డుంకా, పాలమూలలో వైద్య కళాశాలల భవనాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే

హజారీబాగ్, డుంకా, పాలమూలతోపాటు జంషెడ్పూర్లో నాలుగు 500 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

రామ్గఢ్, హజారీబాగ్ జిల్లాల్లో నాలుగు గ్రామీణ నీటి సరఫరా పథకాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అంతేకాకుండా రెండు జిల్లాల్లోనూ అదనంగా ఆరు గ్రామీణ నీటి సరఫరా పథకాలకు, హజారీబాగ్లో పట్టణ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేస్తారు.

సాహిబ్గంజ్ మురుగు శుద్ధి ప్లాంటును, నమామి గంగే కార్యక్రమం కింద నిర్మించిన మధుసూదన్ ఘాట్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

రామ్గఢ్లో మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

ప్రత్యేకించి దుర్బల గిరిజన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నీటి సరఫరా పథకాలకు

ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

హజారీబాగ్లో గిరిజనాధ్యయన కేంద్రం, ఆచార్య వినోబా భావే విశ్వవిద్యాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

ఈ-నామ్ పథకం కింద మొబైల్ ఫోన్ల కొనుగోలుకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ప్రారంభించడంలో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రధానమంత్రి చెక్కులు పంపిణీ చేస్తారు.

బాలల పౌష్టికాహార స్థాయి పెంపు దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబోతున్న క్షీర ప్రదాన పథకం కింద ఎంపిక చేసిన పాఠశాల పిల్లలకు పాల పంపిణీని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

రాంచీలో జనారోగ్య యోజన-ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో ప్రధానమంత్రి మాటామంతీ
నిర్వహిస్తారు.