Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ఆయన ప్రారంభిస్తారు


రేపు అనగా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆయన ఒక జన సభ లో రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్త పంచాయతీ రాజ్ ప్రతినిధులను ఉద్దేశించి మండలా నుండి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా, రానున్న అయిదు సంవత్సరాల కాలంలో ఆదివాసీల సర్వతోముఖ అభివృద్ధి కోసం ఒక మార్గసూచి ని ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. మండలా జిల్లా మనేరి లో ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు చెందిన ఒక ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు కు శంకుస్థాపన సూచకంగా ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆయన ఒక స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ ని కూడా ప్రారంభిస్తారు.

పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు విద్యుత్తు సౌకర్యంతో కూడినటువంటి భారతదేశాన్ని అందిస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానానికి అనుగుణంగా ప్రధాన మంత్రి 100 శాతం పొగ రాని పొయ్యిల లక్ష్యాన్ని సాధించిన గ్రామాల సర్పంచ్ లను, మిశన్ ఇంద్రధనుష్ లో భాగంగా 100 శాతం టీకా మందు లక్ష్యాన్ని సాధించిన గ్రామాల సర్పంచ్ లను, అలాగే సౌభాగ్య పథకంలో భాగంగా 100 శాతం విద్యుత్తు సదుపాయం కల్పన లక్ష్యాన్ని సాధించిన గ్రామాల సర్పంచ్ లను సత్కరించనున్నారు.

సర్వశ్రేష్ఠ పంచాయత్ పురస్కార్ యోజన లో భాగంగా రాష్ట్రీయ ఇ-పంచాయత్ పురస్కార్ మరియు గ్రామ్ పంచాయత్ వికాస్ పురస్కార్ ల విజేతలను ఈ సందర్భంగా సత్కరిస్తారు.

తరువాత, ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లోని మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లాల కలెక్టర్ లతో సంభాషిస్తారు.

****