Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ విజిట‌ర్స్ కాన్ఫ‌రెన్స్ ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాని


బంగారం ప‌థ‌కాల ప్రారంభం

సోనేప‌ట్‌లో ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గురువారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ స‌మావేశ మందిరంలో ఇంప్రింట్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రిస్తారు. భార‌తదేశానికి అనువైన ప‌ది సాంకేతిక విభాగాల్లో ఎదుర‌య్యే సాంకేతిక‌, ఇంజ‌నీరింగ్ స‌వాళ్ళ ప‌రిష్కారంపై ప‌రిశోధ‌న‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉమ్మ‌డిగా రూపొందించిన ప్ర‌ణాళిక ఇంప్రింట్ ఇండియాను ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని రాష్ట్ర‌ప‌తికి అందిస్తారు.

రేస్‌కోర్స్ రోడ్ నంబ‌ర్ 7లో ప్ర‌ధాని మూడు బంగారం ప‌థ‌కాల‌ను ఆవిష్క‌రించ‌నున్నారు. అవి గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్‌, సావెరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌, ఇండియా గోల్డ్ కాయిన్ అండ్ బులియ‌న్ స్కీమ్‌.

హ‌ర్యానాలోని సోనేప‌ట్‌లో మూడు జాతీయ హైవే ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేసి బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తారు.