Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు వారణాసి, లక్నో లకు వెళ్లనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు వారణాసి, లక్నో లకు వెళ్లనున్నారు.

ప్రధాని వారణాసికి చేరుకొని, అక్కడ దివ్యాంగజన సశక్తీకరణ సమారోహ్ కు హాజరవుతారు. ఈ కార్యక్రమం దివ్యాంగ వ్యక్తులకు సహాయపడే పరికరాల పంపిణీ కోసం ఏర్పాటు చేయబడింది.

లక్నో లో ప్రధాని బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. భారతీయ మైక్రో క్రెడిట్ ఆధ్వర్యంలో ఇ-రిక్షాల‌ పంపిణీ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు అవుతారు. అంబేద్కర్ మహాసభ లో బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటిస్తారు.

*******