పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
గత 12 సంవత్సరాల్లో రైతుల సంక్షేమానికీ, వారికి సాధికారతను కల్పించడానికి చేపట్టిన అపూర్వ కృషిని ఆ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించింది. అన్నదాతలను దృష్టిలో పెట్టుకొని అమలుచేసిన వివిధ కార్యక్రమాలు వారి జీవితాల్లో చెప్పుకోదగ్గ సానుకూల మార్పులను తీసుకువచ్చాయని ఆ వ్యాసం పేర్కొనడంతో పాటు వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్న తీరును కూడా వివరించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘రైతు సోదరీ, సోదరుల సంక్షేమంతో పాటు వారికి సాధికారతను కల్పించే దిశగా ఇదివరకెన్నడూ ఎరుగని కార్యక్రమాలను గత 12 సంవత్సరాల్లో అమలుచేశారు. అన్నదాతల కోసం మేం తీసుకువచ్చిన పథకాలతో వారి జీవితాల్లో అనేక సకారాత్మక మార్పులు వచ్చాయి. వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న ఈ పెనుమార్పులను గురించి కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ గారు తాను రాసిన ఒక వ్యాసంలో సమగ్రంగా వివరించారు’’ అని తెలిపింది.
***
पिछले 12 वर्षों में किसान भाई-बहनों के कल्याण और सशक्तिकरण की दिशा में अभूतपूर्व कार्य हुए हैं। अन्नदाताओं के लिए हमारी योजनाओं से उनके जीवन में काफी सकारात्मक बदलाव आया है। केंद्रीय मंत्री @ChouhanShivraj जी ने अपने आलेख में कृषि क्षेत्र की इस परिवर्तनकारी यात्रा के बारे में… https://t.co/DiiPVCWZIO
— PMO India (@PMOIndia) June 14, 2026