Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైల్వేల రంగంలో సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి మరియు ఇండోనేశియా కు మ‌ధ్య కుదిరిన ఎమ్ఒయు ను మంత్రివ‌ర్గం దృష్టికి తీసుకురావ‌డ‌మైంది.


రైల్వేల రంగంలో సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఇండోనేశియా కు మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాన్ని (ఎమ్ఒయు) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టి కి తీసుకురావ‌డ‌మైంది. ఈ ఎమ్ఒయు పై 2018 మే నెల 29వ తేదీ నాడు సంత‌కాలయ్యాయి. 

దిగువ‌న పేర్కొన్న రంగాల‌లో స‌హ‌కారానికి సంబంధించి ఒక కేంద్రీకృత వైఖ‌రి ని ఎమ్ఒయు లో పొందుప‌ర‌చ‌డ‌మైంది:-

* కెపాసిటీ బిల్డింగ్ స‌హా జ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని, సంస్థాగ‌త స‌హ‌కారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం;

* రైల్వేల‌లో సిగ్న‌లింగ్ వ్యవస్థ, క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ ల‌తో పాటు రైలు పెట్టెలు, ఇంజ‌ను వ‌గైరాల ఆధునికీక‌ర‌ణ‌;

* రైల్వే కార్య‌క‌లాపాలు, నిర్వ‌హ‌ణ‌, ఇంకా నియ‌మాల‌ సంబంధ ఆధునికీక‌ర‌ణ‌;

* ఇంట‌ర్-మోడ‌ల్ ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్‌ ట‌ర్మిన‌ల్స్ ను అభివృద్ధిప‌ర‌చ‌డం;

* రైలు ప‌ట్టాలు, వంతెన‌లు, సొరంగాలు, విద్యుత్తు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లు మ‌రియు ఓవ‌ర్ హెడ్ ఎల‌క్ట్రిఫికేష‌న్ తో పాటు, ఫిక్స్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ యొక్క నిర్మాణం మ‌రియు నిర్వ‌హ‌ణ సంబంధిత సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ ఆదాన ప్రదానం;

* ఉభ‌య ప‌క్షాలు సంయుక్తంగా నిర్ణ‌యించే మేర‌కు ఇత‌ర రంగాల‌లోనూ స‌హ‌కరించుకోవడం.

పూర్వ‌రంగం:

రైల్వేల రంగంలో సాంకేతిక స‌హ‌కారం కోసం వివిధ విదేశీ ప్ర‌భుత్వాలు మ‌రియు జాతీయ రైల్వేల‌తో రైల్వేల మంత్రిత్వ శాఖ ఎమ్ఒయు ల‌ను కుదుర్చుకొంది. స‌హ‌కారానికి గుర్తించిన రంగాల‌లో హై స్పీడ్ కారిడోర్లు, ఇప్ప‌టికే ఉన్న మార్గాల‌లో వేగాన్ని పెంచ‌డం, ప్ర‌పంచ శ్రేణి స్టేష‌న్ లను అభివృద్ధిచేయడం, హెవీ హాల్ ఆప‌రేష‌న్స్ మ‌రియు రైల్వే అవ‌స్థాప‌న యొక్క ఆధునికీక‌ర‌ణ ల వంటివి ఉన్నాయి. రైల్వేల సాంకేతిక‌త మ‌రియు కార్య‌క‌లాపాలు, సాంకేతిక బృందాల రాక‌ పోక‌లు, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజనాలు ఇమిడివున్న రంగాల‌లో శిక్ష‌ణ & చ‌ర్చా స‌భలు మ‌రియు కార్య‌శాల‌ల నిర్వ‌హ‌ణ రంగాల‌లో స‌మాచార ఆదాన ప్ర‌దానం వంటి వాటి ద్వారా స‌హ‌కారాన్ని నెలకొల్పుకోవ‌డమైంది.

***