పిఎంఇండియా
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను అర్హత కలిగిన నాన్-గెజెటెడ్ రైల్వే ఉద్యోగులకు (ఆర్ పి ఎఫ్/ఆర్ పి ఎస్ ఎఫ్ సిబ్బంది మినహా) 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్ డ్ బోనస్ (పి ఎల్ బి) చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఆమోదం ఫలితంగా ఇంచుమించుగా రూ.2090.96 కోట్ల మేరకు ఆర్థిక భారం పడుతుంది.
పిఎల్ బి ని చెల్లించడం వల్ల రైల్వేల పనితీరును మెరుగుపరచడంలోను, ఉత్పాదకత స్థాయిలను పెంపొందింపచేయడంలోను పెద్ద సంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగులకు ప్రేరణను అందించడమే కాకుండా పారిశ్రామిక శాంతిని పరిరక్షించడం కూడా సాధ్యపడుతుంది.
అర్హులైన రైల్వే ఉద్యోగులకు దసరా/పూజ సెలవుదినాలకు ముందుగానే ఈ బోనస్ ను చెల్లించడం జరుగుతుంది.