Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైల్వే, రహదారుల రంగాలలో పురోగతిని సమీక్షించిన ప్రధాన మంత్రి

రైల్వే, రహదారుల రంగాలలో పురోగతిని సమీక్షించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కీలక మౌలిక సదుపాయాల రంగాలైన రైల్వేలు, రహదారుల రంగాలలో పనుల పురోగతిపై ఈ రోజు సమీక్ష జరిపారు.

2015-16 లో రూ.93,000 కోట్లకు పైగా మూలధనాన్ని పెట్టుబడి పెట్టినట్లు సమీక్ష క్రమంలో భాగంగా గమనించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే, భారీ ఎత్తున 65 శాతం అధికమే కాకుండా ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టనే లేదు కూడా. అలాగే, 2015-16 లో 1,780 కిలోమీటర్ల మేర మార్గాలను ప్రారంభించడం జరిగింది.

అంతే కాక 1730 కిలోమీటర్ల మార్గాలను విద్యుదీకరించారు. ఈ గణాంకాలు రైల్వే చరిత్రలో ఉత్తమమైన ప్రదర్శనకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దడాన్ని వేగవంతం చేయవలసిన అవసరముందని ప్ర‌ధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో రైల్వేలు వాటి అభ్యుదయేచ్ఛ స్థాయిని గణనీయంగా పెంచుకోవాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. రైల్వేలు మౌలిక సదుపాయాల ఉపయోగాన్ని మెరుగుపరుచుకుంటూ, మౌలిక సదుపాయాల వినియోగాన్ని వివిధీకరించుకోవాలని సూచించారు. నైపుణ్యాలను తీర్చిదిద్దడం వంటి కార్యకలాపాలకు గ్రామీణ ప్రాంతాలలోని రైల్వేల మౌలిక సదుపాయాలను వినియోగించవచ్చని ఆయన పునరుద్ఘాటించారు. ఇది రైల్వేల ఛార్జీయేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కూడా దోహదం చేస్తుందని చెప్పారు.

2015-16లో 6000 కిలో మీటర్లకు పైగా హైవేలను పూర్తి చేసినట్లు, అదే కాలంలో మరో 10,098 కిలో మీటర్ల నిర్మాణానికి కాంట్రాక్టులు ఇచ్చినట్లు విషయాన్ని రహదారుల రంగ సమీక్షలో భాగంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి అనుసరిస్తున్న వివిధ నమూనాలను అధ్యయనం చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. వాటిలో ఉత్తమమైన పద్ధతులను అవలంబించాలని, ఇలా చేసినందువల్ల హైవేల నిర్మాణ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను తీసుకురాగలమని ఆయన అన్నారు.

కీలకమైన మార్గాలలో రద్ధీని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని, దారి సుంకం వసూళ్లకు అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు.

***