Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైల్వే ల రంగం లో జ‌ర్మ‌నీ తో ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి


 

రైల్వేల రంగం లో వ్యూహాత్మ‌క ప‌థ‌కాల కు సంబంధించిన స‌హ‌కారం అనే అంశం లో భార‌త‌దేశాని కి మ‌రియు జ‌ర్మ‌నీ కి మ‌ధ్య కుదిరిన‌టువంటి ఒక జాయింట్ డిక్ల‌రేశ‌న్ ఆఫ్ ఇంటెంట్ (జెడిఐ)ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం దృష్టి కి తీసుకు రావ‌డమైంది.  ఈ జెడిఐ పై క్రింద‌టి నెల‌ లో సంత‌కాల‌య్యాయి.
 
లాభాలు:

ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ కి చెందిన ఆర్థిక వ్య‌వ‌హారాలు మ‌రియు శ‌క్తి మంత్రిత్వ శాఖ తో కుదుర్చుకున్న జెడిఐ భార‌తీయ రైల్వేల కు- రైల్వే ల రంగం లో తాజా ప‌రిణామాల ను మ‌రియు జ్ఞానాన్ని ప‌ర‌స్ప‌రం వెల్ల‌డించుకొనేందుకు మ‌రియు త‌త్సంబంధిత సంప్ర‌దింపు ల‌కు- ఒక వేదిక ను స‌మ‌కూర్చ‌నుంది.  నిపుణుల స‌మావేశాలు, చ‌ర్చా స‌భ‌లు, సాంకేతిక బృందాల యాత్ర‌ లు మరియు ఇరు ప‌క్షాల సమ్మ‌తి మేర‌కు కొన్ని ప‌థ‌కాల అమ‌లు కు కూడా ఈ జెడిఐ మార్గాన్ని సుగ‌మం చేస్తుంది.

పూర్వ‌రంగం:

రైల్వేల మంత్రిత్వ శాఖ రైలు రంగం లో సాంకేతిక సంబంధ స‌హ‌కారం అంశం పై విభిన్న విదేశీ ప్ర‌భుత్వాల తో మ‌రియు జాతీయ రైల్వేల తో అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాలు /స‌హ‌కార పూర్వ‌క ఒప్పందాలు/ప‌రిపాల‌న సంబంధ స‌ర్దుబాట్లు/జాయింట్ డిక్ల‌రేశ‌న్స్ ఆఫ్ ఇంటెంట్ ల పై సంతకాలు చేసింది.  గుర్తించిన రంగాల లో స‌హ‌కరించుకోవ‌డం తో పాటు, హైస్పీడ్ రైల్, ఇప్ప‌టికే రాక పోక లు సాగుతున్న మార్గాల లో (రైళ్ళ) వేగాన్ని పెంచ‌డం,  ప్ర‌పంచ శ్రేణి (రైల్వే)స్టేశ‌న్ ల‌ను అభివృద్ధి ప‌ర‌చ‌డం, భారీ లోడ్ ల‌ను మోసుకు పోవ‌డం, రైల్వే సంబంధిత మౌలిక స‌దుపాయాల ఆధునికీక‌ర‌ణ త‌దిత‌ర అంశాలు కూడా ఈ సహకారం లో భాగం గా ఉన్నాయి.

ఈ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాలు /స‌హ‌కార పూర్వ‌క ఒప్పందాలు/ప‌రిపాల‌న సంబంధ స‌ర్దుబాట్లు/జాయింట్ డిక్ల‌రేశ‌న్స్ ఆఫ్ ఇంటెంట్ లు.. సాంకేతిక నిపుణుల బృందాల రాక‌ పోక‌ల కు నివేదిక‌ లు మ‌రియు సాంకేతిక ప‌త్రాలు ఇచ్చి పుచ్చుకోవడాని కి, శిక్ష‌ణ, ఇంకా చ‌ర్చా స‌భ‌లు/కార్య‌శాల‌ ల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర జ్ఞాన ఆదాన ప్ర‌దాన సంబంధిత సంభాష‌ణ‌ల కు మార్గాన్ని సుగ‌మం చేస్తాయి.