పిఎంఇండియా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రధాని శ్రీ అంటోనియో కోస్టా ఇద్దరూ కలిసి లిస్బన్ లోని చంపలిమాద్ ఫౌండేషన్ ను సందర్శించారు.
చంపాలిమాద్ ఫౌండేషన్ అనేది ప్రైవేటు రంగంలో ఏర్పాటైన బయో మెడికల్ పరిశోధనల కేంద్రం. కేన్సర్ వ్యాధి చికిత్సలో ఈ సంస్థ అత్యున్నతమైన సేవలు అందిస్తోంది. కేన్సర్ వ్యాధి పరిశోధనకు విశిష్టమైన సహకారం అందిస్తోంది. ఆరోగ్య భద్రత సాధనకు సమగ్రమైన విధానాన్ని అందిస్తోంది. ప్రకృతితో సామీప్యం కలిగిన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పరిశోధన, నూతన అంశాల ఆవిష్కరణలతో రోజువారీ చికిత్సలను కలగలిపి ప్రగతిని సాధించే విధానం ఇది.
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత భవన నిర్మాణ నిపుణుడు శ్రీ చార్లెస్ కొరియా ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు. దీని తోటలో నుండి చూస్తే నదితో పాటు సముద్రం కనిపిస్తుంది. కావలసినంత సూర్యరశ్మి లభిస్తుంది.
భారతదేశం, పోర్చుగల్ పరస్పర సహకారానికి సంబంధించిన పలు అంశాలను ఈ కేంద్ర ప్రతిబింబిస్తోంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరచుగా ప్రస్తావిస్తున్న అంశం సమగ్రమైన ఆరోగ్య విధానం. దీనికి అనుగుణంగా కేన్సర్ చికిత్స, పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఇక్కడ కేన్సర్ రోగులకు విభిన్నమైన విధానంలో చికిత్స లభిస్తుంది. వీరు ప్రకృతితో బంధం కలిగివుంటారు. అదే సమయంలో వారికి కెమోథెరపి వంటి అత్యున్నతమైన వైద్య చికిత్సలను కూడా అందిస్తారు.
2007లో అంటోనియా చంపాలిమాద్ విజన్ అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డును నేత్ర భద్రత, కంటి చూపులకు సంబంధించిన అంశాల్లో పరిశోధన చేసిన వారికి ఇస్తారు. ఒకటో సంవత్సరంలో ఈ అవార్డును భారతదేశానికి చెందిన అరవింద్ ఐ కేర్ సిస్టమ్ గెలుచుకొంది.
ఈ సంస్థలో 42 దేశాలకు చెందిన 300 మంది పరిశోధకులు ఉంటే వారిలో ముగ్గురు పరిశోధకులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ప్రసాద్ సంస్థతో చంపాలిమాద్ ఫౌండేషన్ అనుబంధం కలిగివుంది. కేన్సర్ చికిత్స కోసం చంపాలిమాద్ ఫౌండేషన్ కు వచ్చే వారిలో అత్యధికులు భారతదేశానికి చెందిన వారే.
ఫౌండేషన్ లో గల పలు సౌకర్యాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. భారతదేశానికి చెందిన పరిశోధకులతో కాసేపు ఆయన సంభాషించారు.