Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్ జర్వేటరీ (ఎల్ ఐ జి ఒ) కి చెందిన శాస్త్రవేత్తలను కలుసుకొన్న ప్రధాన మంత్రి

 

లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్ జర్వేటరీ (ఎల్ ఐ జి ఒ) కి చెందిన శాస్త్రవేత్తలను కలుసుకొన్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం వాషింగ్ టన్ డిసి లో లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్ జర్వేటరీ (ఎల్ ఐ జి ఒ) కి చెందిన శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. ద నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సంచాలకుడు డాక్టర్ ఫ్రాన్స్ కొర్దొవా నాయకత్వంలోని శాస్త్రజ్ఞుల బృందంలో ముగ్గురు భారతీయ శాస్త్రజ్ఞులు కూడా కలసి ఉన్నారు. వారందరూ ఎల్ ఐ జి ఒ ప్రాజెక్టులో పనిచేశారు.

ఎల్ ఐ జి ఒ ప్రాజెక్టు భవితవ్యంలో భారతదేశం ఏ విధంగా అతి కీలకమో ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి డాక్టర్ కొర్దొవా వివరించారు. భారతదేశం, యు ఎస్ ల మధ్య నెలకొన్న శాస్త్ర విజ్ఞాన రంగ సమన్వయానికి ఎల్ ఐ జి ఒ ప్రాజెక్టు ఒక ఘనమైన ఉదాహరణ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం యావత్తు భారతీయ యువ శాస్త్రజ్ఞుల తరానికి ప్రేరణను అందించగలదని ఆయన అన్నారు. భారతీయ విశ్వవిద్యాలయాలను సందర్శించి భారతీయ విద్యార్థులతో సాధ్యమైనంత మేరకు ముఖాముఖి సంభాషించవలసిందని ఎల్ ఐ జి ఒ ప్రాజెక్టులో పాలు పంచుకొన్న భారతీయ శాస్త్రజ్ఞులకు ఆయన సూచించారు.

ఎల్ ఐ జి ఒ ప్రాజెక్టులో పనిచేస్తున్న న్యూఢిల్లీ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసర్చ్ కు చెందిన శాస్త్రవేత్తలతో ప్రధాన మంత్రి సమావేశమైన రెండు రోజులకే, వాషింగ్ టన్ డిసి లో ఎల్ ఐ జి ఒ శాస్త్రజ్ఞులను కూడా ఆయన కలుసుకోవడం గమనార్హం.

భారతదేశంలో లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్ జర్వేటరీ (ఎల్ ఐ జి ఒ) ఏర్పాటు పై కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పందం ఆదాన ప్రదాన కార్యక్రమంలోనూ ప్రధాన మంత్రి పాల్గొన్నారు. ఈ ఒప్పంద పత్రంపై యు ఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సంచాలకుడు డాక్టర్ ఫ్రాన్స్ కొర్దొవా, భారతదేశ అణు శక్తి విభాగం కార్యదర్శి డాక్టర్ శేఖర్ బసు లు అంతక్రితం సంతకాలు చేశారు.