పిఎంఇండియా
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నిన్న లేహ్‌లో ప్రారంభమైన ‘తథాగత పవిత్ర అవశేషాల ప్రదర్శన’పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అమితానందాన్ని వ్యక్తం చేశారు.
కపిలవస్తులోని పిప్రహ్వా స్థూపానికి సంబంధించి 19వ శతాబ్దపు చివరి కాలంలో జరిపిన తవ్వకాల్లో లభించిన ఈ పవిత్ర అవశేషాలు… గౌతమ బుద్ధుడి శాశ్వత బోధనలకు ప్రతీకలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రదర్శన మే 14 వరకు కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఇది జంస్కార్‌కు కూడా చేరుకుంటుందని ఆయన తెలిపారు. లడఖ్ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి బుద్ధుడికి నివాళులర్పించేందుకు ఇదొక గొప్ప అవకాశమని… దీనివల్ల లడఖ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకం కూడా వృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నిన్న బుద్ధ పూర్ణిమ సందర్భంగా లేహ్‌లో ‘తథాగత పవిత్ర అవశేషాల ప్రదర్శన’ ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం. కపిలవస్తులోని పిప్రహ్వా స్థూపానికి చెందిన ఈ పవిత్ర అవశేషాలు 19వ శతాబ్దపు చివరలో జరిగిన తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇవి బుద్ధ భగవానుడి గొప్ప బోధనలకు సజీవ సాక్ష్యాలు.
ఈ ప్రదర్శన మే 14 వరకు కొనసాగుతుంది. త్వరలోనే ఇది జంస్కార్‌కు కూడా వెళ్తుంది. లడఖ్ ప్రజలందరికీ ఇదొక అమూల్యమైన అవకాశాన్ని కల్పిస్తుంది. లడఖ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని కూడా మరింత ప్రోత్సహిస్తుంది’’.
***
It is a matter of immense delight that yesterday, on the occasion of Buddha Purnima, the ‘Sacred Exposition of the Holy Relics of the Tathagata’ was inaugurated in Leh. These revered relics are linked to the Piprahwa Stupa in Kapilavastu and were excavated in the closing years of… pic.twitter.com/tYsK5GKQ45
— Narendra Modi (@narendramodi) May 2, 2026