Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు


గౌరవనీయ అధ్యక్షా!

ఈ రోజు ఉదయాన్నే ఓ కీలక బిల్లుపై చర్చ మొదలైందినా సహ సభ్యులలో అనేకమంది ప్రధానాంశాలను ప్రస్తావించిఎన్నో వాస్తవాలను సభ ముందుంచారనడంలో సందేహం లేదు.

గౌరవనీయ అధ్యక్షా!

ఒక దేశ సుదీర్ఘ ప్రయాణంలో అనేక కీలక ఘట్టాలు అంతర్భాగంగా ఉంటాయితదనుగుణంగా సమాజం ధోరణినాయకత్వ సామర్థ్యం అనేక అవకాశాలను అందిపుచ్చుకునిబలమైన జాతీయ వారసత్వాన్ని ప్రోదిచేసిందిభారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రస్తుత తరుణం కూడా అటువంటి చారిత్రక ఘట్టమేనని నా విశ్వాసంనేటి ఈ ఆలోచన సైద్ధాంతికంగా 25 నుంచి 30 ఏళ్ల కిందటే సాకారం కావాల్సి ఉందిఆ అవసరం ఏర్పడినప్పుడే అది అమలులోకి వచ్చి ఉండాల్సిందిఅవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మన ఆలోచనలకు మెరుగులు దిద్దుకుని ఉండవచ్చు… అదే ప్రజాస్వామ్య శోభప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారత్‌ ప్రగతి ప్రస్థానానికి వేల ఏళ్ల చరిత్ర ఉందిఈ నేపథ్యంలో ఓ సరికొత్తసంస్కరణాత్మక శోభను జోడించే దిశగా సభ్యులందరికీ ఈ సభ నేడొక శుభప్రద అవకాశం ఇచ్చిందినేను మొదట్లోనే చెప్పినట్టు– దేశ ప్రగతి దిశగా విధాన రూపకల్పనలో జనాభాలోని సగభాగాన్ని చురుకైన భాగస్వాములను చేయడం మనందరికీ దక్కిన ఒక అరుదైన అదృష్టంఇటువంటి సదవకాశాన్ని జారవిడచుకోరాదని గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరికీ ఈ సందర్భంగా నా విన్నపంఈ మేరకు భారతీయులమైన మనమంతా సమష్టిగా దేశానికి ఒక దశదిశను నిర్దేశిద్దాందేశ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంలో భాగంగా పరిపాలన వ్యవస్థలో ప్రగాఢ అవగాహన నింపేందుకు మనం సమష్టిగా చేస్తున్న పరిణామాత్మక కృషి ఎంతో  ప్రత్యేకమైనదిఈ నేపథ్యంలో మనమిప్పుడు ఓ కీలక మలుపులో మేధా మథనం చేస్తున్నాందీన్నుంచి ఆవిర్భవించే అమృతమే దేశ రాజకీయాలకు రూపుదిద్దడమే కాదు… ప్రగతి దశనుదిశను కూడా నిర్దేశిస్తుందిఅంటే– మనమిప్పుడు ఓ కీలక మలుపులో ఉన్నాం.

గౌరవనీయ అధ్యక్షా!

ప్రస్తుత 21వ శతాబ్దంలో భారత్‌ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటోందియావద్దేశం నేడు విస్తృత ప్రపంచ ఆమోదం పొందుతుండటంఇది వికసిత భారత్‌ సంకల్పంతో ముడిపడినది కావడం మనకెంతో గర్వకారణంఅభివృద్ధి చెందిన భారత్‌ అంటే– నా దృక్కోణంలో రైల్వేలురహదారులుఅత్యున్నత మౌలిక సదుపాయాలకు లేదా ఆర్థిక ప్రగతిని సూచించే గణాంకాలకు పరిమితం కాదున్నారువికసిత భారత్‌పై మన దృక్పథం అంత సంకుచితమైనది కాదుఅది ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్’ మంత్రాన్ని విధాన రూపకల్పనలో అర్థవంతంగా ఏకీకృతం చేయడంలో ఇమిడి ఉందిమన జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలను విధాన రూపకల్పనలో భాగస్వాములను చేయడం నేటి  తక్షణావసరంఇప్పటికే మనమెంతో ఆలస్యం చేశాం… ఇందుకు కారకులు ఎవరైనప్పటికీమనం ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పదుమనమంతా వ్యక్తిగతంగా కలుసుకున్నపుడు ఈ వాస్తవంతో ఏకీభవిస్తుంటాంకానీఅందరం ఒక వేదికపై కలుసుకున్నపుడు పరిస్థితి మారిపోతోందిఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అఖిలపక్ష సమావేశం సందర్భంగా మనమంతా కలిశాంఆ సందర్భంలో ఒక్క పార్టీ మినహా మిగిలినవన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయిఆ తర్వాత జరిగిందేమిటన్న దానితో నిమిత్తం లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ తనదైన మార్గం అనుసరించాయిఅయితేరాజకీయ కోణంలో మాత్రమే ఆలోచించేవారికి ఓ మిత్రుడుగా నేనొక మాట చెప్పదలిచానుఈ సలహా వారికెంతో ఉపయుక్తం కూడా కాగలదుచట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌పై చర్చ మొదలయ్యాక ప్రతిసారి దేశంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూ వచ్చిందిఫలితంగా మహిళలకు ఈ హక్కును వ్యతిరేకించిన పార్టీలను వారెన్నడూ క్షమించలేదు సరికదా.. కఠినంగా వ్యవహరించారుకానీ, 2024 నాటి ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి పరిణామమేదీ సంభవించ లేదుఎందుకంటారు?.. ఆ ఎన్నికలకు ముందు దీనికి ఆమోదముద్ర వేయడంలో అందరూ ఏకతాటిపైకి వచ్చారుకాబట్టేఏ ఒక్కరో రాజకీయంగా లాభపడటం లేదా కోల్పోవడం వంటివేవీ సంభవించలేదుఆ మేరకు 2024 ఎన్నికల పోరాటం ఇతరత్రా అంశాల ప్రాతిపదికగా సాగిందివారిలో కొందరిక్కడున్నార… కొందరు లేరుఇప్పుడు కూడా నేనిదే చెబుతున్నాను… మనమంతా ఏకమై ముందడుగు వేస్తేఇది ఏదో ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేది కాదనడానికి చరిత్రే సాక్ష్యమిస్తుందిఅది దేశ ప్రజాస్వామ్యానికిసామూహిక నిర్ణయాత్మక శక్తికి సానుకూల పరిణామం కాగలదుఅంతేకాదు… ఆ ఉజ్వల చరిత్రకు మనమంతా అర్హులమవుతాంఅంటే– అధికార పార్టీకి లేదా మోదీకి మాత్రమే పరిమిత కాదు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటుందికాబట్టినేటి ఈ ప్రక్రియను రాజకీయం చేయాలని చూస్తేగడచిన మూడు దశాబ్దాలను ఒక్కసారి వెనక్కు తిరిగి చూడాలని కోరుతున్నానుఇందులో వారికీ ఎంతో ప్రయోజనం ఉంటుందిఆ మార్గమేమిటో కూడా నేనిప్పుడు చెబుతున్నాను… అదేమిటంటే– మీరు కూడా చారిత్రక నష్టాల నుంచి కోలుకుంటారుకాబట్టిదీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

గౌరవనీయ అధ్యక్షా!

ప్రభుత్వాధినేతగా అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు నేనొక సంస్థలో కార్యకర్తగా ఉన్నానుఆ సమయంలో మహిళలకు పంచాయతీ స్థాయి రిజర్వేషన్లపై రాజకీయ వేదికలలో చర్చలను గమనించానుఅటుపైన వారికి ఆ హక్కు సరళంగా దక్కడం చూశానుతమ పదవులు లేదా అధికారం కోల్పోతామనే భయం లేకపోవడం వల్ల పంచాయతీలలో వారికి కోటాపై నాయకులు సుముఖత ప్రకటించడమే ఇందుకు కారణంఅయితేపార్లమెంటు స్థాయిలో ఇది అంత సులభం కాబోదన్న వాదనలు ఈ ప్రాంగణంలో వినిపిస్తూండేవిఎందుకంటే– తామేదో కోల్పోతామనే భయం వారిలో ఉండేదిఇలాంటి ధోరణి ఫలితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్‌ 50 శాతానికి చేరింది.

మిత్రులారారాజకీయంగామరొక అంశాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నాను

ఓ పాతిక 30 ఏళ్ల కిందటిలా కాకుండా మహిళల హక్కులపై వ్యతిరేకత రాజకీయ ఉపరితలం దిగువన నేడు లోతుగా ప్రతిధ్వనిస్తోందికాబట్టిఇవాళ కూడా అదేవిధంగా ఆలోచించవద్దని నా సూచనఆనాడు పంచాయతీ ఎన్నికలలో గెలిచిన మహిలల్లో నేడొక ప్రగాఢ రాజకీయ చైతన్యం పెల్లుబుకుతోందివారంతా నేడు క్షేత్రస్థాయి అభిప్రాయ రూపకర్తలుగా పరిణామం చెందారుమూడు దశాబ్దాల కిందట వారు నిశ్శబ్దంలో ఉండిఅంతా అర్థం చేసుకోగలిగినా అభిప్రాయాలను బయటపెట్టేవారు కాదుఅయితేనేడు ఈ అనుభవజ్ఞులైన లక్షలాది సోదరీమణులు తాము ఏ స్థానంలో ఉన్నా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారువారి ఆవేదనను గమనించి ఆందోళన చెందారుఇవాళ వారేమంటారంటే– మీరు మమ్మల్ని ఇళ్లలో ఊడ్చేకడిగే పనుల్లోకి నెట్టారుకానీ,  ఇప్పుడు మమ్మల్ని నిర్ణయాత్మక ప్రక్రియలో భాగం చేస్తున్నారునిర్ణయాలు అసెంబ్లీలలోపార్లమెంటులో తీసుకుంటారుఅందువల్లరాజకీయ జీవన ప్రగతి అభిలషించే ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఎవరైనా సరేఏ పార్టీ గురించీ మాట్లాడకుండావిజయవంతంగా ముందుకెళ్లాలని భావిస్తేగత 25-30 ఏళ్లలో లక్షలాది సోదరీమణులు క్షేత్రస్థాయిలో నాయకులుగా ఎదిగారనే వాస్తవాన్ని అంగీకరించాల్సిందేఇకపై మీ నిర్ణయాలను ఇక్కడ మాత్రమే కాకుండా అక్కడ కూడా 33 శాతంతో ప్రభావితం చేస్తారు.

అందువల్లఈ రోజు దీన్ని వ్యతిరేకించేవారు చాలాకాలం పాటు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదుకాబట్టే– క్షేత్రస్థాయి నుంచి పుట్టుకొచ్చిన మహిళల రాజకీయ నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడంలోనూ రాజకీయ వివేచన ప్రస్ఫుటమవుతోంది.  ములాయం సింగ్ గారి కాలం నుంచి ఈ అంశం ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబం దాన్ని కొనసాగిస్తోందని నేను విన్నానుదేశంలోని మహిళలను నమ్మండి.. వారి వివేకాన్ని విశ్వసించండి… 33 శాతం సోదరీమణులను ఇక్కడికి రానివ్వండి… ఎవరికివ్వాలోఎవరికి ఇవ్వకూడదో.. ఏ వర్గానికి ఇవ్వాలోఏ వర్గానికి ఇవ్వకూడదో కూడా వారినే నిర్ణయించుకోనివ్వండిఇకపై వారే నిర్ణయాలు తీసుకుంటారువారి సామర్థ్యాన్ని మనమెందుకు సందేహించాలివారిని ఒక్కసారి… ఒక్కసారి రానివ్వండిఅప్పుడు… అంటే– 2034లో… ధర్మేంద్ర గారూనన్ను పరిచయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలుఇది నిజం.. నేను అత్యంత వెనుకబడిన సమాజం నుంచి వచ్చానుధర్మేంద్ర జీ.. మీకు చాలా కృతజ్ఞతలు.. అఖిలేష్ జీ నా మిత్రుడు కాబట్టికొన్నిసార్లు ఆయన నాకు సాయం చేస్తారునేను అత్యంత వెనుకబడిన సమాజం నుంచి వచ్చానన్నది నిజమే కానీఅందరితో మమేకం కావడం నా బాధ్యతరాజ్యాంగం కూడా నాకు చూపిన మార్గమిదేరాజ్యాంగమే నాకు సర్వోన్నతం.. ఇంత సామాన్యుడైనఅత్యంత వెనుకబడిన సమాజానికి చెందిన నాలాంటి వ్యక్తికి దేశం ఎంతో గొప్ప బాధ్యతను అప్పగించడం రాజ్యాంగ బలం వల్లనే సాధ్యమైందిఆ మేరకు ఈ రోజు నేనిక్కడ ఉండటానికి కారణమైన దేశ ప్రజలకురాజ్యాంగ నిర్మాతలకు రుణపడి ఉన్నాను.

అయితే.. గౌరవనీయ అధ్యక్షా!

ఈనాడు జీవితంలోని ప్రతి రంగంలో దేశ గౌరవాన్ని నిలబెట్టడంలోపతాకాన్ని సగర్వంగా ఎగురవేయడంలో మహిళలు ఏమాత్రం వెనుకబడలేదుఆ మేరకు మన తల్లులుసోదరీమణులు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారనిమన కుమార్తెలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని మనం గర్వించవచ్చుఇంతటి గొప్ప శక్తిగల వారి భాగస్వామ్యాన్ని అడ్డుకోవడానికి మనమెందుకు ఇంత శక్తిని వెచ్చిస్తున్నాంవారి చేరిక మన శక్తిసామర్థ్యాలను మరింత ఇనుమడింపజేస్తుందిఅందువల్లఈ విషయాన్ని రాజకీయ త్రాసులో తూకం వేయవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నానుఇది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం.

గౌరవనీయ అధ్యక్షా!

అందరం కలిసి కూర్చునిఒకే దిశలో ఆలోచించి వికసిత భారత్‌ సాకారంలో మన నారీశక్తి భాగస్వామ్యాన్ని ఏకాభిప్రాయంతో బలపరచాలని నిర్ణయించుకోవడం మనకు దక్కిన అవకాశంనేను ముందే చెప్పినట్లుగా ఈనాడు యావద్దేశం… ముఖ్యంగా మహిళా శక్తిమన నిర్ణయాలను గమనిస్తుందికానీనిర్ణయాలకు మించి మన సంకల్పాన్నే వారు చూస్తారుకాబట్టిమన సంకల్పంలో లోపం కనిపిస్తేదేశంలోని మహిళా శక్తి మనల్ని ఎప్పటికీ క్షమించదు.

గౌరవనీయ అధ్యక్షా!

ఈ కొత్త సభలో 2023లోనే మనమీ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాందేశవ్యాప్తంగా ఒక ఆహ్లాదకర  వాతావరణం నెలకొందిదీనికి ఎలాంటి రాజకీయ రంగూ పులమలేదు కాబట్టిఇదెన్నడూ రాజకీయ సమస్యగా మారలేదుఅదొక మంచి పరిస్థితి… ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే– దీన్ని ఇంకా ఎంతకాలం ఆలస్యం చేయాలిమనం జనగణన ఎప్పుడు నిర్వహించామో జనాభా సమస్యలను లేవనెత్తే వారికి తెలియదాఆ తర్వాత కోవిడ్ కారణంగా ఎలాంటి ఇబ్బందులుఅవరోధాలు తలెత్తాయో సవివరంగా తన ప్రసంగంలో ప్రస్తావించాలని అమిత్ భాయ్‌ని నేను కోరుతున్నానుఈ అంశాలన్నీ నేడు మన ముందున్నాయికానీమనం 2023లో చర్చించినప్పుడుదీన్ని త్వరగా సాకారం చేయాలన్న విస్తృత ఏకాభిప్రాయానికి వచ్చాం… ప్రతి ఒక్కరూ అదే కోరారుఅయితేసమయం తక్కువగా ఉండటం వల్ల 2024లో అది సాధ్యం కాలేదుఇప్పుడిక 2029లో మనకో అవకాశం ఉంది.. ఇప్పుడు కాకపోతే అప్పుడెలాంటి పరిస్థితి తలెత్తగలదో మనం ఊహించుకోవచ్చుఅప్పుడు మనం నిజంగా ఈ ప్రయత్నం చేయగలమని దేశంలోని తల్లులనుసోదరీమణులను ఒప్పించలేంఅందువల్లఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకపోవడమే తక్షణావసరంఈలోగా రాజకీయ పార్టీల సభ్యులురాజ్యాంగ నిపుణులుమహిళా కార్యకర్తలు సహా  అనేకమందితో చర్చలు సాగాయికొందరు స్వచ్ఛందంగా సూచనలిచ్చారుఅన్ని పార్టీలతోసంస్థాగతంగాఅనధికారికంగానూ నిరంతరం చర్చలు సాగాయిఇంత లోతైన మథనం తర్వాత మన తల్లులుసోదరీమణుల శక్తిసామర్థ్యాలను వినియోగించుకునే మార్గాన్ని మనం అన్వేషించాలి.

గౌరవనీయ అధ్యక్షా!

నేను ఒక విషయం కచ్చితంగా చెప్పాలనుకుంటున్నానుదేశాన్ని ముక్కలుగా భావించే హక్కును రాజ్యాంగం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికీ ఇవ్వలేదుమనం తీసుకున్న ప్రమాణం… దేశాన్ని ఒకటిగా భావించాలని నిర్దేశిస్తుందిఅది కాశ్మీర్ అయినాకన్యాకుమారి అయినామనం దేశాన్ని వేర్వేరు భాగాలుగా ఆలోచించలేంవిభజించి నిర్ణయాలూ తీసుకోలేంకేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే ఏమాత్రం నిజం లేని నిరాధార ఆరోపణల గురించి… ఈ సభలోని ఈ పవిత్ర స్థానం నుంచి నేను పూర్తి బాధ్యతతో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానుఅది దక్షిణంఉత్తరంతూర్పుపశ్చిమ ప్రాంతాలైనా… చిన్న రాష్ట్రాలైనా… పెద్ద రాష్ట్రాలైనా… ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరిపైనా వివక్ష చూపదనిఎవరికీ అన్యాయం చేయదని నేను బాధ్యతతో చెబుతున్నానుమునుపటి ప్రభుత్వాల హయాంలో ఏ డీలిమిటేషన్లు జరిగినాఅప్పటి నుంచి ఏ నిష్పత్తులను అనుసరించినాఆ నిష్పత్తుల్లో ఎటువంటి మార్పూ ఉండదుఏదైనా పెరుగుదల ఉన్నా అది అదే నిష్పత్తిలో ఉంటుందిఇక్కడ హామీ‘ అనే పదం అవసరమైతేనేను హామీ అనే పదాన్నే ఉపయోగిస్తానుమీకు వాగ్దానం‘ అనే పదం కావాలంటేనేను వాగ్దానం అనే పదాన్నే ఉపయోగిస్తానుతమిళంలో మంచి పదం ఏదైనా ఉంటేదాన్నీ వాడటానికీ నేను సిద్ధంగా ఉన్నానుఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడుమనం పదాలతో ఆడుకోవాల్సిన అవసరం ఉండదు.

గౌరవనీయ అధ్యక్షా!

సభలోని సహచరులందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే… మనం భ్రమల్లోఅహంకారంతో ఉండిపోకూడదునేను ‘మనం’ అనే పదాన్ని వాడుతున్నాను. ‘నేను’, ‘మీరు’ అని మాట్లాడటం లేదుదేశంలోని మహిళా శక్తికి మనం ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఉండిపోకూడదుఅది వారి హక్కుదాన్ని మనం ఎన్నో దశాబ్దాలుగా అడ్డుకున్నాంమనం చేసిన తప్పును సరిద్దిదుకోవడం ద్వారా ఈ రోజు ఆ పాపం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే అవకాశం లభించిందిదీనిని అడ్డుకోవడానికి ప్రతిసారీ ఎలా కుట్రలు పన్నారోఎలాంటి కుటిల చాకచక్యాన్ని ప్రదర్శించారో మనందరికీ తెలుసుదీనికి ఎప్పుడూ అనుకూలమేనని మనం చెప్పాం… కానీ దీనిని అడ్డుకోవడానికి ప్రతిసారీ ఏదో ఒక సాంకేతిక సాకు చూపేవారుప్రతిసారీ ఇలాంటి విషయాలనే ముందుకు తెచ్చారుమహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకించే ధైర్యం ఇప్పుడు ఎవరికీ లేదుఆ కాలం గడిచిపోయిందిమీరు అలా చేయలేరుఆ మాట చెప్పే ధైర్యం మీకు లేదుఇది చేయండిఅది చేయండిఇది జోడించండి వంటి సాంకేతిక సాకులతో ఇప్పుడు మీరు దేశంలోని మహిళలకు ఈ విషయాన్ని వివరించలేరుసభలోని సంఖ్యాబలాలను కాలమే నిర్ణయిస్తుందిఇప్పుడు రకరకాల సాకులుసాంకేతిక సమస్యలను చూపుతూ మనం దీనిని మూడు దశాబ్దాలుగా అడ్డుకున్నామన్నది మాత్రం నిశ్చయంమీరు కోరుకున్నదంతా సాధించారుఇక దానిని వదిలేయండిదానిని అడ్డుకోవడానికి మూడు దశాబ్దాలు సరిపోవామూడు దశాబ్దాలుగా మీరు దానిని ఆపారుఅయినా ఏమీ సాధించలేకపోయారుకాబట్టి ఇప్పుడైనా చేయండి.

గౌరవనీయ అధ్యక్షా!

ఇక్కడ కొంత మంది ఇలా అనుకుంటున్నారు.

గౌరవనీయ అధ్యక్షా!

దీని వెనక ఎక్కడో మోదీ రాజకీయ స్వార్థం దాగి ఉందని ఇక్కడ కొంతమందికి అనిపిస్తోందివాళ్ళని మాట్లాడనివ్వండిపాపంఆ మనిషి నోరు అక్కడ మూసుకుపోతుందిబెంగాల్‌లో ఎవరూ అతన్ని మాట్లాడనివ్వరు కదా.

గౌరవనీయ అధ్యక్షా!

చూడండీ… దీనిని వ్యతిరేకిస్తేసహజంగానే నాకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందికానీ మనం కలిసి ముందుకు సాగితేఅప్పుడు ప్రత్యేకించి ఎవరికీ లాభం ఉండదుఇది రాసుకోండిఎవరికీ లాభం ఉండదు… ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుందిఎవరికీ ప్రయోజనం లభించదుమాకు గుర్తింపు అక్కర్లేదుఇది ఆమోదం పొందిన వెంటనే… రేపు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రకటన ఇవ్వడానికిమీ అందరి ఫోటోలను ప్రచురించడానికి నేను సిద్ధంగా ఉన్నానుఆ గుర్తింపు మీరే తీసుకోండిమీకు గుర్తింపు గురించి చింత ఉంటేతీసుకోండిమీరు ఎవరి ఫోటోను ప్రచురించాలనుకున్నామేం దానిని ప్రభుత్వ ఖర్చుతో ప్రచురిస్తాంనేను ముందు నుంచీ పూర్తి గుర్తింపును మీకే ఇస్తున్నాను.

గౌరవనీయ అధ్యక్షా!

మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యాపరమైన అంశం గానీప్రజాస్వామ్య ఏర్పాట్లలో ఒక పరిమిత మెరుగుదల గానీ కాదుఈ నిర్ణయం ప్రజాస్వామ్య మాతగా భారత్ నిబద్ధతఇది ఒక సాంస్కృతిక నిబద్ధతఈ నిబద్ధత కారణంగానే పంచాయతీల్లో ఈ ఏర్పాటు జరిగిందిఇప్పుడు 20కి పైగా రాష్ట్రాల్లో ఇది 50 శాతానికి చేరుకుందిమనం దీనిని అనుభవపూర్వకంగా చూశాంచాలా కాలం పాటుప్రజలు నాకు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశాన్నిచ్చారుఆ కాలంలో నేను క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని చూశానునా అనుభవం ప్రకారంసమస్యలను సున్నితత్వంతో పరిష్కరించడంలో వారి నిబద్ధత చాలా ప్రభావవంతంగా ఉందిఅది అభివృద్ధి ప్రయాణానికి ఊపునిచ్చిందిఆ అనుభవం ఆధారంగా నేను చెబుతున్నాను… ఈ సభలో వారి గొంతు ఒక కొత్త బలంగా మారుతుందిఒక కొత్త ఆలోచనను జోడిస్తుందిదేశ దిశకు సున్నితత్వం చేకూరుతుందివాస్తవాలువాదనలతో కలిసినప్పుడు అనుభవం బలం అనేక రెట్లు పెరుగుతుందిసభ సుసంపన్నమవుతుంది.

గౌరవనీయ అధ్యక్షా!

మన దేశంలో అనుభవజ్ఞులైన మహిళా శక్తికి కొరత లేదుసమర్థులైన మహిళలకు ఏమాత్రం లోటు లేదుమనం వారిని విశ్వసిద్దాంవారు తమ వంతు కృషి చేస్తారుఅత్యంత అద్భుతంగా సేవలందిస్తారునేటికీఇక్కడ మన సోదరీమణులకు ఎప్పుడు అవకాశం లభించినావారు తమ సామర్థ్యాన్ని చక్కగా చాటుకున్నారుఈ సభకు ఎంతో వన్నె తెచ్చారు.

గౌరవనీయ అధ్యక్షా!

దేశవ్యాప్తంగా ఈ రోజు 650కి పైగా జిల్లా పంచాయతీలు ఉన్నాయివీటిలో దాదాపు 275 పంచాయతీలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారుకేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల కంటే వీరికే అధిక బాధ్యతలునిధులునిర్వహణ అధికారాలు ఉన్నాయివీరు అత్యంత సమర్థవంతంగానూ పనిచేస్తున్నారుసుమారు 6,700 మండల పంచాయతీల్లో 2,700కి పైగా పంచాయతీలకు మహిళలే సారథ్యం వహిస్తున్నారునేడు 900కి పైగా నగరాల్లోని పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లుగా గానీస్థాయీ సంఘాల అధ్యక్షులుగా గానీ మన సోదరీమణులే అధికారాన్ని నిర్వహిస్తున్నారుఈ రోజు దేశం సాధిస్తున్న ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో గణనీయమైనదని నేను దృఢంగా విశ్వసిస్తున్నానుఆ సేవను గుర్తించిసముచితంగా గౌరవించడానికి ఇదే సరైన సందర్భంఈ అనుభవం సభకు తోడైనప్పుడుసభ బలం అనేక రెట్లు వృద్ధి చెందుతుంది.

గౌరవనీయ అధ్యక్షా!

సుదీర్ఘ నిరీక్షణ మనందరిలో ఒక సందేహాన్ని సృష్టించిందిఈ పరిస్థితిని మనమే సృష్టించుకున్నాంగతంలో ఉన్న పరిమితులుఇబ్బందుల నుంచి బయటపడి… ధైర్యంగా ముందుకు సాగి… దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఇది ఒక చక్కటి అవకాశంఈ రోజు మనమంతా కలిసి నిర్ణయం తీసుకునిఏకగ్రీవంగా ముందుకు సాగాలని నేను గట్టిగా కోరుతున్నానుఅలా ఏకగ్రీవంగా ముందుకు సాగినప్పుడుఅధికార యంత్రాంగంపైనా ఒత్తిడి పెరుగుతుందిఇందులో ప్రతి ఒక్కరికీ హక్కు ఉందనిప్రతి ఒక్కరు చెప్పే వాటిని పరిగణనలోకి తీసుకోవాలనీఇందులో ఎలాంటి హానీ లేదని వారు భావిస్తారుఐకమత్య బలం మనకు ఎన్నో మంచి ఫలితాలనిస్తుంది.

గౌరవనీయ అధ్యక్షా!

ఎక్కువ సమయం తీసుకోకుండానేను ఒక్క విషయం మాత్రం చెబుతానుదీనిని రాజకీయ త్రాసులో తూచవద్దుమనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే… మనం ఇక్కడికి తీసుకువస్తున్న వారిపైనే ఈ గొప్ప దేశ బాధ్యతలో సగ భాగం ఆధారపడి ఉంటుందిఇక్కడికి వచ్చే హక్కు వారికీ ఉందిమనం వారిని అడ్డుకోకూడదుఇక సంఖ్యా బలాల విషయానికి వస్తే… గతంలో ఒక చర్చ జరిగిందివారి సంఖ్యను తగ్గించకూడదు… బదులుగా మరింత పెంచాలనిఅప్పుడే ప్రక్రియ వేగవంతమవుతుందనేది ఆ చర్చల సారంఇప్పుడు ఆ అంశమే మన ముందుకు వచ్చిందిగతంలో ఉన్న 33 శాతం సంఖ్యను పెంచాలనే చర్చతద్వారా ఎవరికీ తమ హక్కులు హరించుకుపోయాయని అనిపించకుండా ఉంటుందిదీనివల్ల ఒక కొత్త బలం సమకూరుతుందిఅదనపు శక్తీ చేకూరుతుందిసభ కూర్పులోనూ తగిన సర్దుబాట్లు జరుగుతాయిమేం ఇప్పటికే ఆ దిశగా ఆలోచించిఅందుకు అవసరమైన వేదికను సిద్ధంగా ఉంచాం.

గౌరవనీయ అధ్యక్షా!

కాస్త సరదాగా చెప్పాలంటే… ప్రతి ఒక్కరికీ వారి సొంత రాజకీయ కారణాలు ఉంటాయన్నది వాస్తవంఓటమి భయం ఉండటం మాత్రం కొంత ఆశ్చర్యం కలిగిస్తుందికానీ మన సంప్రదాయం ప్రకారంఏదైనా మంచి పని జరిగినప్పుడు దిష్టి‘ తగలకుండా ఉండేందుకు మనం ఒక నల్ల చుక్క పెడతాంఅలా ఈ మంచి పనికీ నల్లని దిష్టి చుక్క పెట్టినందుకు మీకు నా ధన్యవాదాలు!

చాలా ధన్యవాదాలు!

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

 

****