Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని సమీక్షించిన ప్రధానమంత్రి


లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. “ఇది పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సంబంధిత మ్యూజియం అవుతుంది. పర్యాటకం, పరిశోధన, విద్య, నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తూనే భారత ప్రాచీన సముద్ర సంప్రదాయాలను ఇది ప్రదర్శిస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని సమీక్షించాను. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సంబంధిత మ్యూజియం అవుతుంది. పర్యాటకం, పరిశోధన, విద్య, నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తూనే భారత ప్రాచీన సముద్ర సంప్రదాయాలను ఇది ప్రదర్శిస్తుంది.”

***