Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ల‌క్నోలో ఈ-రిక్షాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాన‌ మంత్రి ; రిక్షా నడిపే వారితో, వారి కుటుంబాల‌తో మాటామంతీ

ల‌క్నోలో ఈ-రిక్షాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాన‌ మంత్రి ; రిక్షా నడిపే వారితో, వారి కుటుంబాల‌తో మాటామంతీ


ఈ- రిక్షాల పంపిణీ కోసం ల‌క్నోలో ఆదివారం భార‌తీయ మైక్రో క్రెడిట్ సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ర‌చ్చ‌బండ‌ లాంటి స‌మావేశంలో రిక్షా నడిపే వారు, వారి కుటుంబాల‌తో సంభాషించారు. అద‌న‌పు ఆదాయంలో కొంత సొమ్మును పొదుపు చేయటం, పిల్ల‌ల చ‌దువుల గురించిన అంశాలు వారి మధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ ప్ర‌పంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక‌ రంగం భార‌తదేశమని ప్ర‌పంచ‌ దేశాల‌న్నీ గుర్తించాయి. అదీ… ప్ర‌పంచ వ్యాప్తంగా మాంద్యం ప‌రిస్థితులున్నా భార‌త్ మాత్రం పురోభివృద్ధి దిశ‌గా క‌దులుతోంది. అందుకే మా ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమం, యువ‌త‌కు ఉపాధి కల్పనను ప్రాథ‌మిక లక్ష్యంగా పెట్టుకుంది. యువ‌త ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిలా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారుగా ఎదగాలి. ఇందుకోసం మా ప్ర‌భుత్వం కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ‘ప్ర‌ధాన‌ మంత్రి ముద్ర యోజ‌న’ను ఆరంభించి ఇంకా ఒక ఏడాది కూడా పూర్తి కాక ముందే 2 కోట్ల మంది ప్ర‌జ‌లు లాభ‌ప‌డ్డారు. ఇవాళ మీకు ఈ- రిక్షాలు వ‌స్తున్నాయంటే.. కాలుతో తొక్కే రిక్షా నుంచి ఈ రిక్షాకు మార‌టం మాత్ర‌మే కాదు, మీ జీవితాల్లోనే పెను మార్పు వ‌స్తోంద‌ని అర్థం అని అన్నారు.

ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయ‌టానికి ఉద్దేశించిన రూపే కార్డుల‌ను, సాంఘిక భ‌ద్ర‌త ప‌థ‌కాల‌ను ప్ర‌ధాని లాంఛ‌నంగా అంద‌జేశారు. 2100 ఈ- రిక్షాల ర్యాలీని జెండా ఊపి ఆయ‌న ఆరంభించారు.