పిఎంఇండియా
లఖ్ నవూ లోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) కి చెందిన 1899 చదరపు మీటర్ల మేర భూమిని లఖ్ నవూ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎల్ఎమ్ఆర్‌సి)కి శాశ్వతంగా బదలాయించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎల్ఎమ్ఆర్‌సి కార్యకలాపాలలో భాగమైన ట్రాన్స్‌పోర్టు నగర్ మెట్రో స్టేషన్ కోసం ప్రవేశం/నిష్క్రమణ సంబంధిత నిర్మాణానికి గాను ఈ భూమి ఆవశ్యకమైంది. ఇది ప్రజా రవాణాకు ఉద్దేశించినటువంటి ప్రజోపయోగ పథకం కావడంతో, సాధారణ ప్రజానీకానికి మరింత మెరుగైన అనుసంధానాన్ని, సౌకర్యాన్ని అందిచగలుగుతుంది.
***