Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపిన కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపిన కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపిన కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపిన కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


 

ముందుగా పుల్‌వామా ఉగ్ర‌వాద దాడి లో అమ‌రులైన సైనికుల కు నేను నా శ్ర‌ద్ధాంజ‌లి ని ఘటిస్తున్నాను.  వారు దేశాని కి సేవలను అందిస్తూ వారి యొక్క ప్రాణాల ను అర్పించారు.  ఈ దుఃఖ ఘ‌డియ లో  వారి యొక్క కుటుంబాల కు నా తో సహా భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి పక్షాన ప్ర‌గాఢమైనటువంటి సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాను.

ఈ దాడి కార‌ణం గా ప్ర‌జ‌ల కు క‌లిగిన వేద‌న ను  మ‌రియు వారి ఆక్రోశాన్ని నేను స్ప‌ష్టం గా గ్ర‌హించగ‌లుగుతున్నాను.  ఈ స‌మ‌యం లో ప్ర‌జ‌ల అపేక్ష మ‌రియు ఏదైనా చ‌ర్య ను తీసుకోవాల‌న్న భావ‌న అనేవి అత్యంత స్వాభావిక‌మైన‌టువంటివే.  మ‌న భ‌ద్ర‌త ద‌ళాల కు పూర్తి స్వేచ్ఛ ను ఇవ్వ‌డ‌మైంది.  మ‌న జ‌వానుల ప‌రాక్ర‌మం ప‌ట్ల మ‌న‌కు ప‌రిపూర్ణ విశ్వాసం ఉంది.  మ‌న దేశం లోని దేశ భ‌క్తులు మ‌న ఏజెన్సీ ల‌కు స‌రియైన‌టువంటి స‌మాచారాన్ని అందిస్తార‌ని, త‌ద్వారా ఉగ్ర‌వాదం పైన మ‌న పోరాటం మరింత ప‌దును తేలుతుంద‌న్న న‌మ్మ‌కం తో నేను ఉన్నాను.

ఉగ్ర‌వాద సంస్థ‌ లు మ‌రియు వాటి నాయ‌కులు ఒక తీవ్ర‌మైన‌టువంటి పొర‌పాటు ను చేశార‌ని, మ‌రి అందుకు గాను వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవ‌ల‌సి వుంటుంద‌ని నేను చెప్ప‌ద‌ల‌చాను.

ఈ దాడి వెనుక ఏ శ‌క్తి ఉన్న‌ప్ప‌టికీ, బాధ్యుల‌ ను శిక్షించ‌డం జ‌రిగి తీరుతుంద‌ని దేశ ప్ర‌జ‌ల కు నేను భ‌రోసా ను ఇస్తున్నాను.  మ‌మ్మ‌ల్ని విమ‌ర్శిస్తున్న‌ వారి యొక్క భావ‌న ల‌ను కూడా నేను గౌర‌విస్తాను. వారి అభిప్రాయాల‌ ను నేను పూర్తి గా అర్థం చేసుకోగ‌ల‌ను; మ‌రి విమ‌ర్శించే హ‌క్కు వారికి ఉంది.  

ఇది ఒక అత్యంత సంవేద‌న పూరిత‌ం అయిన‌టువంటి మ‌రియు భావోద్వేగ భరితమైన‌టువంటి క్ష‌ణం.  రాజ‌కీయంగా గేలి చేసేందుకు దూరం గా ఉండవలసింది గా ఇరు ప‌క్షాల లోని నా మిత్రుల ను నేను అభ్య‌ర్థిస్తున్నాను.  దేశం అంతా ఏక‌మై, ఒక దీటైన స‌మాధానాన్ని ఇస్తోంది.  దేశం ఒక్క‌టి గా ఉంది.  దేశం ఒకే స్వ‌రం తో మాట్లాడుతోంది.  మ‌రి ఈ స్వ‌రం ప్ర‌పంచానికి చేర‌వ‌ల‌సి ఉంది; ఎందుకంటే ఈ ర‌ణాన్ని గెల‌వ‌డం కోస‌మే మ‌నం చేస్తున్నాం.

ప్ర‌పంచం ఏకాకి ని చేసిన మ‌న పొరుగు దేశం ఇటువంటి చేష్ట‌ల కు ఒడిగ‌ట్ట‌డం ద్వారాను, ఈ త‌ర‌హా ప‌న్నాగం ద్వారాను భార‌త‌దేశాన్ని అస్థిర ప‌ర‌చ‌వ‌చ్చ‌ని న‌మ్మే ప‌క్షం లో పూర్తి గా త‌ప్పు చేస్తున్నట్లే.  వారు ఎన్న‌టికీ స‌ఫ‌లం కాలేరు.  అటువంటిది జ‌ర‌గ‌నే జ‌రుగ‌దు.  

ప్ర‌స్తుతం ఒక ప్ర‌ధానమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మ‌న పొరుగు దేశం ఈ వినాశ‌ం ద్వారా భార‌త‌దేశం పైన విప‌త్తు ను రువ్వ వ‌చ్చ‌ని కూడా న‌మ్ముతోంది.  వారి ఉద్దేశ్యాలు ఎన్న‌టికీ నెర‌వేర‌వు.  వారు న‌డుస్తున్న‌టువంటి మార్గం వారి ని వినాశం వైపు కు తీసుకు పోయింద‌ని, మ‌రి అలాగే మ‌నం ఎంచుకొన్న దారి మ‌న‌ల‌ను పురోగ‌తి వైపు కు, విజ‌యం వైపు కు తీసుకు పోతోంద‌ని కాలం నిరూపించింది.

ఆ త‌ర‌హా ప్ర‌తి ఒక్క కుట్ర కు, మ‌రి అలాగే  ఆ త‌ర‌హా ప్ర‌తి ఒక్క దాడి కి 130 కోట్ల మంది భార‌తీయులు గుణ‌పాఠాన్ని ఇవ్వ‌గ‌ల‌రు.  ఈ ఉగ్ర‌వాద దాడి ని అనేక శ‌క్తివంత‌మైన దేశాలు ప‌రుష ప‌ద‌జాలం తో ఖండించి, భార‌త‌దేశాని కి వాటి యొక్క మ‌ద్ద‌తు ను వ్య‌క్తం చేశాయి.

ఆ దేశాలన్నింటి కీ నేను కృతజ్ఞుడి ని.  ఉగ్ర‌వాదం పై పోరాడేందుకు మాన‌వ‌త పూర్వ‌క శ‌క్తులు అన్నీ ఒక్క‌టి కావాల‌ని నేను స‌ర్వుల‌ కూ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.  మాన‌వ‌త భరిత శ‌క్తులు అన్నీ కూడా ఏక‌మై ఉగ్ర‌వాదాన్ని ఓడించి తీరాలి.
 
ఎప్పుడైతే అన్ని దేశాలు ముక్త కంఠం తో ఉగ్ర‌వాదం పై పోరాడేందుకు ఏకోన్ముఖం గా సాగుతాయో, అప్పుడు ఉగ్ర‌వాద బెడ‌ద దీర్ఘ కాలం పాటు మ‌నజాల‌దు.

మిత్రులారా,

పుల్‌వామా దాడి అనంత‌రం మ‌స్తిష్కం లో, వాతావ‌ర‌ణం లో దుఃఖం, మానసిక వ్యథ నిండిపోయాయి.  అటువంటి దాడుల కు దేశం గ‌ట్టి గా ఎదురు దెబ్బ తీస్తుంది.  దేశం వూరికే ఉండిపోదు.  మ‌న శూరులైన అమ‌ర‌వీరులు వారి ప్రాణాల‌ ను త్యాగం చేశారు.  మ‌రి ఒక అమ‌ర‌ వీరుడు త‌న జీవితాన్ని రెండు విష‌యాల కోసం అర్ప‌ణం చేస్తాడు.  ఒక‌టో అంశం దేశ భద్రత కోసం అయితే, మ‌రి రెండో అంశం దేశం యొక్క వృద్ధి కోసం.  సాహ‌సికులైన అమ‌ర‌వీరులంద‌రికీ వ‌ంద‌నాన్ని ఆచ‌రిస్తూ, వారి దీవెన‌ల ను కోరుకుంటూ నేను మ‌రొక్క‌ సారి మీకు హామీ ని ఇస్తున్నాను..  అది ఏమిటంటే వారు వారి యొక్క ప్రాణాల‌ ను అర్పించిన‌టువంటి రెండు క‌ల‌ల‌ ను నెర‌వేర్చ‌డం కోసం మ‌నం మ‌న జీవితాల లోని ప్ర‌తి ఒక్క క్ష‌ణాన్ని అంకితం చేద్దాం అనేదే.  అభివృద్ధి కి మ‌రియు స‌మృద్ధి కి వేసిన బాట ను పటిష్టపరుస్తూ సాహ‌సికులైన అమ‌ర‌వీరుల ఆత్మ‌ల కు జోహారులు చేస్తూ మ‌నం ముందుకు క‌దులుదాం.  మ‌రి ఈ కార‌ణం గా వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు కు రూపు రేఖ‌ల‌ ను దిద్ది, ఈ యావత్తు భావన ను కార్యరూపం లోకి తీసుకువచ్చినటువంటి ప్ర‌తి ఒక్క ఇంజినీరు కు మరియు ప్ర‌తి ఒక్క శ్రామికుని కి నేను నా యొక్క కృత‌జ్ఞ‌త‌ ను వ్య‌క్తం చేస్తున్నాను.

చెన్నై లో త‌యారైన ఈ రైలు త‌న ఒక‌టో యాత్ర ను ఢిల్లీ మ‌రియు కాశీ ల మ‌ధ్య ఆరంభించ‌నుంది.  ఇది ‘ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ భార‌త్‌’ యొక్క నిజ‌మైన శ‌క్తి.  

మిత్రులారా,

గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల లో మేము భార‌తీయ రైల్వేల యొక్క స్థితిగ‌తుల‌ ను మార్చ‌డం కోసం చిత్త‌శుద్ధి తో, మ‌రెంతో క‌ఠోర శ్ర‌మ తో ప్ర‌య‌త్నించాం.  వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ కృషి కి ఒక నిదర్శనం.  గ‌డ‌చిన కొన్నేళ్ళ లో ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగం గా త‌యారీ లో గొప్ప అడుగులు వేసిన‌టువంటి రంగాల లో రైల్వే లు కూడా ఒక రంగం గా ఉంది.  అంతేకాదు, రైలు పెట్టెల కార్ఖానా ల‌ను న‌వీక‌రించే ప‌నులు మ‌రియు డీజ‌ల్ ఇంజిన్ ల విద్యుదీక‌ర‌ణ ప‌నులు పురోగ‌మిస్తున్నాయి.  ఈ కార‌ణం గా కొత్త క‌ర్మాగారాల ను కూడా ఇందుకోసం నెలకొల్ప‌డం జ‌రిగింది.

ఆన్‌లైన్ లో రైల్వే టికెట్ ల ను రిజ‌ర్వు చేసుకొనే స్థితి ఎలాగ ఉండేదో మీకు గుర్తు ఉండే ఉంటుంది.  ఆ కాలం లో ఒక నిమిషం వ్య‌వ‌ధి లో 2000 టికెట్ లకు పైగా బుకింగ్ చేసుకొనేందుకు వీలు ఉండేది కాదు.  ప్ర‌స్తుతం రైల్వే ల యొక్క వెబ్‌సైట్ వినియోగ‌దారు ల‌కు స్నేహ పూర్వ‌కం గా మారిపోయి, ఒక నిమిషం వ్య‌వ‌ధి లో 20 వేల కు పైగా టికెట్ ల ను బుక్ చేసుకొనేందుకు అనువు గా ఉంద‌న్న వాస్త‌వం నాకు నిజం గా సంతృప్తి ని క‌లిగిస్తోంది.  ఇదివ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉండేదంటే ఒకే ఒక రైల్వే ప‌థ‌కాన్ని ఆమోదించ‌డం కోసం ఇంచుమించు రెండు సంవ‌త్స‌రాలు ప‌ట్టేది.  ఇప్ప‌డు ఒక రైల్వే ప‌థ‌కాన్ని 3 లేదా 4 మాసాల లో గాని, లేదా ఎక్కువ లో ఎక్కువ 6 నెల‌ల లోప‌ల గాని ఆమోదించ‌డం సాధ్య‌ప‌డుతోంది.  ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు రైల్వే ల ప‌నుల కు ఒక నూత‌నోత్తేజాన్ని అందించాయి.  ఒక పెద్ద ఉద్య‌మం లో భాగం గా దేశ‌వ్యాప్తం గా బ్రాడ్‌గేజ్ రైలు మార్గాల మీది కాప‌లా లేని క్రాసింగ్ ల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది. 

మేము అధికారం లోకి వ‌చ్చిన‌ప్పుడు దేశం లో కాప‌లా లేని రైల్వే క్రాసింగ్ లు 8,300 ల‌కు పైగా ఉండేవి.  వీటివ‌ల్ల త‌ర‌చు గా ప్ర‌మాదాలు జ‌రిగేవి.  కాప‌లా లేని రైల్వే క్రాసింగ్ ల‌ను తొల‌గించ‌డం ద్వారా ప్ర‌మాదాల సంఖ్య కూడా త‌గ్గిపోయింది.  

దేశం లో రైలు ప‌ట్టాల‌ ను వేసే ప‌ని లేదా విద్యుదీకరించే ప‌ని ఇప్ప‌టికే రెట్టింపు వేగం తో జ‌రుగుతోంది.   దేశం లోని అత్యంత ర‌ద్దీ గ‌ల మార్గాల కు  ప్ర‌ధాన్యం ఇవ్వ‌డం ద్వారా సాంప్ర‌దాయ‌క రైళ్ళ నుండి ఆయా మార్గాల ను విముక్తం చేయ‌డం జ‌రుగుతోంది.  రైళ్ళ ను విద్యుదీక‌రించినందువ‌ల్ల కాలుష్యం త‌గ్గ‌డం ఒక్కటే కాక డీజల్ పై వ్య‌యం సైతం త‌గ్గుతుంది; రైళ్ళ వేగమూ పెరుగుతుంది.   

రైల్వే ల‌ను ఆధునికీక‌రించేందుకు జ‌రుగుతున్న ఈ ప్ర‌య‌త్నాలు నూత‌న ఉద్యోగ అవ‌కాశాల‌ ను కూడా సృష్టించాయ‌న్న‌ది స్ప‌ష్టం.  2014 వ సంవ‌త్స‌రం నాటి నుండి ఇంత‌వ‌ర‌కు రైల్వే ల‌ లో దాదాపు 1.5 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల నియామ‌కం జ‌రిగింద‌ని నా దృష్టి కి తీసుకు వ‌చ్చారు.  ప్ర‌స్తుతం కొన‌సాగుతూ ఉన్న భ‌ర్తీ ప్ర‌క్రియ ముగిసిన అనంత‌రం ఈ సంఖ్య 2.25 ల‌క్ష‌ల‌ కు  చేరుకొనేందుకు అవ‌కాశ‌ం ఉంది.

మిత్రులారా,

ఇంత త‌క్కువ కాలావ‌ధి లో అన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ కూడాను భార‌తీయ రైల్వే ల‌లో ప్ర‌తి ఒక్క‌టి నీ మార్చి వేశామ‌ని నేనేమీ చెప్పుకోబోవ‌డం లేదు.  మ‌రి అలా మేము ఎన్న‌టికీ చెప్పుకోలేము కూడా.  చేయ‌వ‌ల‌సింది ఇంకా ఎంతో ఉంది.  అయితే, నేను నిక్క‌చ్చి గా చెప్ప‌గ‌లిగేది ఏమిటంటే మ‌నం భార‌తీయ రైల్వే ల న‌వీక‌ర‌ణ దిశ గా శ‌ర వేగం గా ముందుకు పోతున్నాము అనేది.  మ‌రి మేము ఈ అభివృద్ధి ప‌య‌నానికి మ‌రింత జోరు ను అందిస్తామ‌ని మీకు భ‌రోసా ఇస్తున్నాను.  అది భూమి లేదా జ‌లం లేదా వాయువు కావ‌చ్చు; అది భార‌త‌దేశం లోని తూర్పు ప్రాంతం, ప‌శ్చిమ‌ ప్రాంతం, ఉత్త‌ర ప్రాంతం లేదా ద‌క్షిణ ప్రాంతం కావచ్చు..  మ‌న‌ం ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్’ మంత్రం జ‌పిస్తూ అభివృద్ధి బాట లో సాగుతూ, దానిని ముందుకు తీసుకు పోతాం.  అభివృద్ధి ద్వారా మ‌నం మ‌న అమ‌ర‌వీరుల‌ కు ప్ర‌ణామం చేస్తూ పోదాం.  మ‌రి భ‌ద్రత కు సంబంధించినంత వ‌ర‌కు ముష్క‌రుల ను మ‌న యావ‌త్తు శ‌క్తి తో శిక్షించి, ప్రాణ త్యాగం చేసిన వారి దేహాల నుండి స్ర‌వించిన ప్ర‌తి ఒక్క ర‌క్త‌పు బొట్టు కు ప్ర‌తీకారాన్ని తీర్చుకొందాం.

నా ఉప‌న్యాసాన్ని ఇంత‌టితో ముగిస్తున్నాను.  ఈ అమ‌ర‌వీరుల కు శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టించ‌డం కోసం నాతో పాటు ఎలుగెత్తి ప‌ల‌కండి మరి..

వందే మాత‌ర‌మ్ – వందే మాత‌ర‌మ్‌.

వందే మాత‌ర‌మ్ – వందే మాత‌ర‌మ్‌.

వందే మాత‌ర‌మ్ – వందే మాత‌ర‌మ్‌.