పిఎంఇండియా
సోమనాథ్ నుంచి వడోదరకు వెళ్లే మార్గంలో తీసిన సోమనాథ్ ఆలయం ఫోటోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.
భక్తి, చరిత్ర, నాగరిక స్ఫూర్తికి ప్రభాస్ పటాన్ తీరాన కొలువై ఉన్న సోమనాథ్ ఆలయం ప్రకాశవంతమైన ప్రతీకగా సగర్వంగా నిలిచి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనేక దాడులను, దండయాత్రలను, శతాబ్దాల పాటు ఎదురైన క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ఈ ఆలయం అజేయంగా నిలిచిందని శ్రీ మోదీ అన్నారు.
సోమనాథ్ క్షేత్రం ప్రతి భారతీయునికి బలాన్ని, ధైర్యాన్ని, కొత్త ఆశను ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘సోమనాథ్ నుంచి వడోదర వెళ్లే మార్గంలో ఈ ఫోటో తీశాను.
ప్రభాస్ పటాన్ తీరాన ఉన్న సోమనాథ్ ఆలయం భక్తికి, చరిత్రకు, మన నాగరికతా స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రతీకగా సగర్వంగా నిలిచి ఉంది. అనేక దాడులు, విదేశీ ఆక్రమణలు, శతాబ్దాల తరబడి సవాళ్లను తట్టుకుని ఈ క్షేత్రం అజేయంగా నిలిచింది. ఇది శాశ్వతమైనది. సోమనాథ్ ప్రతి భారతీయుడికి బలాన్ని, ధైర్యాన్ని, కొత్త ఆశను ప్రసాదిస్తుంది.
హర హర మహాదేవ్’’
Took this photo while on the way from Somnath to Vadodara…
— Narendra Modi (@narendramodi) May 11, 2026
On the shores of Prabhas Patan, the Somnath Temple stands tall as a radiant symbol of devotion, history and civilisational spirit. It has outlasted barbaric attacks, invasions and the passage of centuries. It is… pic.twitter.com/VPkF54tBJO
सोमनाथ से वडोदरा जाते समय यह तस्वीर खींची है…
— Narendra Modi (@narendramodi) May 11, 2026
प्रभास पाटन के तट पर सोमनाथ मंदिर श्रद्धा, भक्ति और भारत की सनातन संस्कृति का दिव्य प्रतीक बनकर आज भी अडिग खड़ा है। इस पावन मंदिर ने बर्बर आक्रमणों, विदेशी हमलों और सदियों के चुनौतीपूर्ण कालखंड को पार करते हुए अपनी अमर चेतना को… pic.twitter.com/bfCSuf4UMl