Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వర్దా తుపాను బాధిత ప్రజల సురక్ష కోసం ప్రార్థించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వర్దా తుపాను వల్ల తలెత్తిన ప్రతికూల వాతావరణానికి బాధితులైన ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేసినట్లు ట్విటర్ లో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను, వారి ఆస్తులను కాపాడడం కోసం స్థానిక పరిపాలన యంత్రాంగంతోను మరియు సైన్యంతోను కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తోందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

“వర్దా తుపాను వల్ల తలెత్తిన ప్రతికూల వాతావరణం వల్ల బాధితులైన ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేశాను. మీరంతా క్షేమంగా ఉండాలి.”

“బాధిత కుటుంబాలను, వారి ఆస్తులను కాపాడడం కోసం స్థానిక పరిపాలన యంత్రాంగంతోను మరియు సైన్యంతోను కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తోంది” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

***