Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాతావ‌ర‌ణ మార్పుల‌పైవ‌ర్థ‌మాన దేశాలతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంః శ్రీ న‌రేంద్ర మోదీ

వాతావ‌ర‌ణ మార్పుల‌పైవ‌ర్థ‌మాన దేశాలతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంః శ్రీ న‌రేంద్ర మోదీ


ఈ ఏడాది చివ‌ర్లో పారిస్‌లో వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ద‌స్సు (కాప్‌-21) జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ నేతృత్వంలో న్యూఢిల్లీలో భావస్వారూప్య అభివృద్ధి చెందుతున్న దేశాల ప్ర‌తినిధులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ ప్ర‌తినిధి బృందాల అధిప‌తుల‌తో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు.

శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం సారాంశంః

– వ‌ర్థ‌మాన దేశాలు ప‌ర్యావ‌ర‌ణానికి శ‌త్రువులు కావు. అభివృద్ధి చెందిన దేశాలు ఈ విష‌యాన్ని గుర్తించాలి.

– అభివృద్ధి, పురోగ‌తి అనేవి జీవావ‌ర‌ణానికి ప్ర‌తికూలం కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఈ మేర‌కు ఆలోచ‌న తీరును మార్చుకోవాలి.

– పురోగ‌తి ప‌థంలో వెళ్తున్న వారిని అప‌రాధులుగా చూడ‌వ‌ద్దంటూ ప్ర‌పంచాన్ని ఒప్పించాల్సిన అవ‌స‌రముంది.

– వాతావ‌ర‌ణ మార్పుల‌పై న‌వ‌త‌రాల‌కు ఉమ్మ‌డి ల‌క్ష్యం కోసం ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్యావ‌ర‌ణ అంశాల‌పై ఒకే విధ‌మైన పాఠ్యాంశాలు ఉండాలి.

– వాతావ‌ర‌ణ అంశాల‌పై భావ‌స్వారూప్య అభివృద్ధి చెందుతున్న దేశాల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు భార‌త్ సిద్ధంగా ఉంది. అయితే వాతావ‌ర‌ణ న్యాయ సూత్రాల‌ను ప్ర‌పంచం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

– ఇంధ‌న వినియోగం త‌గ్గ‌టానికి జీవ‌న‌శైలిలోనూ మార్పులు రావాలి.