Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారణాసిలో మహిళా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

వారణాసిలో మహిళా సమ్మేళనంలో పాల్గొన్న  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఈ రోజు వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుఅక్కడ ఆయన వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేశారు

ఈ సందర్భానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. కాశీ దైవిక శక్తులకు నిలయమని ఇక్కడ శృంగార గౌరీ మాతఅన్నపూర్ణ మాతవిశాలాక్షి మాతసంకట మాతగంగా మాత కొలువై ఉన్నారని పేర్కొన్నారుభారీ సంఖ్యలో తరలివచ్చిన సోదరీమణులుకుమార్తెలతో ఈ కార్యక్రమం అత్యంత పవిత్రంగా మారిందని ఆయన అన్నారు. “కాశీ గడ్డపై ఉన్న మీ అందరికీ అంటే కాశీ తల్లులుసోదరీమణులుకుమార్తెలందరికీ నేను నమస్కరిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు

ఈ సందర్భం నారీ శక్తిఅభివృద్ధిని రెండింటినీ ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారుకాశీలో అన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కాశీఅయోధ్య మధ్య అనుసంధానతను మెరుగుపరిచే పనులను కూడా చేపట్టినట్లు ఆయన తెలిపారుకాశీ నుంచి పుణెకుఅయోధ్య నుంచి ముంబయికి రెండు అమృత్ భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారుమహారాష్ట్ర ప్రజలు ఈ పుణ్యక్షేత్రాలను చేరుకోవడానికి ఇవి ఆధునిక అనుసంధానతను కల్పిస్తాయి. “ఇది ఉత్తరప్రదేశ్మహారాష్ట్ర మధ్య అనుసంధానతను మరింత మెరుగుపరుస్తుందిఅయోధ్యకాశీ విశ్వనాథ్ పుణ్యక్షేత్రాలను చేరుకోవడానికి ప్రజలకు మరో ఆధునిక మార్గాన్ని అందిస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.

దేశ నిర్మాణంలో మహిళలకు ఉన్న కీలక పాత్రను గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. ‌వికసిత్ భారత్‌కు అత్యంత బలమైన ఆధారం నారీ శక్తి‘ అని ఆయన అన్నారులోక్‌సభవిధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ప్రధాన జాతీయ లక్ష్యాన్ని సాధించే విషయంలో ఆయన అక్కడున్న వారి ఆశీస్సులను కోరారు. “మీ రిజర్వేషన్ హక్కును నిజం చేసేందుకు నేను అన్ని విధాలా కృషి చేస్తానని.. ఎటువంటి ప్రయత్నం వదిలిపెట్టనని మీకు హామీ ఇస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.

మహిళా సాధికారతలోని పరివర్తనాత్మక శక్తిని గురించి మాట్లాడిన ప్రధానమంత్రి.. ఇంట్లో ఒక మహిళ సాధికారత పొందితే మొత్తం కుటుంబానికి బలం చేకూరుతుందని తద్వారా సమాజందేశం బలపడతాయన్నారుభారతీయ మహిళలు ఎదుర్కొన్న చారిత్రక అడ్డంకులను గుర్తుచేసిన ఆయన.. తరతరాలుగా బాలికలు ఎదుర్కొన్న చిన్నచూపునువారి సామర్థ్యం– అవసరం– పద్ధతులపై ఉన్న ప్రశ్నలను ప్రస్తావించారుఇటువంటి వివక్ష కేవలం కాశీకే పరిమితం కాలేదనిఇది దేశవ్యాప్తంగా ఉందన్న ఆయన.. సమాజం ఈ అన్యాయాన్ని అలవాటుగా మార్చుకుందని పేర్కొన్నారు. “ఈ అడ్డంకులను సహజంగా అంగీకరించేవారుఇది మారాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

తిరోగమన ఆలోచనలను విచ్ఛిన్నం చేయాలనే తన నిబద్ధతను గుర్తుచేసిన శ్రీ నరేంద్ర మోదీ.. 25 ఏళ్ల క్రితం తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలికల కోసం రెండు అగ్రగామి పథకాలను ప్రారంభించిన విషయాన్ని చెప్పారుఅవే.. అమ్మాయిలు బడికి వెళ్లి చదువు పూర్తి చేసేలా చూడటానికి శాల ప్రవేశోత్సవం‘, వారి ఫీజుల చెల్లింపులో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి కన్యా కేలవని నిధి‘ అని తెలియజేశారు. “అప్పటి నుంచి నేటి వరకు మా ప్రభుత్వ విధానాలలో మహిళా సంక్షేమానికి నిరంతరం అత్యధిక ప్రాధాన్యత లభించింది” అని ఆయన పేర్కొన్నారు.

2014 నుంచి చేపట్టిన సమగ్ర సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 30 కోట్ల మందికి పైగా సోదరీమణుల కోసం బ్యాంక్ ఖాతాలను తెరవటం, 2.5 కోట్ల కంటే ఎక్కువ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కల్పించటం, 12 కోట్ల కంటే ఎక్కువ గృహాలకు నల్లా నీటి సౌకర్యం కల్పించటం వంటివి చేసినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ‘‘సుకన్య సమృద్ధి యోజనముద్రా యోజనమాతృ వందన యోజనఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో సహా ఈ కార్యక్రమాలు సోదరీమణులుకుమార్తెలను జాతీయ అభివృద్ధిలో కేంద్ర బిందువుగా ఉంచాయిప్రతి ప్రధాన పథకంలో సోదరీమణులుకుమార్తెలను కేంద్రంగా ఉంచడం మా నిజమైన నిబద్ధతకు నిదర్శనం” అని ప్రధాని పేర్కొన్నారు.

కాశీలో జరిగిన ఒక విజయవంతమైన కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ.. రెండు సంవత్సరాల క్రితం కేవలం ఒక నెలలోనే 27,000 మంది బాలికలకు సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచి ప్రతి ఖాతాలో రూ. 300 జమ చేసిన విషయాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారుఈ పథకం బాలికల విద్యను బలోపేతం చేయగా ముద్రా యోజన వారి ఆదాయానికి భరోసా కల్పించిందిఅలాగే పీఎం ఆవాస్ యోజన ద్వారా మొదటిసారిగా కోట్ల మంది సోదరీమణుల పేరు మీద ఆస్తులు నమోదయ్యాయి. “ఈ రోజు మన తల్లులుసోదరీమణులు నిజంగా తమ ఇళ్లకు యజమానులవుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

సాధికారతకు సౌకర్యంభద్రత పునాది అని చెప్పిన ప్రధానమంత్రి .. ఉత్తరప్రదేశ్‌లో గతంలో బాలికలు ఇంటి బయటకు రావడమే కష్టంగా ఉండే పరిస్థితితో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పోల్చారుభారతీయ న్యాయ సంహిత మహిళలపై నేరాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా కొత్త ఆత్మవిశ్వాసాన్ని కల్పించిందన్నారుమహిళా పోలీస్ స్టేషన్లుకౌన్సెలింగ్ కేంద్రాల నెట్‌వర్క్ నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. “కుమార్తెల పట్ల దురుద్దేశంతో వ్యవహరించే ఎవరికైనా ఏ గతి పడుతుందో ఇప్పుడు బాగా తెలుసు” అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక సాధికారతకు ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా చెబుతూ.. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడు  కుటుంబంలో వారి గొంతు కూడా అంతే బలంగా మారుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారుగత 11 ఏళ్లలో సుమారు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమయ్యారుఇందులో కాశీకి చెందిన సుమారు 1.25 లక్షల మంది సోదరీమణులు ఉన్నారువారికి లక్షలాది రూపాయల సహాయం అందిస్తూ వారు స్వతంత్రంగా పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాం. “ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఇప్పటివరకు కోట్ల మంది సోదరీమణులు లఖ్‌పతి దీదీలుగా మారారుఇందులో వారణాసికి చెందిన వేలాది మంది కూడా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు

మహిళా సాధికారతలో పాడిపరిశ్రమకు ఉన్న పాత్ర గురించి మాట్లాడుతూ.. బనాస్ డెయిరీతో అనుబంధం ఉన్న లక్షలాది మంది సోదరీమణులకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారువీరు నేడు నేరుగా రూ. 106 కోట్ల బోనస్‌ను అందుకున్నారుకాశీలోని పాడిపరిశ్రమలో ఉన్న మహిళలు తమ పనిని మరింత విస్తరించాలని కోరిన ఆయన.. భవిష్యత్తులో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమేవారణాసి అభివృద్ధి చెందుతుందిబనాస్ డెయిరీ వృద్ధి చెందుతుందిఈ బోనస్ కూడా పెరుగుతూనే ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు

ప్రభుత్వం మహిళలను మార్పు కారకాలుగా తీర్చిదిద్దే తీరును వివరిస్తూ.. వారిని స్వయం సమృద్ధిపరులుగా మార్చడానికి, ‘వికసిత్ భారత్‘ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి తెలియజేశారుబ్యాంకింగ్ సఖీలు డిజిటల్ చెల్లింపులను ముందుకు తీసుకెళ్తున్నారనిఇన్సూరెన్స్ సఖీలు బీమా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారనికృషి సఖీలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారనినమో డ్రోన్ దీదీలు వ్యవసాయ డ్రోన్ విప్లవానికి సారథ్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారుఅంతేకాకుండా సైన్యంనౌకాదళంవాయుసేనసైనిక పాఠశాలలురక్షణ అకాడమీలలో మన కుమార్తెల కోసం కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. “మా ప్రభుత్వం అంటే మహిళా సాధికారతమహిళల అభ్యున్నతిమహిళల జీవితాలను సులభతరం చేయడం అని అర్థం” అని ఆయన ఉద్ఘాటించారు

అన్ని రంగాలలో మహిళలు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారన్న ప్రధానమంత్రి.. అందుకే విధాన రూపకల్పనజాతీయ నిర్ణయాధికారంలో వారికి మరింత పెద్ద పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారుకొత్త పార్లమెంటును నిర్మించడంలో సోదరీమణుల భాగస్వామ్యం కూడా ఒక ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారుకొత్త పార్లమెంటు భవనం నిర్మించిన తర్వాత చేపట్టిన మొదటి పని నారీ శక్తి వందన్ అధినియం-2023′ని ఆమోదించడమన్న ఆయన.. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ చట్టం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని తెలిపారు. “ఇప్పుడు ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన పార్లమెంటరీ కార్యకలాపాలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన శ్రీ నరేంద్ర మోదీ.. ఎక్కువ మంది మహిళలు విధానసభపార్లమెంటుకు ఎన్నికయ్యేలా చేయడానికి ఒక రాజ్యాంగ సవరణను తీసుకొచ్చినా కానీ అది ఆమోదం పొందలేదని అన్నారుఅస్సాంకేరళపుదుచ్చేరిబెంగాల్తమిళనాడు రాష్ట్రాల్లో మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

నాగరిక్ దేవో భవ’ అనే మంత్రంతో ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా కేంద్రీకృత విధానాన్ని వివరిస్తూ.. విద్యఉపాధిఆరోగ్య సంరక్షణనీటిపారుదలఫిర్యాదుల పరిష్కారం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని ప్రధానమంత్రి చెప్పారుఇదే స్ఫూర్తితో ఈ రోజు అనేక కీలక ప్రాజెక్టులతో కాశీ అభివృద్ధిని విస్తరించినట్లు ఆయన పేర్కొన్నారు. “గంగా నదిపై నిర్మిస్తున్న సిగ్నేచర్ బ్రిడ్జ్ పూర్వాంచల్‌ అనుసంధానతను మరింత బలోపేతం చేస్తుంది” అని  ఆయన పేర్కొన్నారు.

గత దశాబ్ద కాలంలో కాశీ ఉత్తరతూర్పు భారతదేశానికి ఒక ప్రధాన ఆరోగ్య కేంద్రంగా ఎదిగిందన్న ప్రధానమంత్రి.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను 500 పడకల మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. 100 పడకల క్రిటికల్ కేర్ భవనానికి కూడా శంకుస్థాపన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. “ఇది తీవ్రమైన వ్యాధులకు చికిత్స అందించడానికి కాశీలో ఒక భారీ సదుపాయాన్ని కల్పిస్తుంది” అని ఆయన అన్నారు

కాశీ అభివృద్ధికి ఉన్న సమగ్రసున్నితమైన స్వభావాన్ని వివరించిన ప్రధానమంత్రి.. గంగా నది శుద్ధీకరణఘాట్ల అభివృద్ధిపరిపాలనా భవనాల నిర్మాణంహర్హువా– భవానీపూర్‌లో రైతుల కోసం నిల్వ సౌకర్యాలువృద్ధాశ్రమాలుమహిళా వసతి గృహాలతో సహా అనేక కార్యక్రమాలను ప్రస్తావించారు. “ఈ ప్రాజెక్టులన్నీ వారణాసివాసులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయిఇవి సున్నితమైనప్రజాకేంద్రీకృత అభివృద్ధి పట్ల మా నిబద్ధతను తెలియజేస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

కాశీ వారసత్వంవైభవాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న నిరంతర చర్యల గురించి చెప్పిన శ్రీ నరేంద్ర మోదీ.. ఈ కృషిలో అంతర్భాగంగా ఉన్న సత్ కబీర్ స్థలి‘ అభివృద్ధినగ్వాలోని సత్ రవిదాస్ పార్కు‘ పునరుద్ధరణను ప్రత్యేకంగా ప్రస్తావించారు. “మన వారసత్వాన్ని కాపాడటంతో పాటు బలోపేతం చేయడానికి మేం చేపట్టిన నిరంతర కార్యక్రమాల్లో ఇవి భాగం” అని ఆయన పేర్కొన్నారు.

కాశీకి ఉన్న శాశ్వత స్వభావానికికొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మధ్యనున్న సరిపోలిక ప్రస్తావించిన ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారుఈ అభివృద్ధి పనుల విషయంలో శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. సభలో ఉన్నవారి ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపారు. “మన కాశీ అక్షయమైనది.. నిరంతరం సాగేదిఅదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిరంతరం చైతన్యవంతంగా సాగుతాయి” అని ఆయన ఉద్ఘాటించారు.

***