పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వచ్చిన గ్రామ ప్రధాన్ లను ఈ రోజు న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో సత్కరించారు. ప్రధాన మంత్రి తో భేటీ అయిన ఇటువంటి బృందాలలో ఇది రెండోది.
బృందం సభ్యులతో ముచ్చటించిన ప్రధాన మంత్రి వారిని ప్రతి ఆడ పిల్లకు చదువు చెప్పించడం, తమ తమ పల్లె లలో స్వచ్ఛత కు పెద్ద పీట వేయడం దిశగా కృషి చేయవలసిందిగా ఉత్సాహపరిచారు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదు అని ఆయన ఈ సందర్భంలో స్పష్టంచేశారు. స్వచ్ఛతే సౌభాగ్యానికి కీలకం అని ఆయన అన్నారు.
ప్రతి ఒక్క ప్రధాన్ తన పదవీకాలంలో నిర్దిష్ట అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేటట్లు కృతనిశ్చయులు కావాలని, ఈ పనులు చిరకాలం మిగిలిపోయే వారసత్వంగా ఉంటాయని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
Today again, met a group of village Pradhans from Varanasi. We had a very invigorating & comprehensive interaction. https://t.co/2vt3tDxg94
— Narendra Modi (@narendramodi) August 9, 2016