Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారణాసి లో వరదల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారణాసి లో వరదల పరిస్థితిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

“వారణాసి లో వరదలు ఎంతో ఆందోళన కలిగించాయి. పరిస్థితిని పి ఎమ్ ఒ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

రక్షణ, సహాయక కార్యక్రమాలు చేపట్టడానికి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు వారణాసిలో మకాం వేశాయి. అక్కడి ఎమ్ పి కార్యాలయం 24 గంటలు చేతనైన సహాయాన్నంతా చేయడమే పనిగా పెట్టుకొంది” అని ప్రధాన మంత్రి వెల్లడించారు.