Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వార‌ణాసిలో ప్ర‌ధాని

వార‌ణాసిలో ప్ర‌ధాని

వార‌ణాసిలో ప్ర‌ధాని

వార‌ణాసిలో ప్ర‌ధాని

వార‌ణాసిలో ప్ర‌ధాని

వార‌ణాసిలో ప్ర‌ధాని

వార‌ణాసిలో ప్ర‌ధాని


ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర‌మోదీ శుక్ర‌వారం వార‌ణాసిలో ఇంటిగ్రేటెడ్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ స్కీమ్ ను (ఐపిడిఎస్‌) ప్రారంభించారు. రోడ్డు, విద్యుత్ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేయ‌డంతో పాటు బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంట‌ర్ ను జాతికి అంకితం చేశారు. అలాగే రామ్ న‌గ‌ర్ పోస్టాఫీసు లో ఏర్పాటు చేసిన ప్రయాణికుల రిజ‌ర్వేష‌న్ కార్యాల‌యాన్ని రిమోట్ స‌హాయంతో ప్రారంభించారు.

దీర్ఘ‌కాలంగా భార‌త‌దేశానికి విజ్ఙాన దీపాన్ని అందించిన వార‌ణాసి న‌గ‌రం… ఇప్పుడు భార‌త‌దేశం యావ‌త్తుకు ఐపిడిఎస్‌ తో ఇంధ‌న‌పు వెలుగులు కూడా అందించేందుకు సంసిద్ధ‌మ‌వుతున్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. రోడ్లు, విద్యుత్‌, ఆరోగ్య ప్రాజెక్టు ల‌తో స‌హా ఈ రోజు వార‌ణాసిలో ప్రారంభించిన వివిధ కార్య‌క్ర‌మాలు వార‌ణాసి అభివృద్ధికి, ప‌ర్యాట‌కులు, యాత్రికులకు స‌మ‌గ్ర సౌక‌ర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన‌వ‌ని చెప్పారు.

ఈ చారిత్ర‌క న‌గ‌రానికి గ‌ల ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్ర‌భుత్వం వార‌ణాసిలోని పాత‌కాలం నాటి విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఐపిడిఎస్ ద్వారా ఆధునికీకరణం చేస్తుంద‌ని ప్ర‌ధాని తెలిపారు. దీన్ని భార‌త‌దేశం లోని ఇత‌ర న‌గ‌రాల‌కు కూడా విస్త‌రించ‌నున్న‌ట్టు చెప్పారు.

2022లో స్వ‌తంత్ర భార‌త 75వ స్వాతంత్ర్య‌ వేడుక‌లు నిర్వ‌హించుకునే నాటికి స్వాతంత్ర్య యోధుల క‌ల‌ల‌న్నింటినీ నిజం చేయాల్సిన బాధ్యతని, అవ‌స‌రాన్ని ఆయ‌న గుర్తు చేశారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రికీ అన్ని స‌మ‌యాల్లోనూ నాణ్య‌మైన విద్యుత్తును అందించ‌డం ఆ క‌ల‌ల సాకారంలో ఒక ప్ర‌ధానాంశ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాల‌ని త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని ప్ర‌ధాని వార‌ణాసి ప్ర‌జ‌ల‌ను కోరారు.

వార‌ణాసిలోని యువ‌త‌, మ‌హిళలు త‌న స్వ‌చ్ఛ భార‌త్ పిలుపున‌కు సానుకూలంగా స్పందించారంటూ న‌గ‌రంలోని ఘాట్‌ల‌లో ఆ చిత్త‌శుద్ధి ప్ర‌తిబింబిస్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో శిక్షా మిత్ర‌లపై ఏర్ప‌డిన వివాదం గురించి ప్ర‌స్తావిస్తూ ఈ విష‌యంలో ధైర్యంగా ఉండాల‌ని వార‌ణాసి ప్ర‌జ‌ల‌ను ఆయ‌న కోరారు. దానిపై కోర్టు ఉత్త‌ర్వులు వెలువ‌డ‌గానే వార‌ణాసి ఎంపి హోదాలో ఆ ప‌థ‌కం గురించి తాను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో చ‌ర్చిస్తాన‌ని ప్ర‌ధాని చెప్పారు.

ఆర్థికాభివృద్ధి, ఉపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల‌తో పాటు చిన్న , మ‌ధ్య‌త‌రహా పారిశ్రామికుల‌తో కూడిన ప‌ర్స‌న‌ల్ సెక్టార్ కూడా ఒక చోద‌క శ‌క్తిగా నిలుస్తుందంటూ ముద్రా బ్యాంక్‌, నైపుణ్యాల వృద్ధి కార్య‌క్ర‌మాల ద్వారా ఆ విభాగానికి ఉత్తేజం నింపే విష‌యంపై తాను దృష్టి సారించిన‌ట్టు ప్ర‌ధాని తెలిపారు.

ఉత్త‌రప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌ రామ్‌నాయ‌క్‌, కేంద్ర విద్యుత్ శాఖ స‌హాయమంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ‌ పీయూష్ గోయ‌ల్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.