Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాషింగ్ టన్ డి సి లో జూన్ 6, 2016 న ప్రధాన మంత్రి కార్యక్రమాలు

వాషింగ్ టన్ డి సి లో జూన్ 6, 2016 న ప్రధాన మంత్రి కార్యక్రమాలు

వాషింగ్ టన్ డి సి లో జూన్ 6, 2016 న ప్రధాన మంత్రి కార్యక్రమాలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం వాషింగ్ టన్ డి సి కి చేరుకొన్నారు. ఆయన అర్లింగ్ టన్ సమాధి స్థలం సందర్శించి అజ్ఞాత సైనికుల గోరీ వద్ద శ్రద్ధా కుసుమాల మాలను అర్పించారు.

అలాగే ఆయన స్పేస్ షటిల్ కొలంబియా స్మృతి చిహ్నం వద్ద కూడా ఆయన శ్రద్ధా కుసుమాల మాలను సమర్పించారు. కొలంబియా పతనం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రోదసి యాత్రికురాలు కల్పన చావ్లా భర్త శ్రీ జీన్ పియరి హ్యారిసన్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా హాజరైన వారిలో రోదసి యాత్రికురాలు సునీత విలియమ్స్ కూడా ఉన్నారు.

భారతదేశానికి బహుమూల్య ప్రతిమలను యు ఎస్ తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యు ఎస్ ప్రభుత్వ ప్రధాన న్యాయవాది లోరెటా లించ్ పాల్గొని మాట్లాడుతూ దాదాపుగా 200 శిల్పకృతులను భారతదేశానికి వాపసు చేసే ప్రక్రియ మొదలైనట్లు, ఇంతవరకు పన్నెండింటిని వెనుకకు ఇచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారసత్వ సంపద అనేది దేశాలను పెనవేసే ఒక గొప్పదైన బంధం కాగలదన్నారు. కొందరికి ఈ శిల్పకృతుల విలువ ధన సంబంధమైంది కావచ్చు కానీ, భారతదేశానికి మాత్రం వీటి విలువ అంతకన్నా మించినదని, అవి మా సంస్కృతిలో, వారసత్వంలో ఒక భాగం కావడమే ఇందుకు ఒక కారణం అని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రధాన మంత్రి బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూషన్, అట్లాంటిక్ కౌన్సిల్, ఇంకా కార్ నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్ నేషనల్ పీస్, తదితర సంస్థలకు చెందిన ఆలోచనపరులతో మాటామంతీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.