Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ భారత్‌ను 2047 నాటికి ఆవిష్కరించడంలో యువత పాత్రపై వ్యాసం ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు.

గత 12 సంవత్సరాల్లో భారత్‌లో చోటు చేసుకున్న మార్పుల గాథ మన దేశ యువత గాథ కూడా అని ఈ వ్యాసం ప్రముఖంగా ప్రస్తావించిందిఒక దార్శనికత నుంచి స్ఫూర్తిని పొంది.. నైపుణ్యాలను నేర్పించడంనూతన ఆవిష్కరణలుఔత్సాహిక పారిశ్రామికత్వ రంగాల్లో ఇదివరకెప్పుడూ లేనంత స్థాయి పెట్టుబడుల ఊతాన్నీఅమృత కాలపు యువతరానికి వారి ఆకాంక్షల్ని నెరవేర్చుకొనేందుకూదేశ నిర్మాణానికి తోడ్పడేందుకూ అవకాశాల్నీ అందిస్తున్నామని వ్యాసంలో తెలిపారు. 2047 కల్లా వికసిత్ భారత్‌ను నిర్మించడంలో యువ భారతం పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా వ్యాసంలో వివరించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘భారత్‌లో గత 12 సంవత్సరాల్లో చోటు చేసుకున్న మార్పుల గాథ దేశ యువతకు చెందిన గాథ కూడామా దార్శనికత నుంచి స్ఫూర్తిని పొంది.. నైపుణ్యాలను నేర్పించడంనూతన ఆవిష్కరణలుఔత్సాహిక పారిశ్రామికత్వ రంగాల్లో ఇదివరకెప్పుడూ లేనంత స్థాయిలో పెట్టుబడులు పెడుతూఅమృత కాలపు యువతరానికి వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికీదేశ నిర్మాణంలో తోడ్పాటును అందించడానికీ అవకాశాల్ని అందిస్తున్నాం.

వికసిత్ భారత్‌ను 2047 కల్లా ఆవిష్కరించడంలో భారతదేశ యువత పోషించాల్సిన పాత్రపై కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ లోతైన ఆలోచనతో రాసిన వ్యాసాన్ని చదవండి’’ అని పేర్కొంది.

 

***