పిఎంఇండియా
ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం దేశ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని బలోపేతం చేసిందనీ, అంతర్జాతీయ వేదిక మీద భారత్ ప్రతిష్ఠను పెంపొందించిందనీ ఆ వ్యాసం వివరించింది. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగుతున్న ప్రయాణం.. ఆశ, ఉద్దేశం, భాగస్వామ్యాలతో స్ఫూర్తిని పొంది ఒక ఉమ్మడి ఆకాంక్షగా రూపుదిద్దుకొందని కూడా ఆ వ్యాసం వర్ణించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఒక వ్యాసాన్ని రాశారు. అందులో.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం దేశ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని బలోపేతం చేసిందనీ, అంతర్జాతీయ వేదిక మీద భారత్ ప్రతిష్ఠను పెంపొందించిందనీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగుతున్న ప్రయాణాన్ని ఆశ, ఉద్దేశం, భాగస్వామ్యాల స్ఫూర్తితో రూపుదిద్దుకొన్న ఒక ఉమ్మడి ఆకాంక్షగా ఆమె వర్ణించారు’’ అని తెలిపారు.
***