Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని

విజయదశమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని


భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం, విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాజధాని నగరమైన ‘అమరావతి’కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ… ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన చట్టంలో నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అక్షరాలా, తు.చ. తప్పకుండా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

నూతన రాజధాని నిర్మాణాన్ని చేపట్టి, దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చూపిస్తున్న శ్రద్ధ, ఉత్సాహాన్ని ప్రధాని మోదీ అభినందించారు. పట్టణీకరణను సమస్యగా, సవాలుగా కాకుండా… ఒక అవకాశంగా స్వీకరించాలని మోదీ తెలిపారు. అమరావతి నగరం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు.

ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కె.చంద్రశేఖరరావును ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయన దీనికి హాజరు కావడంపట్ల ప్రధాని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండుగా విడిపోయినప్పటికీ… వారి ఆత్మ మాత్రం ఒక్కటేనని, అది ‘తెలుగు’ అని ప్రధాని తెలిపారు. రెండు రాష్ట్రాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న కృషి గురించి ప్రధాని ప్రసంగించారు. ‘స్టార్ట్‌-అప్స్‌’లో ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రధానమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు.

నవ్యాంధ్ర రాజధాని కోసం దేశవ్యాప్తంగా అనేక పవిత్ర క్షేత్రాల నుంచి మట్టి నీరు సేకరిస్తున్న నేపథ్యంలో… ‘మీ అందరిలాగే నేను కూడా మట్టి, నీరుతీసుకొచ్చాను’ అని సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రధాని తెలిపారు. యమునా నది నుంచి నీటిని, పార్లమెంటు ప్రాంగణలోని మట్టిని సేకరించానని చెప్పారు. తద్వారా… ఒకరకంగా అమరావతి దేశ రాజధాని ఢిల్లీకి ప్రతీకగా నిలుస్తుందని చెప్పవచ్చునన్నారు.

ఇక, ప్రధానమంత్రి తిరుపతి విమానాశ్రయంలో ‘గరుడ’ టెర్మినల్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగంలో అభివృద్ధి, ఇతర సదుపాయాల కల్పన కోసం విస్తృతంగా కృషి చేస్తోందని తెలిపారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎల‌క్ట్రానిక్స్ హబ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.